మాట ఒక విప్లవం. రాత ఒక విప్లవం. పుస్తకం ఒక విప్లవం. సమాజాల్ని సమూలంగా మార్చేసిన విప్లవాలు ఇవి.
సాంకేతిక విప్లవం ఇప్పుడు మనం చవిచూస్తున్నామ్. ప్రపంచ భాషలను వేగంగా ప్రభావం చేస్తుంది నేటి సాంకేతిక విప్లవం. నిన్నటిలా నేడు లేదు. నేటిలా రేపు ఉండబోదు. నేటి సాంకేతిక పరిజ్ఙానం పరిపూర్ణంగా అందుకుంటూ, రేపటి తెలుగు పుస్తకం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తెలుగు వారి అభిమాన, విశ్వసనీయ పుస్తక ప్రపంచం కినిగె డాట్ కామ్ తెలుగు సాహితీ ప్రపంచానికి సగర్వంగా సమర్పిస్తుంది అక్షర లక్షల కినిగె తెలుగు నవలా పోటీ 2014
బహుమతి ఏమిటి?
మొదటి బహుమతి: లక్ష రూపాయలు.
రెండవ బహుమతి: పాతిక వేల రూపాయలు.
మూడవ బహుమతి: పది వేలు.
ఎలా పాల్గొనాలి?
మీ కొత్త తెలుగు నవలను కినిగెలో ఈపబ్లిష్ చెయ్యండి. డిస్క్రిప్షనులో తెలుగు నవలా పోటీ కోసం అని వ్రాయండి.
ఈ పబ్లిష్ సహాయం కోసం ఇక్కడ నొక్కండి.
గడువు ఎప్పటివరకు?
06/06/2014 వరకూ, అనగా జూన్ ఆరు 2014 మద్యాహ్నం 12:00 గంటలు భారత కాలమానం ప్రకారం. ఈ లోపులో కినిగెలో ఈపబ్లిష్ విజయవంతంగా చేసిన నవలలే పోటీకి అర్హమైనవి.
విజేతలను ఎలా నిర్ణయిస్తారు?
కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు.
తవసం (తరచూ వచ్చే సందేహాలు)
1. నా పాత నవల సబ్మిట్ చెయ్యవచ్చా?
లేదు. కేవలం కొత్త నవలలు, ఎక్కడా ప్రచురించబడనివి, ఏ ఇతర పోటీకీ పంపించనివీ మాత్రమే అర్హమైనవి. గమనిక: మీ ఇతర నవలలు భేషుగ్గా కినిగెలో ఈపబ్లిష్ చేసుకొని మరింత మంది పాఠకులను వాటిని చేరువ చెయ్యవచ్చు. ఆదాయాన్ని ఆర్జించవచ్చు. వివరాలు ఇక్కడ.
2. కినిగె నవలా పోటీకి ప్రచురించాక, ఇతర పోటీలకు పంపవచ్చా?
ఫలితాలు వచ్చేంతవరకూ లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ ఏ ఇతర పోటీలకూ పంపకూడదు.
3. నేను పోటీకి సబ్మిట్ చేసే నవల కినిగెలో ఈపుస్తకంగా ఉంచడం వల్ల పోటీ బహుమతి కాకుండా రాయల్టీ కూడా వస్తుందా?
అవును వస్తుంది.
4. నా పుస్తకం ధర ఎంత ఉండవచ్చు?
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం మార్కెట్ ధర నిర్ణయించండి.
5. కవర్ పుట కూడా నేనే డిజైన్ చేయించాలా?
అవును కవర్ పుట కూడా మీరే పంపించాలి. గుర్తించుకోండి మంచి కవర్ పుట ఎక్కువమంది పాఠకులను చేరువ చెయ్యడంలో చాలా సహాయం చేస్తుంది.
6. చేత్తో వ్రాసిన మానుస్క్రిప్ట్ పంపించవచ్చా?
లేదు.
7. అను ఫాంట్స్ లో, పేజ్ మేకర్ లో టైప్ చేసినవి పంపించవచ్చా?
అవును. పంపించవచ్చు.
8. స్కాన్ చేసిన డాక్యుమెంట్లు పంపించవచ్చా?
లేదు.
9. యూనీకోడులో టైప్ చేసిన ఫైల్లు పంపించవచ్చా?
అవును పంపించవచ్చు.
10.ఈ పోటీకి ఏమైనా వయో పరిమితి ఉందా?
లేదు అన్ని వయసుల వాళ్లూ పాల్గొనవచ్చు.
11. కనీసం ఎన్ని పుటలు ఉండాలి?
కనీసం 21,000 పదాలు (అక్షరాలా ఇరవై ఒక్క వేల పదాలు) ఉండాలి
12. అనువాదాలు పంపించవచ్చా?
రచన తమ సొంతమై ఉండాలి, ఏ ఇతర భాషలలోని రచనలకు అనువాదం గాని, అనుకరణగానీ, అనుసరణ గానీ కాకూడదు
13. కాపీరైట్ ఎవరికి ఉంటుంది.
