ఆండ్రాయిడ్ పై కినిగె తెలుగు పుస్తకాలు చదవటం ఇలా ….

కినిగె పుస్తకాలు ఆండ్రాయిడ్ పై భేషుగ్గా చదవవచ్చు. ఈ దిగువ ట్యుటోరియల్ వివరణాత్మకంగా మీకు సహాయం చేస్తుంది – చదవండి.

ఒక్క మాటలో :

ఆల్డికో (Aldiko) అనుర్తణిని (Application) ప్రతిష్టించి , అక్కడి మై క్యాటలాగ్ విభాగానికి కినిగెను కలిపి – మిగతా కథ మొత్తం నడిపించవచ్చు అచ్చు మామూలు కంప్యూటరులోలానే.

 

 

వివరంగా :

ముందు సూచన –

ఈ క్రింది ట్యుటోరియల్ మీకు ఈసరికే కినిగె గురించి, కినిగె పుస్తకాలు చదవటం గురించి, అడోబ్ ఐడీ గురించి పూర్తి ఐడియా ఉంది అని అనుకుంటున్నాము. ఈ విషయాలు మీకు కొత్త అయితే కినిగెపై మీ మొదటి పుస్తకాన్ని చదవటం ఎలా అనే వ్యాసం చదివి ఆ తరువాత ఈ ట్యుటోరియల్ చదవగలరు.

సోపానం 1: అల్డికో అనువర్తణాన్ని ప్రతిష్టించండి.

అ. ఆండ్రాయిడ్ మార్కెట్ ప్లేస్ దర్శించి Aldiko కోసం అణ్వేషించండి.

ఆ. Aldiko బుక్ రీడర్ అని ఉన్న విభాగం నొక్కండి.

ఇ. FREE అనే మీట నొక్కండి.

ఈ. OK మీట నొక్కండి.

ఉ. “Your Item will be downloaded”  (మీ సరుకు దిగుమతి అవుతోంది)

ఊ. పైబారు నుండి మీరు ప్రోగ్రెస్ గమనించవచ్చు.

ఋ. పూర్తిగా ప్రతిష్టించాక, అల్డికో తెరవండి.

సోపానం 2. మొదటిసారి అల్టికో ను కినికె పుస్తకాలు చదవటానికి సరిచేయటం.

 

అ. ఒకసారి అల్డికో తెరిచాక, గృహ చిహ్నం నొక్కండి.  (పైన ఎడమవైపున ఉన్న ఇల్లు బొమ్మ)

ఆ. ఆ తరువాత మై క్యాటలాగ్ నొక్కండి.

ఇ. మై క్యాటలాగ్ నకు కుడివైపున ఉన్న ప్లస్ గుర్తు నొక్కండి.

ఈ. యాడ్ క్యాటలాగ్ అనే కిటికీ తెరుచుకుంటుంది.

ఉ. కినిగె ను మీ క్యాటలాగ్ నకు కలపండి.

Title = Kinige

URL = http://kinige.com

ఊ. కినిగెను కలిపాక, ఈ దిగువ చూపించిన విధంగా మై క్యాటలాగ్ కనిపిస్తుంది.

3. కినిగె పుస్తకాలు జల్లించటం.

 

అ. అల్డికో తెరిచి, గృహ చిహ్నం నొక్కి, మై క్యాటలాగులు దర్శించి, కినిగె పై నొక్కండి.

ఆ. కినిగె తెరవబడుతుంది.

 

ఇ. మామూలు కంప్యూటరులో చేసినట్టే ఇక్కడ పుస్తకాలు జల్లెడపట్టడం, కొనటం, అద్దెకు తీసుకోవటం — చెయ్యవచ్చు.

ఉ. కుడివైపున ఉన్న Login లంకె నొక్కండి.

ఊ. లాగిన్ పూర్తి చేసి మీకు నచ్చిన పుస్తకాన్ని దర్శించండి.

మీరు ఈసరికే కొన్ని పుస్తకాలు కినిగెలో కొని ఉంటే, వాటిని మీరు పైన కుడివైపున ఉన్న My Books లంకె నొక్కండి. అక్కడి నుండి మీరు కొన్న పుస్తకాలు దర్శించి వాటిని గతంలో వాడిన అడోబ్ ఐడీ వాడి ఫోన్లోకి కూడా దిగుమతి చేసుకోవచ్చు.

గమనిక  – తెలుగు పాఠ్యం మీకు కనిపించకపోవచ్చు ఈ పేజీల్లో, కానీ పుస్తకం కొన్నాక మీకు అది పూర్తిగా కినిపిస్తుంది. ఇంకా మీరు ఉచిత మునుజూపు కూడా దిగుమతి చేసుకోని చదవవచ్చు, ప్రయత్నించండి.

ఋ. పుస్తకాన్ని అద్దెకు తీసుకోవటం, లేదా కొనటం చేయండి.

ౠ. Download Book మీట నొక్కండి.

ఎ.  అడోబ్ ఐడీ ని ఉపయోగించి చేతనం చేయండి.

ఏ.  దస్త్రం దిగుమతి అవుతుంది.

ఐ. పుస్తకం మీ గ్రంథాలయంనకు కలపబడుతుంది.

ఒ. పుస్తకాన్ని నొక్కి తెరవండి.

ఆనంద కినిగె పఠనం.

Related Posts: