మంచి కథల్ని రాసి- అచ్చువేసిన ఆ కథా సంకలనానికి ‘‘మనసు తడి ఆరనీకు’’ అనే అందమైన ఆర్ద్రమైన పేరుపెట్టి తెలుగు పాఠకులకు అందించారు ఓం ప్రకాశనారాయణ వడ్డి. కొలకలూరి ఇనాక్ రచయితను పరిచయం చేశారు. విహారిలో చూపును ఆవిష్కరించారు. వడ్డి విజయసారథి కథల వెనుక కథల గురించి వివరించారు. నాలుగో అంశంగా రచయిత ఈ పుస్తకం ఎందుకో చెప్పారు. ‘‘నాణానికి రెండో వైపు’’తో మొదలయి ‘‘మార్నింగ్‌వాక్’’తో ముగుస్తుంది. ఈ కథలన్నీ వివిధ వారపత్రికలలో ఇతఃపూర్వమే అచ్చుఅయ్యాయి. పుస్తకం మొత్తం అందంగా తీర్చిదిద్దబడింది. అచ్చు తప్పులించుమించుగా లేవనే చెప్పాలి. ఇదొక మంచి విషయమేకదా!కథలకెంచుకున్న ఇతివృత్తం- ఇతివృత్తాంతర గతమైన పాత్రలు- పాత్రోచితమైన శీలము శీలాభ్యస్తమైన విద్య, విద్యాభిషిక్తమైన విజ్ఞత అన్నీ అక్షరం అక్షరం చదివితే అందులో మనకి తప్పకుండా కనిపిస్తాయి. అందరూ చదివి- ముందు మాటలందించిన ముగ్గురుమూర్తుల సందర్భ సాన్నిహిత్యాన్ని మీరూ ఔననండి.
– సాంధ్యశ్రీ , ఆంధ్రభూమి దినపత్రిక, అక్షర పేజి, 01/06/2013
* * *
“మనసు తడి ఆరనీకు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాలను తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
మనసు తడి ఆరనీకు On Kinige