యువనేస్తం… ఈ-పుస్తకం!

యువతలో వ్యాపిస్తున్న ఈ-బుక్ రీడింగ్ అలవాటు గురించి, యువరచయితలు తమకు అందుబాటులో ఉన్న ఈ-పబ్లిషింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటున్న తీరు గురించి ఈనాడు ప్రత్యేక పేజి “ఈతరం” లో (తేదీ 1 జూన్ 2013) ఒక వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసం నుంచి కొన్ని పేరాలు ఇక్కడ చదవండి.

* * *

యువగుండెల్లో… భావోద్వేగపు పరిమళాలు… అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు… అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే… కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్ పుస్తక ప్రచురణ సంస్థలు… సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి… ప్రచారం, మార్కెటింగ్ బాధ్యతా వాళ్లదే!

* * *

కుర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం ‘డిజిటల్’ బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను ‘ఈ-పుస్తకం’గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న ‘ఈ-రీడింగ్’ అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ‘ఈ-రీడర్’ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లలో పుస్తకాల డౌన్‌లోడింగ్ పెరుగుతున్న ధోరణి, యువ రచయితలకు ఆన్‌లైన్ మార్గాలు పరుస్తోంది.

* * *

కినిగెలాంటి సంస్థలైతే తమ పుస్తకాల గురించి మీడియాలోనూ ప్రకటనలిస్తున్నాయి. ఇక ఈ-పుస్తకాల్ని కాపీ చేయకుండా, పైరసీకి ఆస్కారం లేకుండా డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్(డీఆర్ఎం) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ప్రచురణకర్తలు. కొన్నవాళ్లు మాత్రమే చదవగలరు.

* * *

ఇంకా తన తొలి రచనని కినిగెలో ఈ-బుక్‌గా ప్రచురించిన యువ రచయిత అద్దంకి అనంతరామ్ గురించి కూడా ప్రస్తావించిందీ వ్యాసం.

వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవచ్చు.

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>