కలశపూడి కథల్లో చక్కని హాస్యంతోపాటూ చిక్కనైన జీవితమూ ఉంది. ‘ఒక శీత కథ’ – మాండలిక ప్రయోగాల చుట్టూ తిరిగే హాస్యకథ. ‘నాకు శీతగా ఉందే’ అంటూ మొగుడు ముసుగుదన్ని పడుకుంటే… ఏ సీతో తన ప్రాణవిభుడి మనసును కొల్లగొట్టేసింది కాబోలని అలకపాన్పు ఎక్కేస్తుంది కొత్తపెళ్లాం. ‘ఒంట్లో నలతగా ఉండటం’ అనడానికే అత్తింటివారివైపు ఆ మాట వాడతారని తెలిశాక హాయిగా వూపిరి పీల్చుకుంటుందా అమ్మాయి. ‘నీళ్లాడటం’ అంటే ఏమిటో కూడా తెలుసుకోవడం కొసమెరుపు. ‘బొబ్బిలి 1876′ కాస్త చరిత్రా, కాస్త కల్పనా, కాస్త కలా జోడించిన కథ. ‘డెత్ సర్టిఫికెట్’ మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యవస్థలో మరణ ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవడం ఎంత కష్టమంటే, ఆ ఆనందం ముందు ఆత్మీయుల మరణ విషాదమూ చిన్నదైపోతుంది. ‘తీరం చెమ్మగిల్లింది’, ‘మా వూరి మంత్రిగారి శతకం’, ‘సంకల్పం’, ‘తైలవర్ణ(వి)చిత్రం’ తదితర కథలూ బావున్నాయి.
- సత్య,ఈనాడు ఆదివారం, 25 – 1 – 2015.
“కలశపూడి కథలు” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి..