కినిగె బహుమతిని క్లెయిం చేసుకోవడం

కినిగె ద్వారా ఎవరయినా వారి స్నేహితులకి పుస్తకాల్ని బహూకరించవచ్చు లేదా వారి బ్యాలెన్స్ నుండి కొంత మొత్తాన్ని గిఫ్ట్ కూపన్ గా బహూకరించవచ్చు. ఆ విధానమేమిటో ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

మీకు అటువంటి బహుమతి వస్తే పుస్తకం కినిగెపై ఎలా చదవాలో ఇక్కడ చూద్దాం.

బహుమతిగా పుస్తకం పొందిన వారికి ఈ కింద చూపిన విధంగా వేగు వస్తుంది.

అలానే గిఫ్ట్ కూపన్ ద్వారా డబ్బుని స్నేహితుల ద్వారా పొందిన వారికి ఈ కింద చూపిన విధంగా వేగు వస్తుంది.

ఇలా బహుమతి పొందిన వారు వారి వేగులో ఇవ్వబడిన గిఫ్ట్ యాక్టివేషన్ కోడ్(Gift Activation Code అన్న పాఠ్యం ముందు బొద్దు అక్షరాలుగా ఉన్న పొడి అక్షరాలు) ను భద్రపరుచుకుని, అక్కడే ఇచ్చిన లంకెను దర్శించాలి.

ఆ తరువాత గిఫ్ట్ యాక్టివేషన్ కోడ్ నకలు తీసుకోని క్రింద చూపిన గిఫ్ట్ కోడ్ డబ్బాలో ఎంటర్ చేసి క్లెయిం అనే మీట నొక్కాలి. అంతే మీ బహుమతి క్లెయిం అవుతుంది.

 

రీచార్జ్ విజయవంతం అయ్యాక కింది బొమ్మలో చూపించిన విధంగా కూపన్ అందిన సమాచారం మరియు పుస్తక పేజీకి లంకె ఉన్న సందేశం కనిపిస్తాయి.

లేదా

Book అనే పాఠ్యం ఉన్న ఆ లంకెను దర్శిస్తే బహుమతి పొందిన పుస్తక పేజీకి వెళతారు. కుడి పక్కన గల లంకెల్లో పుస్తక డౌన్లోడ్ లంకె ఉంటుంది బహుమతిగా పొందిన పుస్తకం కొన్నదా లేక అద్దెకు తీసుకున్నదా అన్న దాన్ని బట్టి Download Rented Book లేదా Download purchased book అని లంకె పాఠ్యం ఉంటుంది.

ఆ లంకెను క్లిక్ చెయ్యగానే ascm దస్త్రం(URLLink.ascm) ఒకటి కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అవుతుంది.

ascm పొడిగింత గల ఆ దస్త్రం డౌన్లోడ్ పూర్తి అయ్యాక దానిని అడోబె డిజిటల్ ఎడిషన్స్ తో తెరవాలి.

అంతే, అయిపోయింది.

పుస్తకాన్ని ఇక చదవవచ్చు.

మీరు కినిగెలో పుస్తకాలు చదవడానికి కొత్త అయితే ఈ లింకులో ఉన్న సహాయ పుట చూడగలరు.

Related Posts:

  • No Related Posts