విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ శతాబ్దంలో రచించిన “రాయవాచకము” పుస్తకాన్ని గుంటూరుకి చెందిన మిత్రమండలి ప్రచురణలు వారు శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పటాలు, చిత్రాలు మరియు వివరణలతో ప్రచురించారు.
ఈ పుస్తకం ఆవిష్కరణ సభ ది. 13 జూలై 2013 శనివారం సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అన్నమయ్య కళావేదిక ప్రాంగణంలో జరుగుతుంది. మహాత్మాగాంధి కళాశాల, గుంటూరు ప్రధానాచార్యులు; ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్లానింగ్ & మానిటరింగ్ బోర్డు సభ్యులు అయిన ప్రొఫెసర్ డి.ఏ.ఆర్. సుబ్రహ్మణ్యం సభకు అధ్యక్షత వహిస్తారు.
ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల 19వ తరం వారసుడు రాజా ఆరవీటి శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు.
సాహితీ విమర్శకులు, జేకేసి కళాశాల పూర్వ తెలుగు విభాగాధిపతి డా. కడియాల రామమోహనరాయ్ గ్రంథాన్ని సమీక్షిస్తారు.
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, సంగీత విద్వాన్ డా. భూసురపల్లి వేంకటేశ్వర్లు శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వం గురించి ప్రసంగిస్తారు.
స్వధర్మ సేవాసంస్థ, గుంటూరు వారు సభకు ఆహ్వానిస్తున్నారు.