డా.హరికిషన్ గారు 19 మే 1972 నాడు కర్నూలు జిల్లా పాణ్యంలో జన్మించారు. స్వర్గీయ ఎం. హుసేనయ్య, శ్రీమతి ఎస్. కృష్ణవేణమ్మ వీరి తల్లిదండ్రులు.
డా.హరికిషన్ గారు ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు – సామాజిక దర్శనం’ అనే అంశంపై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొంది, ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుడుగా ఆదోనిలో పనిచేస్తున్నారు.
వీరి మొదటి కథ ‘పడగనీడ’ 1997లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది.అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, పట్టుదలతో పలు జానపద కథలను వీరు సేకరించారు. అంతే కాకుండా తెలుగు బాల సాహిత్యంలో ప్రస్తుత తరానికి అందుబాటులో లేకుండా పోయిన పలు కథలను పుస్తకాలుగా వెలువరించారు. ఇంకా తెలుగు బాల బాలికల కోసం అద్భుతంగా పలు గేయాలు రచించారు.
ఇప్పటి తెలుగు బాల బాలికలు ఈ పుస్తకాలు చదివి తెలుగుకు మరింత దగ్గరగా ఉండవచ్చు.
వీరు రచించిన బాలసాహిత్యంలోని ఈ క్రింది పుస్తకాలు కినిగెలో లభిస్తాయి.
1. తేనెతీగ కందిరీగ
2. పావురం దెబ్బ
3. బొమ్మలతో సామెతలు-2
4. మెరుపుల వాన
5. బంగారు చేప – గంధర్వ కన్య
6. ఠింగురు బిళ్ళ
7. తిక్క కుదిరిన నక్క
8. నాకు మూడు నీకు రెండు
9. మూడు కోరికలు
ఈ పుస్తకం ఒక్కొక్కటి విడిగా 50/- రూపాలయలకి లభిస్తుంది లేదా ఇవన్నీ కలిపి ఒక సెట్గా 75 రూపాలయల డిస్కౌంట్తో రూ. 675కే పొందవచ్చు.
ఇవే కాకుండా, డా. హరికిషన్ గారు సామాజిక సమస్యలపై 1. మాయమ్మ రాచ్చసి 2. నయాఫత్వా 3. మూడు అబద్ధాలు 4. ఒక చల్లని మేఘం 5. నేనూ మా అమ్మ అనే కథాసంపుటాలు వెలువరించారు. ‘కర్నూలు కథ’ అనే కథాసంకలనం కూడా రూపొందించారు.
హరికిషన్ గారు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాసారు. వీటిల్లో 1. నక్కబావ – పిల్లిబావ 2. నల్లకుక్క 3. కిర్రు కిర్రు రొడ్డప్ప 4. కుందేలు దెబ్బ 5. ఒకటి తిందునా రెండు తిందునా 6. చెప్పుకోండి చూద్దాం 7. నలుగురు మూర్ఖులు 8. పిల్లలు కాదు పిడుగులు 9. పిండిబొమ్మ వీరుడు 10. బొమ్మలతో సామెతలు -1 11. చిన్నారి గేయాలు 12. పిల్లల జానపద గేయాలు 13. చిలకముక్కు ఊడిపాయె కొన్ని. వీరు నిరంతర అధ్యయనశీలి, సాహితీ శ్రామికులు. తెలుగు పుస్తకాల కోసం అణ్వేషిస్తున్న తల్లిదండ్రులకు ఈ పుస్తకాలు ఒక ఒయాసిస్సు వంటివి.
కొల్లూరి సోమశంకర్