స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

ఫలితాలు వెలుబడ్డాయి. ఇక్కడ చూడండి. 

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్

(2013)

“750 పదాల”

స్మార్ట్ స్టోరీ

రాయండి

రూ. 10,000/-

విలువైన

బహుమతులు

గెలుచుకోండి

మిత్రులారా…

మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి, మీ కీబోర్డులకి పనిచెప్పండి…. రూ.10,000/- వరకూ గెలుచుకునే చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

మీరు చేయాల్సిందల్లా.. కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)కి 750 పదాల లోపు, ఒక స్మార్ట్ స్టోరీ రాసి submit@kinige.com కి పంపిస్తే చాలు! మీ కథ బహుమతి గెలుచుకునే అవకాశం. వివరాలు దిగువ …

ప్రథమ బహుమతి:

మీ కథ… కినిగె ప్రథమ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.4000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ద్వితీయ బహుమతి

మీ కథ… కినిగె ద్వితీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.2000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

తృతీయ బహుమతి

మీ కథ… కినిగె తృతీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.1000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ప్రోత్సాహక బహుమతులు (6 కథలకు)

మీ కథ… కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్‌లో కన్సోలేషన్ ప్రైజ్‌కి ఎంపికైతే… మీకు రూ.500/- విలువగల ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

మీరు చేయదగినవి!

1. మీకు నచ్చిన ఇతివృత్తాన్ని ఎంచుకోవచ్చు

2. కావాలనుకుంటే కలం పేరు వాడవచ్చు (*కానీ, కినిగె అడిగినప్పుడు, మీ అసలు పేరు, గుర్తింపులను ఋజువులతో సహా చూపవలసి ఉంటుంది)

3. మీరు టెక్స్ట్ పాడ్, నోట్ పాడ్, లేదా ఎం. ఎస్. వర్డ్ డాక్యుమెంట్ లేదా తత్సమాన డాక్యుమెంట్ ఏదైనా ఉపయోగించవచ్చు. తెలుగు అక్షరాలను స్పష్టంగా చూపే ఏ అప్లికేషన్ని అయినా వాడేందుకు సంకోచించనవసరం లేదు.

4. మీ కినిగె స్మార్ట్ స్టోరీకి వన్నె తెచ్చే యోగ్యమైన బొమ్మలను జోడించండి (*కాపీరైట్‌ని గౌరవించడం మరచిపోవద్దు)

మీరు చేయాల్సినవి!

1. మీరు మీ రచనని కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసమే రాయాలి

2. మీ కినిగె స్మార్ట్ స్టోరీని యూనికోడ్‌లో మాత్రమే* టైప్ చేయాలి

3. టైపింగ్ దోషాలు, అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

4. సబ్జెక్ట్ లైన్‍లో “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం” అని రాయాలి. మీ స్మార్ట్ స్టోరీ (2013) పేరు ప్రస్తావించాలి.

5. మీ పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్ (పిన్‌కోడ్‌తో సహా) పంపాలి.

6. మీ కథలను 20 సెప్టెంబర్ 2013లోగా కినిగెకి అందేలా పంపాలి

7. మీ రచనలను submit@kinige.com కి పంపాలి

8. మీ వయసు డిసెంబరు 2013 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

మీరు చేయకూడనివి!

1. గతంలో ప్రచురితమైన కథలు పంపకూడదు.

2. ఇతర పోటీలలోగాని లేదా ఇతర ప్రచురణకర్తలు లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణల వద్ద పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు.

3. అనువాద కథలు పంపకూడదు.

4. ఒక వేళ మీ కథకు బహుమతి లభిస్తే, ఆ కథని మీరు ఏ బ్లాగులో గానీ, వెబ్‌జైన్‌లో గాని, ఇతర సోషల్ మీడియా సైట్లలో గాని లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో కనీసం ఒక ఏడాది వరకు ప్రచురించరాదు.

5. ఈ నిబంధనలలో దేనినైనా, అన్నింటినీ లేదా కొన్నింటిని మీ కథ ఉల్లంఘిస్తే, మీరు పోటీకి అనర్హులవుతారు.

