ఇది నా శరీరం. ఎలా అయినా మార్చుకుంటాను. ఇది నా మనసు. దానికి నచ్చినట్టే నడుచుకుంటాను. ఈ సమాజానికేం హక్కుంది నన్ను ప్రశ్నించడానికి?- అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించిన ఓ హిజ్రా ఆత్మకథే ఈ పుస్తకం. తమిళనాడులోని పల్లెలో పుట్టిన ఓ అబ్బాయి…తన మగతనపు సంకెళ్లు తెంచుకుని… ప్రకృతి నిర్ణయానికి వ్యతిరేకంగా స్త్రీత్వాన్ని పొందాడు. హిజ్రాల్లో కలిశాడు. రేవతిగా పేరు మార్చుకున్నాడు. ఆ ప్రయత్నంలో కన్నవారికి దూరమయ్యాడు, సోదరుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. బతుకుబండి నడిపించడానికి ఒళ్లమ్ముకున్నాడు. అంత కష్టపడ్డా… సాధించిందేమిటి? కోరుకున్న జీవితాన్ని ఆస్వాదించాడా, ఆశించిన ఆనందాల్ని అందుకున్నాడా? అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే ‘ఒక హిజ్రా ఆత్మకథ’ చదవాలి. ప్రస్తుతం… సమాజంలో బహిష్కృతులుగా బతుకుతున్న తనలాంటి వారి కోసం ‘సంగమ’ అనే సంస్థ తరఫున పనిచేస్తున్న రేవతి కథ చదువుతున్నంతసేపూ మనసు అల్లకల్లోలం అవుతుంది. వీధుల్లోనో, దుకాణాల దగ్గరో చిల్లరపైసలు యాచించే మూడో ప్రకృతి జీవుల్లో రేవతి పోలికల్ని వెతుక్కుంటాం.
- వెంకట్ , ఈనాడు – ఆదివారం , 23-11-2014.
“ఒక హిజ్రా ఆత్మకథ”డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
ఒక హిజ్రా ఆత్మకథ on kinige