బాగా తెలుసుననిపిస్తుందిగాని దేహం పరమ రహస్యం పచ్చి దగాకోరు అంటాడు నరేష్ నున్నా ‘అపరిచితం‘లో. మనకు బాగా తెలిసిన విషయాల్ని ఏమీ తెలియవన్నట్టు, మనకేమీ తెలియని విషయాలను ఎప్పటికీ తెలుసుకోలేనట్టు చెప్పడంలో నరేష్ చేయి మెలిపడ్డ రచయిత . ఆమె గురించి ఒక అలౌకిక ఆలాపన ఈ ‘అపరిచితం‘ . దేహ రహస్యం గురించి దాపరికం లేకుండా మాట్లాడుతున్నట్టు పైకి కనపిస్తుంది కానీ , కధనాన్ని లోతుల్లోకి వెళ్ళి అర్ధం చేసుకొంటే అనేక దేవ రహస్యాలు అర్ధమవుతాయి.ప్రేమ గురించీ, ఆమెతో చెప్పని వన్‌సైడ్ లవ్ గురించీ జ్ఞాపకాల తలపోత …. ప్రవాహంలా పాఠకులను పరుగులు పెట్టిస్తుంది.
-దేరా,ఆంధ్రజ్యోతి-ఆదివారం,23-11-2014.
“అపరిచితం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..
అపరిచితం on kinige