ఆర్థిక అండకు ‘మనీపర్స్-2′

డబ్బు సంపాదన మీద ఇదివరకే మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకాలకంటే ఇది భిన్నమైనది. బహుశా రచయితకు ఈ సబ్జెక్టు మీదున్న తీవ్రమైన తపన వల్లే కొత్త కోణాలను ఆవిష్కరించగలిగారు. “అగ్గిపెట్టెకీ డబ్బుల్లేని బంజర్‌దారు మనవడిగా, గుడిసె కూడా కట్టుకోలేని ఎమ్మెల్యే (వంగా సుబ్బారావు) గారి అబ్బాయిగా మొదలయిన బాల్యం – కసి – కోపం – నిజాయితీగా ఉంటూ కూడా కోటీశ్వరులు కావచ్చన్న విశ్వాసం – ఆశ, ఆర్థిక అన్వేషణే ఆర్థిక సలహాలను పంచుకునే స్థితికి తీసుకెళ్లింది” అని ఆయన చెప్పిన అనుభవం అందుకు నిదర్శనం. ఆర్థిక సరళీకృత విధానాలు అమలయ్యాక.. కొత్త కొత్త ఆర్థిక సంస్థలు, పొదుపు, మదుపు, బీమా, మ్యూచువల్‌ఫండ్స్, ఈటీఎఫ్ తదితర పథకాలు, బ్యాంకింగ్ విధానాలు, రుణ సదుపాయాలు, రియల్ఎస్టేట్ తీరుతెన్నుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. వీటిలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టంగా మారింది. ఆర్థిక సాహిత్యాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్లు.. ప్రతి అంశాన్నీ సాధికారికంగా వివరించారు రచయిత వంగా రాజేంద్రప్రసాద్. చిట్‌ఫండ్స్ లాభమా? నష్టమా?, వంద రూపాయలతో పదివేల కోట్లు.. ఎలా?, మంచి పాలసీలు ఎలా తీసుకోవాలి?, జీవిత బీమా ఎంత ఉండాలి? నేలను నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడా? వంటి కథనాలు చదివితే, మంచి నిర్ణయాలే తీసుకోగలుగుతాము.

- ఆది మల్లెంపూటి, 23 Mar 2014, Andhrajyothi

మనీ పర్స్- 2” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి. 

***

మనీ పర్స్- 2 on Kinige

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>