కవికుమారుడి గోస – ‘నీలాగే ఒకడుండేవాడు!’ పుస్తకంపై సమీక్ష

చిక్కని కవిత్వాన్ని ఆస్వాదించాలంటే… ‘కళ్ళకి తెలీని కంటిభాషతో, కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం’ చేతనవ్వాలి. నందకిషోర్ ఇవన్నీ మనకు నేర్పిస్తాడీ పుస్తకంలో. ‘అయ్యాం నాట్ ఫేక్’ అని ఒక సమయంలో ఎంత గట్టిగా అరుస్తాడో… వూరికెళ్ళినప్పుడు ప్రియురాళ్ళ చేతుల్లో పిల్లల నవ్వుల్ని చూసి అంతే నర్మగర్భంగా నవ్వుకోనూగలడు. అంతేకాదు, ‘చరిత్ర చూడని వర్తమానంలోకి తననూ, దేశాన్నీ’ తీసుకెళ్ళగలడు. ‘ఒక సంధ్యావస్థ కాలంలోంచి’ అనే ఖండికలో ‘దేవీ’ అంటూ… ‘అనుకోకుండా’ అనే ఖండికలో ‘వెన్నెల స్నేహితా, దుఃఖిత సహచరీ, పువ్వుల సంద్రమా’ అంటూ సంబోధిస్తూ కవిత్వాన్ని కవాతు చేయించిన తర్వాత కూడా ‘నువ్వూ నేనూ అస్తమించేదాకా రాళ్లెట్లా వికసించేదీ, పువ్వులేట్లా బద్దలయ్యేదీ’ రహస్యంగానే ఉంచుతాడు. ఈ పుస్తకంలో నందకిశోర్ ‘కవిత్వాన్ని రాయలేదు ఓ ఆత్మగా ఆవిష్కరించాడు’ అనడం అతిశయోక్తి కాదు!

–వర్చస్వి, ఆదివారం అనుబంధం, 31st Aug 2014

 

 

 

 

 

 

 

 

 

నీలాగే ఒకడుండేవాడు!”పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

నీలాగే ఒకడుండేవాడు! on kinige

 

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>