కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 ఫలితాలు

యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ కినిగె.కాం ద్వారా నిర్వహించాము. 28 ఏళ్ళు లేదా ఆలోపు వాళ్లే రాయాలి, 750 పదాల లోపే రాయాలి అన్న నిబంధనలతో ఔత్సాహిక యువతీయువకులను ఆహ్వానించాము. మా ఆహ్వానానికి అనూహ్య స్పందనతో ఎదురొచ్చిన యువతరానికి ధన్యవాదాలు. ఎందరో కొత్తగా చిగుళ్లేస్తున్న తమ ఊహల్ని కాగితాలపై పరిచి పంపించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మంచి ఉద్దేశాన్ని గ్రహించి పోటీని అందరి ముందుకూ తీసుకెళ్లడంలో ఎంతో సాయపడిన మీడియాకు కృతజ్ఞతలు. యువత ఎంత ఉత్సాహంగా తమ సృజనల్ని పంపిందో, అంతే ఉత్సాహంగా వాటిని బేరీజు వేసేందుకు ముందుకు వచ్చిన అనుభవజ్ఞులైన మా న్యాయనిర్ణేతలకు నమస్కృతులు. ఈ ప్రయత్నంలో మరెన్నో రకాలుగా మాకు తోడ్పాటు నందించిన స్నేహితులకూ, శ్రేయోభిలాషులకూ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ పోటీ పరమార్థం విజేతల్ని ఎన్నుకోవటం కాదు, సృజనాత్మకతను గెలిపించటం. కాబట్టి విజేతలూ పరాజితులన్న బేధం లేకుండా పాల్గొన్న వారందరూ గెలిచినట్టే. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న వారే గాక, మరెందరో దీటైన ప్రయత్నాలతో ముందుకు వచ్చారు. వారందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తు మీతో ఉంటుందనీ, ఉండాలనీ మా ఆకాంక్ష.

ఈ పోటీలో మొదటి మూడు స్థానాలు గెలుచుకున్న విజేతల వివరాలు: ఈకథలను చదవడానికి ఇక్కడ నొక్కండి. 

విజేత

కథ

1

సతీష్ కుమార్ పొలిశెట్టి

అంతరంగం

2

సాయికిరణ్

ఆవిష్కరణ

3

మేడి చైతన్య

చెదిరిన ఆదర్శం

కన్సొలేషన్ బహుమతులు పొందిన వారి వివరాలు:

4

గోరంట్ల వెంకటేష్ బాబు

బడి మూసేశార్రా అబ్బోడా

5

నాగ పావని

ఇద్దరం కాదు ఒక్కరం

6

పృథ్వి. ఎన్

మీటర్ ఎంతైంది?

7

వినోద్ కుమార్

ప్రేమ చినుకు

8

యం. శైలేందర్

అక్షరాలతో అనుబంధం

9

యం. అమృత సాయి

నిద్ర సహాయం

10

ఎ. నరసింహ చారి

అమ్మాయి చదువు

11

అశోక్ పొడపాటి

ఓ చిన్న ప్రేమ కథ

12

రవి కిరణ్ మువ్వల

ఆమె రాక!

13

నడకుదటి లోకేశ్వరి

వెన్నెల

14

పితాని వీర వెంకట సత్యనారాయణ

ఉదయం

15

శరత్ కుమార్

మై స్టోరీ

Related Posts:

4 thoughts on “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 ఫలితాలు

  1. Pingback: స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013 | కినిగె బ్లాగు

  2. How many writers have participated in this?
    [Admin] The information is not publicly available from Kinige. But it is 100’s [/Admin]

  3. Thanks for the reply. 100s? Wow. Happy to hear that 100s of young people here in Telugu now.

  4. కన్సోలేషన్ బహుమతి పొందిన వారికి పారితోషికం ఉంటుందా? ఉంటే ఎంత ఉంటుంది?
    [Admin] Yes. Please check http://teblog.kinige.com/?p=2773[/Admin]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>