పుస్తకం పేరు ‘చమత్కారం’. చమక్కులు సరే నషాళానికి అంటే కారం కూడా ఉన్నదేమోనని వెదికితే చలవ మిరియాల కారమే దొరుకుతుంది. కబుర్లు చెప్పుకోనివాళ్లు కలసిమెలసి ఉండలేరు. మునిమాణిక్యం మొగుడూ పెళ్లాల సరసాలూ, విరసాలూ కలబోసిన స్వారస్యాన్ని మనకి అందించారు. శ్రీపాద వారూ తమ కథల్లో కొంత వాటా పంచుకున్నారు. పక్కవాళ్లని పలకరించకుండా ఉండలేరు కొంతమంది ప్రయాణాల పదనిసలలో. లోకాన్ని పట్టించుకోని రచయిత అందరూ అనుకునేట్లు నరకానికే పోతాడు. భమిడిపాటి ఎంచుకున్న గురుశిష్యుల సరస సంభాషణలు చదివితే ఏవో సినిమా పాటలు గుర్తొస్తాయి. ఒకోసారి ‘చెపితే వింటివ గురూ గురూ’ అంటే ‘వినకే చెడితిర శిష్యా శిష్యా’ అన్నట్టుంటుంది. భమిడిపాటి నూరిన చమత్కారాల్లో రాజకీయాలూ, విద్యారంగం, మహిళా లోకం, ప్రభుత్వ పథకాలూ, నరుల బలహీనతలూ వగైరా వగైరాలన్నీ ప్రస్తావనకొచ్చాయి.
ఆంధ్రభూమి,13-09-2014.
“ చమత్కారం…! ”డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
చమత్కారం…! on kinige