కె.శ్రీనివాస్ అక్షరాలు పదునైన అస్త్రాలను తలపిస్తాయి. ఆ శైలిలో ఆలోచనా ఆవేశం సమపాళ్లలో ఉంటాయి. పదమూడేళ్ల క్రితం ‘ప్రజాతంత్ర’లో వెలువడిన వ్యాసాల్ని ఇప్పుడు ‘కొత్తవంతెన’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ‘మూసీ అంటే నీళ్లు మాత్రమే కాదు, మూసీ అంటే దక్కన్, మూసీ అంటే తెలంగాణ’ అంటూ మురికినీటి ప్రవాహంగా మారిపోతున్న ఆ జలవాహిని దుస్థితిని తలుచుకుంటారు. ‘కాకతీయులూ వద్దు, ఖాసిం రజ్వీలూ వద్దు’ అంటూ మధ్య యుగాల, ఆధునిక రాచరిక పాలనలోని దుర్మార్గాల్ని గర్హిస్తారు. ‘ఆకలినీ ఆత్మహత్యలనూ హత్యలనూ చూస్తావా ఉల్ఫెన్సన్?’ అంటూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సందర్శనను నిరసిస్తారు. తెలంగాణా రాజకీయ, సాంస్కృతిక, సామాజిక పరిణామాలపై పుస్తకంలో నలభైకిపైగా వ్యాసాలున్నాయి.
- వినయ్, ఆదివారం అనుబంధం, ఈనాడు, 16th Feb 2014
ఈ ఆర్టికల్ని ఈనాడు పుస్తకం పేజీలో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి:
http://archives.eenadu.net/02-16-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka
“కొత్త వంతెన” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ని అనుసరించండి.
***