అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే… అన్నాడో సినీ కవి. అంతటి గొప్ప హృదయాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ కథకుడు సింహ ప్రసాద్ రాసిన కథలే ఇవన్నీ. ఇందులోని 26 కథలు అమ్మ తపన, అమ్మ కోసం పడే తపనను కళ్ళకు కడతాయి.
డెలివరీ టైముకు అమెరికా రావాలని కొడుకు చేసిన విజ్ఞప్తికి ఉబ్బితబ్బిబ్బై ఆనక నిజం తెలిసి గుండె పగిలి కుప్పకూలిపోయిన ఓ తల్లి కథ ‘జో అచ్యుతానంద జోజో ముకుందా’. గుండెను తడిచేసే కొసమెరుపును ఈ కథలో చదువు కోవాల్సిందే!
అమ్మకోసం అమ్మ లాలింపు కోసం ముప్ఫైయేళ్ళ పాటు ఓ అనాథ చేసిన అన్వేషణే ’అమ్మ దొరికింది’ కథ. అయాచితంగా వచ్చిన డబ్బును కడచూపులకు తండ్రికోసం ఉపయోగించుకోవాలో వద్దో తేల్చుకునే అరక్షణకాలం లోపు కలిగిన తలవంపులే ’టూ లేట్’ కథ. ఇలా ఇందులోని కథలన్నీ తల్లీ బిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరిస్తాయి.
-నవ్య వార పత్రిక, 28th May 2014
“జో అచ్యుతానంద జోజో ముకుందా” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***
జో అచ్యుతానంద జోజో ముకుందా on Kinige