ప్రతి ఐఏఎస్ అధికారి జీవితంలోనూ ఎన్నోకొన్ని ఆసక్తికరమైన అనుభవాలే ఉంటాయి. ముఖ్యమంత్రుల దగ్గరా ప్రధానమంత్రుల దగ్గరా కీలక హోదాల్లో పనిచేసి ఉంటారు కాబట్టి, ఆయా వ్యక్తుల్నీ వ్యక్తిత్వాల్నీ అతి దగ్గర నుంచి గమనించే అవకాశం ఉంటుంది. మోహన్‌కందా వృత్తి జీవితంలోనూ అలాంటి ప్రముఖులు చాలామందే తారసపడ్డారు. కొరకరాని కొయ్యల్నీ, మహామొండి ఘటాల్నీ కూడా తనదైన వ్యవహారదక్షతతో ఒప్పించి మెప్పించిన మృదుస్వభావి ఆయన. అవసరమైతే ఎదిరించిన దృఢస్వభావి కూడా. బాలనటుడిగా ఓ యాభై సినిమాల్లో నటించిన అనుభవాలు మొదలుకొని తన జీవితంలోని అనేకానేక ఆసక్తికరమైన జ్ఞాపకాల్ని ‘మోహన్ మకరందం’ రూపంలో అందిస్తున్నారు కందా. హాస్యస్పృహ దండిగా ఉన్న రచయిత కాబట్టి, పాఠకుడికి షడ్రసోపేతమైన విందే!
– రాజేంద్ర, ఈనాడు ఆదివారం అనుబంధం, 27 జూలై 2014
“మోహన మకరందం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
***