పొత్తూరి విజయలక్ష్మి కథలకు అనుబంధాలే పునాదులు. ఆమె రచనల్లో హాస్యం అంతర్లీనం, వ్యంగ్యం నిబిడీకృతం. ‘సన్మానం‘ కథ పూర్తయ్యేలోపు పాఠకుడి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పుడు పాఠాలు నేర్పిన గురువులంతా కళ్లముందు మెదులుతారు. మానవ సంబంధాల్లోని అతి సున్నిత కోణాన్ని అంతకంటే సున్నితంగా ఆవిష్కరించారు రచయిత్రి. చుట్టాలతో స్నేహితులతో కళకళలాడాల్సిన పెళ్లిమండపాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లతో నిండిపోతున్నాయి. ఆ మేరకు, పలకరింపులూ కృతకంగా మారిపోతున్నాయి. ఆ ధోరణి బారిన పడవద్దంటూ ‘మర్యాదలు వచ్చేస్తున్నాయి జాగర్త’ కథలో హెచ్చరించారు. ‘భారత రసాయన శాస్త్రం’, ‘చీరెల సుబ్బారావు’, ‘చిరుదివ్వె’… ఒకటేమిటి, పుస్తకంలోని ప్రతి కథా జీవితంలోని ఏదో ఓ సమస్యకు పరిష్కారాన్ని చెప్పేదే, మనుషుల్లోని కృత్రిమత్వాన్ని ఎత్తిచూపేదే.
– భరత్, 29 జూన్ 2014, ఆదివారం అనుబంధం
“సన్మానం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***