6. వెరసి, మీరు కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం సరికొత్త కథ, కినిగెకి మాత్రమే రాయల్సి ఉంటుంది.

మీకు సహాయపడే వనరులు:

మీ రచనలను యూనికోడ్‌లో టైప్ చేసేందుకు

1. lekhini.org

2. సురవర తెలుగు కీబోర్డు suravara.com

3. యూనికోడ్‌లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక:

పోటీ ఫలితాల విషయంలో కినిగెదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే, పోటీకి అనర్హులవుతారు.

*ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే support@kinige.com కి ఈమెయిల్ చేయాలి

మీ రచనలు కినిగెకి పంపడానికి తుది గడువు 20 సెప్టెంబర్ 2013!

Related Posts:

30 thoughts on “స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

 1. Pingback: కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖ రచయిత మధుబాబు అభిప్రాయం | కినిగె బ్లాగు

 2. నమస్కారం సర్ ! మీరు ప్రవేశ పెట్టిన స్మార్ట్ స్టొరీ కాంపిటీషన్ (2013) లో నేను పాల్గొనదలిచాను. నేను పంపించబోయే కథలో నా పేరును ఉపయోగించవచ్చా ?
  [Admin] ఉపయోగించవచ్చు. [/Admin]

 3. likhini lo type chesi ms word lo paste cheste saripothundi kada! naku unicode ante ento ardham kaledu…. chepthara please…..!

  [Admin]అవునండీ. అంతే. లేఖినిలో వచ్చేది కూడా తెలుగు యూనీకోడే. [/Admin]

 4. email lo kelli subject daggara “kinige smart story compitition (2013) kosam” ani raasi, story unna ms word file ni attach cheyali…..? and mottam antha telugulone undali… anthe kada…..!?
  [Admin]అవునండీ. మొత్తం తెలుగులోనే ఉండాలి. తెలుగులో టైపు చెయ్యడం కోసం http://lekhini.org వాడవచ్చు. [/Admin]

 5. Pagemaker file lo type chesi attach cheste ok kada?
  [Admin] పేజ్ మేకరులో అను ఫాంట్స్, శ్రీలిపి వంటి పాత తరం సాంకేతికత వాడితే అది యూనీకోడ్ కాదు, కనుక అది అంగీకరించబడదు. మీరు లేఖిని లేదా http://suravara.com వంటి టూల్స్ ద్వారా తెలుగు యూనీకోడులో టైపు చెయ్యవచ్చు. అలా చేసినదాన్ని నోటుప్యాడులో గాని, వర్డ్ లో కాని అతికించి మాకు పంపవచ్చు. [/Admin]

 6. ఒకటి కంటే ఎక్కువ కథలు పంపవచ్చా……? మా చిరునామా ఎక్కడ ప్రస్తావించాలి? చిరునామా లేదా వయసు ధ్రువీకరణలు ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా? బొమ్మలు తప్పని సరిగా ఉంచాలా? చెప్పగలరు … ధన్యవాదాలు ….!
  [Admin]ఒకటి కంటే ఎక్కువ కథలు పంపవచ్చు. చిరునామా మరియు ఇతర వివరాలు submit@kinige.com కు పంపే వేగులో తెలపాలి. ద్రువీకరణ ప్రస్తుతం అవసరం లేదు. తరువాత మేమే అడిగి తీసుకుంటాము. [/Admin]

 7. మీరు ఎప్పుడు,ఎవరు కాంపెటీసన్ లో విన్ ఐనది చేపుతారు.చెప్పండి ప్లీజ్!!
  [Admin] డిసెంబరు తొలి వారం లోపులో చెపుతామండి. [/Admin]

 8. story ki sari paday bomma lanu yala jodyenchali……chapandi…i mean yalatavali… chapandi…please………..
  [Admin] బొమ్మలు తప్పనిసరి కాదు. మీరు కథ మాత్రం పంపినా సరిపోతుంది. [/Admin]

