చలన చిత్ర నటుడు భరణి, గొప్ప సాహిత్యాభిమాని కూడా. ఆయన పేరుమీదగా “తనికెళ్ళ భరణి సాహిత్య పురస్కారము్” రేపు అంటే గురువారం, 14 జూలైన, భాగ్యనగరం లోని రవీంద్ర భారతిలో, కళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్నది. ఆ రోజు తనికెళ్ళ భరణి పుట్టిన రోజు కూడా.
కృతికర్త ఐన వేగుంట మోహన ప్రసాద్‌కు స్వర్ణ పుష్పాభిషేకం తో పాటు ప్రశంసా పత్రం, యాభై వేల రూపాయల నగదు బహుమతినిని కూడా అందజేస్తారు.
వడ్డెర చండిదాస్ మాటల్లో “మో” కవిత్వం :
” ప్రియమైన మో,
యీ శతాబ్దపు, యెక్వయిర్డ్ యిమ్యునో యెఫీషియన్సి సిన్-డ్రీమిక్ సంక్షుభిత యిర్రియల్ కాలం, యింప్రెషనిస్టిక్ యెక్స్ప్రెషనిజ్మిక్ మాంతెజ్ పొయటోగ్రఫీ కవిత గా పెల్లుబీకితే, అర్ధం చేసుకోవడానికి డిస్సెక్ట్ చెయ్యబోతే – భావార్ధం, విడివిడి అవయవాల ముక్కలై సుడి గాలిలో ధూళిరేణువుల్లా చుట్టేస్తాయి“. – వడ్డెర చండిదాస్
తనికెళ్ళ భరణి సాహితి పురస్కారానికి 108 కవితా సంపుటాలు పరిశీలనకు వస్తే, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ప్రముఖ సాహిత్యవేత్తలు శ్రీ వాడ్రెవు చిన వీరభద్రుడు, ఆచార్య సి. మృణాలిని గార్ల ఏకగ్రీవ నిర్ణయానికి వేగుంట మోహన ప్రసాదు గారి కవితా సంపుటి ‘నిషాదం’ నిలబడింది.
కినిగె ఈ కవులిద్దరి సాహిత్యం ని ఈబుక్ గా మీకు అందిస్తున్నది.
కినిగెలో నిషాదం ఇక్కడ, తనికెళ్ళ భరణి సాహిత్యం ఇక్కడ లభ్యం.
Pingback: కినిగె బ్లాగు: ‘మో’ స్మృతికి అంజలి
Pingback: ‘మో’ స్మృతికి అంజలి | కినిగె బ్లాగు