రెక్కలగుర్రం ఎక్కించి చుక్కలలోకం చూపించే కథలు – “నెమలీక” పుస్తకంపై సమీక్ష

మానసిక రుగ్మతలతో భాధపడేవారిసంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.ప్రతి ముగ్గురి లోనూ ఒకరు మానసిక రోగేనట! ఇలాంటి ధోరణులకు బాల్యం నుండే చికిత్స జరగాలి.అలాంటి చికిత్స చేసేది పిల్లల కధలే.అందుకే పూర్వీకులు జానపద కథలు,నైతిక విలువలు నేర్పే సాంఘిక కథలూ విస్తారంగా మనకు అందించారు.

సమాజ మార్పులకు అనుగుణంగా బాలసాహిత్యం విస్తరిస్తున్నప్పటికీ అది వారికి సక్రమంగా చేరకపోవడం వల్లే మనకిప్పుడిన్ని తంటాలు! పిల్లల సాహిత్యం వారిని ఆకర్షించాలి , చదవడానికి సులభమైన శైలిలో ఉండాలి.ఆసక్తి రేకెత్తించాలి.ఇంకా ఇంకా చదివేటట్టు చేయాలి.ఆ తృష్ణ వారిని అలా అలా జ్ఞానభాండాగారం వైపు నడిపించుకుపోవాలి.గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళగలం.కానీ దానితో నీళ్ళు తాగించలేం. పిల్లలకు మంచి రంగుల పుస్తకం కొనివ్వగలం ,చదివించలేం. కానీ జగన్నాధశర్మగారు రాసిన జానపదకథల పుస్తకం తీరే వేరు.పిల్లలకోసం ప్రత్యేకంగా రాసిన కధలివన్నీ.ఆయన గతంలో పాలపిట్ట కథలు ,ప్రపంచ జానపద సాహిత్యం, మహాభారతం, కధాసరిత్సాగరం వంటివన్నీ పెద్దలను,పిల్లలనూ ఎంతగానో ఆకట్టుకొన్నాయి.ఆ కోవలోకి చెందిందే ఈ “నెమలీక”.

దీని ముఖచిత్రం పిల్లలను ఇట్టే ఆకర్షిస్తుంది.చూడగానే చందమామ పుస్తకంలా , పుస్తకం తెరిచి చదవాలనే తహతహ పెంచుతుంది.

పేజీ తీసి లోపలికి వెళ్ళగానే కళ్ళు విచ్చుకొంటాయి.పినిశెట్టి బొమ్మలు చూడగానే ముఖం విప్పారుతుంది.అక్షరాల వెంట పరుగులు తీసే కళ్ళు పేజీలు చకచకా తిప్పమని చేతి వ్రేళ్ళని ఆత్రంగా అభ్యర్ధిస్తాయ్.అలా అలా ఇందులోని పదకొండు కథల్నీ చదవడం పూర్తిచేసిన కళ్ళు ఆలోచనల్ని ప్రేరేపించి మనోనేత్రాన్ని తెరుచుకొనేటట్లు చేస్తాయి.ఇందులోని జానపదగాధలన్నీ ఇంతకు మునుపు ఎవరూ చదవనివే! మనచుట్టూ లేని ఓ సరికొత్త ప్రపంచంలో విహరింపజేస్తాయి.సప్తసముద్రాల్ని దాటించి, దీవుల్లో విహరింపజేసి , మనస్సును గుర్రాలపై పరుగులు తీయించి వనవిహారం చేయిస్తాయీ కథలు.మాయలు,మంత్రాలు,తంత్రాలు,యంత్రాలు పాత్రల రూపం ధరిస్తాయి.రాకుమారులు,రాకుమార్తెలు , రెక్కల గుర్రాలు, గండభేరుండాలు ఈ కథలన్నిటా కనిపిస్తాయి. జంతువుని రాకుమారిగా మార్చడం,రాకుమారున్ని ఓ గొప్ప అన్వేషకునిగా, ఆలోచనశీలిగా మార్చేయడం , చెట్టుమీద దెయ్యమే వరాలిచ్చే దేవతగా మారిపోవడం , గొప్పనిధి లభించడానికి సాహసకృత్యాలు చేయడం, ఎన్నో వింతలు , విశేషాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి.పిల్లలు మారాం చేయకుండా ఉండాలన్నా, వారికి హాయిగా,కమ్మగా నిద్రపట్టాలన్నా , చందమామపై ఆడుకుంటూ,నక్షత్రాలను తాకుతూ వారు హాయిగా కలల ప్రపంచంలో విహరిస్తూ ర్యాంకులు సంపాదించుకోవాలన్నా, విలువల సమాజాన్ని వారు నిర్మించాలన్నా ఇప్పుడీ కథాసాహిత్యం చదువుకోవాల్సిందే!

 

-నవ్య వారపత్రిక , 2 జూలై 2014 .

 

Nemaleeka_2jul2014@NavyaWeekly

 

“నెమలీకడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నెమలీక on kinige

 

Nemaleeka600

Related Posts:

  • No Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>