కాపీరైట్ నవల రచయితకే ఉంటుంది.
14. పుస్తకాన్ని కేవలం ఈపుస్తకంగానే ఉంచాలా, లేదా ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చా?
బహుమతులు ప్రకటించే వరకూ, లేదా గరిష్టంగా ఒక సంవత్సరం వరకూ మీ పుస్తకం కేవలం ఈపుస్తకంగా మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత ప్రింటు పుస్తకంగా తెచ్చుకోవచ్చు.
15. కినిగె నా పుస్తకాన్ని ప్రింటు పుస్తకంగా తీసుకువస్తుందా?
లేదు.
16. గెలుపొందిన పుస్తకాలను కినిగె ప్రింటు పుస్తకాలుగా తీసుకువస్తుందా?
లేదు.
13. ఇతర నిబంధనలు ఏమిటి?
అ. మీ నవలను ఎంపిక చేసిన పాఠకులకు కినిగె తక్కువ ధరకు లేదా పూర్తి ఉచితంగా ఇస్తుంది.
ఆ. అంతిమ నిర్ణయం కినిగెదే. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.
ఇ. పోటీ ముగిసిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాలు గెలుపొందిన నవలలు కినిగెలో మాత్రమే ఈపుస్తకంగా ఉండాలి. వేరే ఎక్కడా ఈపుస్తకంగా అందుబాటులో ఉంచకూడదు.
ఈ. మీకింకా ఏవైనా సందేహాలు ఉంటే కినిగె సపోర్టును సంప్రదించండి. support@kinige.com
ఉ. ఈ పబ్లిష్ చేయడంలో సందేహాలకు 9704605854 సంప్రదించండి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు (భారత కాలమానం) మాత్రమే.
ఊ. ఏదైనా నవలను పోటీలో ఉంచడానికి, అనర్హమైనవాటిగా నిర్ణయించడానికీ కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.
ఋ. Subjected to the jurisdiction of Hyderabad only.
ౠ. కినిగె ఇతర నియమనిబంధనలు వర్తిస్తాయి.
ఎ. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోటీ నియమ నిబంధనలు మార్చడానికి, పోటీని పూర్తిగా రద్దు చెయ్యడానికి కినిగె పూర్తి హక్కులు కలిగి ఉంది.
గమనిక – మీ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కనీస పదాల సంఖ్య ఇరవై ఒక్క వేల పదాలుగా ఉంచాము. ఈ విషయంలో ఇంకే మార్పులూ చేర్పులూ ఉండవని గమనించ ప్రార్థన.
పేజీల కు ఓ పరిధి పెట్టకపోవటం మంచి విషయం. కాని కనీసం ఎన్ని పేజీలు వుండాలి అనేది చెప్పటం అవసరమే. మామూలుగా 8, 9 పేజీలు వుంటే, వర్డ్ లో 3, 4 పేజీలు వస్తాయ్. pdf లో 2, 3 మాత్రమే రావచ్చు. దీనిని బట్టి కనీసం ఉండాల్సిన సంఖ్యని చెప్పగలరు. అప్పుడు అది నాకు మాత్రమే కాదు, అందరికీ ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు.
[Admin] Decent number of pages. We may change this rule depending upon the response we get in first couple of months. [/Admin]
[Admin]As many folks are asking for guidelines on the size, we change the rule to: కనీసం 40,000 పదాలు (అక్షరాలా నలబై వేల పదాలు) ఉండాలి.[/Admin]
send details of all regualar competition on telegu languages to my email id
[Admin] Register on http://kinige.com you will receive these competition notifications along with other weekly recommendations.
Also keep checking http://patrika.kinige.com They will have monthly some program. For example there is a poetry translation competition going on now. [/Admin]
నవల ఇతివృత్తం “తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి,” “మానవతా విలువలకి అద్దం పట్టేదిగా ఉండాలి” వంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
[Admin] లేవండీ. ఎన్నుకున్న ఇతివృత్తానికి పూర్తి న్యాయం చేస్తే చాలు. [/Admin]
I request you to direct about the minimum and maximum pages at least you please specify minimum pages
[Admin] కనీసం 40,000 పదాలు (అక్షరాలా నలబై వేల పదాలు) ఉండాలి.[/Admin]
This is very good Idea
Telugu Navels contest:
kindly clearly
How many pages in Telugu Navel contest
(specific in KINIGE )
[Admin] Minimum of 21,000 words.
As you can guess, it is not practical to say number of pages,
number pages depends upon so many settings like margins, font size, line width, letter spacing, etc…
So Kinige condition is minimum 21,000 words.