 9. 750 padaalu annaru kada, sarigga 750 matrame undaalaa? ekkuva unna parvaleda?
  [Admin] గరిష్టం 750 పదాలు మాత్రమే. [/Admi]

 10. కధ రాయటానికి ఏదైనా ఫొర్మాట్ ఉందా(ఉదా: సంభాషన లేక పేరాగ్రాఫ్)
  [Admin] ఈ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్లూ లేవు. [/Admin]

 11. Pingback: కినిగె స్మార్ట్ స్టోరి కాంపటీషన్ గురించి ప్రముఖుల అభిప్రాయాలు | కినిగె బ్లాగు

 12. okavela na katha empika cheyabadakapote poti anantaram aa kavitanu vere itara patrikalaku leda itara online websites ki pampinchukonavacchuna ? dayachesi teliya jeyagalaru
  [Admin] Yes. You can send. [/Admin]

 13. sir, lekhini , suravara.com vanti tools ni use yalachayalo teliyadum ladu .so nenu ”JPEG” file lo antay image file lo pampagalama….chapandi..please ……………….

  [Admin] Only Unicode is allowed. Please use lekhini and copy paste it back to email. [/Admin]

 14. I am curious to know why you are having age resrictions. I am over 28 and I am interested in participating in ur competion. If it is ok I would like to send my stories please let me know .
  [Admin] This competition is restricted only for below 28. Please keep watching kinige.com for coming up competitions of other ages. [/Admin]

 15. 20 night varaku pampavacha?750 words ante a4 size papers lo chepandi?
  [Admin] పంపించవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో తేలిగ్గా పదాలను లెక్కించవచ్చు. సుమారుగా రెండున్నర పుటలు రావచ్చు. [/Admin]

 16. sir, nenu BARAHA software use chesi… word lo type chesanu…
  UNICODE mode lo unchi type chesa..
  Ippudu word document pampinchala leda PDF lo pampisthe manchida..?
  [Admin] You can send both of them! You can simply copy paste the text to email. Along with PDF, a text file ( like, word, text, txt, notepad (utf-8), open office) are compulsory. [/Admin]

 17. katha peru subject line lo prastavinchala? ledaa… word file unte sripotundaa
  [Admin] కథ పేరు ఈ మెయిలులో సరిపోతుంది. వర్డ్ ఫైలు సరిపోతుంది. [/Admin]

 18. nenu just epude email pampaanu… subject line lo “kinige smart story compition kosam” katha peru “——–“. ani rasaanu(telugulone). tarvata katha unna msword file ni attach chesanu….. its ok?
  [Admin] It is OK [/Admin]

 19. naaku aandolana kaligistunna vishayam emitante.. nenu pampina email ni open chesinapudu, attach chesina file ni chudadaniki rendu options unnayi. view ani, download ani. view select chesi chusinapudu, naa filelo unna aksharaalu sarigga levu. picchi picchi unnayi. download chesi, chusinapudu sarigga kanabadutunnayi. meeru ela chuustaro cheppagalaru?
  [Admin] We are aware of Google’s partial support to Telugu language in its products. Don’t worry, we will download and read it [/Admin]

 20. kadhanusaaram english padaalu(telugu scriptlone) upayoginchavacchunaa?
  [Admin] యూజ్ కర్ సక్తా హై[/Admin]

 21. kinige varki namaskaram,
  december 1st week lo announce chestamu annaru. mari december 1st week mugiyadaniki daggara kavastondi. mari results epudu cheubutaru ? leda idivarake results cheppesara…

  naku atrutaga undi.

  thanks

 22. సార్! 1)డిసెంబర్ మొదటి వారంలో మీరు రిసల్ట్స్ చెపుతాము అన్నారుగా.ఈరోజుతో గడువు ముగుస్తుంది కదా!ఎప్పుడు చెపుతారో కాస్త తెలియచేయగలరా?
  2)కాంపెటిసన్లో విన్ అయిన వారికి మాత్రమే ఇంటిమేసన్ పంపుతార లేక అందరికి మెయిలకి ఎవరు విన్ అయ్యారా,లేదా అన్న విషయాన్ని తెలియ చేస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>