మానవీయ విలువలూ, ఆత్మీయతా స్పర్శా, అపారమైన ఆర్ద్రతా కలిగిన కథలే కలకాలం నిలబడతాయి. పి.ఎస్.నారాయణ ‘నిర్ణీతి’ సంపుటిలోని కథలు ఆ కోవకే చెందుతాయి. ‘పెళ్ళివారిల్లు పెద్దముత్తయిదువులా ఉంది’ లాంటి పోలికలు కథలకి కొత్త అందాన్నిస్తాయి. ‘పంచాగ్ని’ కథలో భారతి ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు కుర్రాళ్లలో ఒకడైన సుధాకర్కి తెలిసిన ఓ నిజం, అతను ప్రవర్తించిన తీరూ పాఠకుల మదిలో చెరగని ముద్రవేస్తుంది. ‘నిర్ణీతి’ కథలో స్నేహానికి కల్యాణి ఇచ్చిన విలువా, దానివల్ల ఆమెకు ఎదురైన అనుభవం, ఫలితంగా ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేపుతాయి. అత్యాచారానికి గురైన యువతి ధైర్యంగా నిలదొక్కుకుని, ఆత్మవిశ్వాసంతో పోరాడి ప్రతీకారం తీర్చుకోవడం ‘ఆరునెలలు ఆగాలి‘ నవల ఇతివృత్తం. అందుకు ఆమె పన్నిన వ్యూహాలూ, ఎదుర్కొన్న పరిస్థితులూ పాఠకులను ఉద్వేగానికి గురిచేస్తాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు, ఆదివారం అనుబంధం, 3rd Aug 2014
“ఆరు నెలలు ఆగాలి” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***