వివిధ పత్రికల్లో ప్రచురితమైన 56 మంది రచయితల కథా సంకలనమే ‘హాస్య కథ-2011‘. వసుంధర, నాయని కృష్ణమూర్తి, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్, సింహప్రసాద్, వేదగిరి రాంబాబు తదితరుల రచనలున్నాయి. నిత్యజీవితంలో అందరికీ ఎదురయ్యే సమస్యలనే రచయితలు చురకలతో మెరుపులతో తీర్చిదిద్దిన తీరు నవ్వు పుట్టిస్తుంది. ‘సీరియల్ పిచ్చి’, ‘పెనం మీంచి పొయ్యిలోకి’, ‘ఈ ఎపిసోడ్ ఇంతేనా’, ‘పెట్టెలో ప్రాణం’-టీవీ కార్యక్రమాలపై సంధించిన వ్యంగాస్త్రాలు. పెళ్లిళ్ళూ, ఉచిత సలహాలూ, రాజకీయనాయకులూ..ఇలా ఎన్నో అంశాలపై గిలిగింతలు పెట్టే కథలల్లారు రచయితలు.
-నీరుకొండ అనూష, ఆదివారం అనుబంధం, 30 మార్చి 2014
“హాస్య కథ-2011”నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***