[/Admin]
Sir, I am not sure If I understood the condition of 40,000 words as minimum requirement.
reason – first you said no rule on size of novel – that giving scope to post shorter novels and huge ones as well. Other established telugu weekly mags (swathi) accept and publish 20,000 plus word novels (120 pages). weekly magazine size.. and chathura’s requirement for a novel is 80 some pages.
now actual novel as a book is 9 x 6 …. i think…. even 15,000 words come to 108 pages…which is decent size…
I could be totally off on this as I am not sure of your page sizes… but for sure your minimum requirement of 40,000 words is calling for 280 pages or so novel 9×6 size… so please consider the min requirement. (100 pages minimum – novel 9×6) Thanks much… and larger ones will be there anyway… for this potee….thank you very much….
(అడ్మిన్) ఇప్పుడు 21,000 పదాలుగా మార్చాము. ఇదే చివరి మార్పు గమనించగలరు. మీ ఫీడ్ బ్యాక్ కు ధన్యవాదములు.
Thanks for the change.
In fact, I shocked when I see the 40,000 words rule, because it is very big lengthy size.
Ms. Uma explained very well about size and she might have felt just like me of size.
And Really Thanks for taking my doubts in positive view and actions on changes. Hope your wonderful literacy work gets more and more success. Thanks.
Above last two lines in my last comment for Kinige.com (I forgot to mention). Just tried to say we love Kinige.
[Admin] Thank you for your kind words. [/Admin]
Hello Admin,
I had a query about the Kinige smart story competition conducted on September.Did you announce the results or not. If not,when it will be announced? Reply me.
[Admin] Here you go. http://kinige.com/kbook.php?id=2386&name=Smart+Stories+2013[/Admin]
“కినిగె పాఠకులు మీ నవలలు చదివి వాటికి రేటింగు ఇస్తారు. ఈ రేటింగు ఆధారంగా ఉత్తమ పది (లేదా ఆపై) నవలలనుండి న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు”.
అన్నారు కదా,
పాఠకులు పేరున్న వారి నవలలే చదువుతారేమో….
కొత్త రచయితలు, పేరు గుర్తింపు లేనివారి నవలలు – మంచి కథాంశం ఉన్నా నవల బాగున్నా – మరి వాటిని చదవని పక్షంలో, పోటీకి న్యాయం ఎలా జరుగుతుంది?
పోటీకి వచ్చిన నవలలు అన్నీ చదవబడేలా ఏదైనా ఏర్పాటు చేసే ఉన్నారా? ప్లీజ్ చెప్పగలరు..
శిల్ప మహేష్
Can I submit sequel of previous novel but brand new? The prequel is available in kinige now.
[Admin] Yes. [/Admin]
21000 పదాలను మించి రాయవచ్చా??… అంటే 21000 minimum అని అర్ధమా??
[Admin] Yes. [/Admin]
rachanalu mail box lo telugu type chesi pampavacha?
[Admin] అలా టైపు చేసినదానికి మైక్రోసాఫ్ట్ వర్డ్ లోనో, నోటుప్యాడులోనే(యూటీయఫ్-8) భద్రపరిచి పంపవచ్చు. లేదా గూగుల్ డాక్యుమెంటుగా పంపవచ్చు. అలానే కవర్ పుట కూడా పంపాలి. [/Admin]
Navala ni bayata trademark n register cheyinchukovacha rachiyata peru meedugaa
CRIME DETECTIVE NOVEL POTIKI PAMPAVACHHA ?
[Admin] Yes[/Admin]
is royalty paid to the ones who got the prize or everyone else?
[Admin] To both winners and all other participants. Amount will depend upon the sales those books receive, just like any other eBook on kinige.com [/Admin]
కినిగే చేస్తోన్న మంచి ప్రయత్నం….విజయార్కె
Please make allow all novels under this competition only after the date is ended, because if you let them allow now, newly added novels would get lesser rating even if they would be good.
ఇద్దరం కలిసి పుస్తకాన్ని రచించవచ్చా? రచయితలుగా ఇద్దరి పేర్లనీ ప్రచురించవచ్చా?
[Admi] Yes. [/Admin]
can i send through e mail
[Admin]
Yes
[/Admin]
poti gaduvu tedi ni penche avakasam unda sir?
[Admin]No. [/Admin]
Could you please extend the date of this competition?
Thanks.
To get quality novels, I think you should extend the due date? It is a short notice to write a good novel.
Can you please extend the data for one more month
I respect your commitment towards the date for the competition. But I still hope for an extension one month for that. I almost come to the ending of my story, but I wrote all this on paper with my own handwriting. I can finish and type all that and send to you if you give me one month time or at least give till the end of this month. Please consider.
Please update the status of competetion, Number of of novels, Ratings etc… What is the last date to get ratings?
navalala potipattinanduku abhinandanalu.kani 5 years nibandana savaristha bavuntundamo …pariseelinchandi….sarathchandra
intavaraku navalala poteeki vacchina navalalanu chadavaalante vaatini yelaa chuudavacchu.yelaa chadavaali.intavaraku potiilo unna navalala vivaraalu yelaa?
kathaa photi kaani kavithva photi kaani emy leda