నవల అనగానే పాఠకుడికి కొన్ని అంచనాలు ఉంటాయి . తను చదివిన , తనకు నచ్చిన నవలలతో పోల్చుకుంటారు . “నేటి మనిషి మనుగడకు మానవత్వమే అత్యవసర ఔషధం” అనే భావన ఈ నవలకు ప్రేరణగా రచయిత్రి చెప్పారు. ఈ భావన అంతర్లీనంగా ఎంత ఉదారంగా ప్రవహించిందీ నిర్ణయించగల నిర్ణేత పాఠకుడే .
నవల ఆరంభం నుండి ఆకట్టుకునేలా రచన సాగింది. ఇది నవలకి బలాన్నిచ్చే అంశం . రచయిత్రి సమాజంలోని విభిన్న వ్యక్తుల తత్వాలు ,మనస్తత్వాలు పాత్రల ద్వారా బహిర్గతం చేశారు . సంఘర్షణ వల్ల కథలో పట్టు ఉంటుంది . అది కూడా ఈ నవల్లో ఉంది . వెరశి మంచి నవల .
-కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ , చిత్ర సకుటుంబ సచిత్ర మాస పత్రిక .
“కేర్‌టేకర్” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
కేర్‌టేకర్ on kinige