పదునైన అస్త్రాలు

కాలక్షేపానికో, కలల్లో విహరింపజేయటానికో కాకుండా ఛాందస, కపటత్వ, రాజీధోరణులపై విమర్శాస్త్రాలు గురిపెడుతూ సాగిన కథల, వ్యాసాల సంకలనమిది. అమెరికాలో తెలుగువారి జీవితంలోని పార్శ్వాలూ, సాహిత్య విమర్శలూ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. భార్యగా వచ్చిన స్త్రీకి మానసికవ్యాధి వచ్చేలా ప్రవర్తించి, ఆమె చనిపోగానే నిత్యపెళ్ళికొడుకు అవతారమెత్తాలని వెంపర్లాడే ఓ వ్యక్తి కథ ‘పెళ్ళాల పులి‘. తమ మతవిశ్వాసాలనో, నాస్తిక భావాలనో చాలామంది తమ పిల్లల్లో కలిగించలేకపోవటం చూస్తుంటాం. ఈ ఇతివృత్తంతో ‘తండ్రి’తనం కథ నడిచింది. ఆఫీసులకు పెంపుడుకుక్కల్ని తీసుకువచ్చే అమెరికన్‌ ఉద్యోగుల చేష్టలను హాస్య వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథ ‘గొర్రెల స్వామ్యం’. ఒక రచన పాఠకునిపై ఎంత గాఢమైన ప్రభావం చూపగలదో ‘నన్ను మార్చిన పుస్తకం’ తెలుపుతుంది.

— సీహెచ్‌.వేణు, ఈనాడు ఆదివారం అనుబంధం, 2 ఫిబ్రవరి, 2014

* * *

‘పెళ్ళాల పులి’ పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

పెళ్ళాల పులి on Kinige

 

Related Posts:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>