శరవేగంతో దూసుకుపోతున్న నాగరికతా ప్రపంచంలో ఆధ్యాత్మక చింతనగాని, ఈ ప్రపంచంలో తన ఉనికికి అర్థం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస గానీ రోజు రోజుకీ కొరవడుతున్న ఈ రోజులలో మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి ‘అ ఆ ఇ ఈ‘ సంకలనం ద్వారా చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. సుగర్ కోటెడ్ పిల్స్ లాగా హాస్యం, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల జీవితాలలోని ఘట్టాలని, హిందూ ధార్మిక వ్యవస్థలోని శ్లోకాలకు వివరణ ఇస్తూ ధార్మిక బోధన చాలా బాగుంది. పుస్తకం ఆసాంతం చదవక పోయినా (అంత తీరిక లేని వారికి) అక్కడక్కడ పేజీలు తిరగవేసినా రవంత సేపు మనిషిని ఆలోచింపజేసేవిగా వున్నది. మంచి ప్రయత్నం!
– స్వప్న మాస పత్రిక సమీక్ష
* * *
‘అ ఆ ఇ ఈ’ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
అ ఆ ఇ ఈ On Kinige