ఇందులోని 18 వ్యాసాలు కేవలం విషయ విజ్ఞానం కోసమే కాకుండా సదాచారాల పట్ల అవగాహన కలిగించడానికీ, ధార్మిక జీవనం సాగించడానికీ దోహదం చేస్తాయి. మధురమైన వాక్కుల సమాహారమే ఈ గ్రంథం. సత్యవాక్కు, పరమాత్మతత్త్వం, ఆ దివ్యమంగళ మూర్తి గొప్పదనం తెలియజేసే వ్యాసాలతో పాటు భార్య, సంసార జీవితంలో దంపతుల పరస్పర జీవన విధానం వివరిస్తారు.మనిషికి మాత్రమే లభించిన దైవ సంబంధమైన వాక్కు గొప్పతనం, దాన్ని ఉపయోగించాల్సిన పద్ధతిని హత్తుకునేట్టు చెప్పారు. సుఖదుఃఖాలు, ఉత్పత్తి వినాశనం, లాభనష్టాలు, చావు బ్రతుకుల విశ్లేషణ, వినయాన్ని ఆవాహనం చేసే నమస్కారం గొప్పదనాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో చాటిచెప్పారు.ఓంకారాక్షరంలోని అకార, ఉకార, మకారాలనే మూడు మాత్రలు బ్రహ్మ విష్ణు శివతత్త్వాలను సూచిస్తాయంటారు రచయిత. వసుధైక కుటుంబ భావన గొప్పతనాన్ని వివరిస్తుంది మరో వ్యాసం. ఇలా ధార్మిక జీవనంపట్ల మనలో ఆసక్తి రేపి మనల్ని సజ్జనులుగా తీర్చిదిద్దుతాయీ వ్యాసాలు.
నవ్య వారపత్రిక, 4th June 2014
“మకరంద బిందువులు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***