కథాస్రవంతిలో రెండోభాగాన్ని ఏభైకధలతో మనముందుకు తెచ్చారు డాక్టర్ కృష్ణమోహనరావు. ఇవి పైకి హాస్యకథల్లా కనిపించినా… అక్కడక్కడా శృంగారం గిలిగింతలు పెడుతుంది. వైద్యుడిగా వృత్తిపరంగా తన అనుభవంలోకొచ్చిన విషయాల్ని కథలుగా మలిచారని అర్ధమవుతుంది. ఈ కథల్లో స్వామీజీల రహస్యభాగోతాలు ( అమ్మనికరం … అబ్బ ! రివర్సయింది ) , కుర్రకారు సరదాలు మోటు సరసాలు ( అసలుకే ఎసరొచ్చింది , కట్కట్ , ఇది కధ కాదు , కౌంటర్ర్యాగింగ్ ) , వయసు మీద పడ్డా చీకటి వ్యవహారాలు నడిపే పెద్దమనుషుల జీవితాలు (దవులూరోరి తోట – దయ్యాలకోట) మనకి కనిపిస్తాయి .
ఈనాడు ఆదివారం – 22 ఏప్రిల్ 2012 .
“కృష్ణమోహన్ కథాసవ్రంతి భాగం – 2” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
కృష్ణమోహన్ కథాసవ్రంతి భాగం – 2 on kinige