ఇవి మామూలు వ్యక్తుల కథలు. మరునిమిషం ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో జీవనపోరాటం సాగిస్తున్న సామాన్యుల వ్యథలు. మూడు దశాబ్దాలక్రితం ‘ఈనాడు’లో రావూరి భరద్వాజ నిర్వహించిన ఉదాత్త శీర్షిక – ‘జీవన సమరం’. తెలుగు పత్రికా ప్రపంచంలో పెనుసంచలనం సృష్టించి, దయాపరులెందరినో తట్టిలేపిన వ్యధార్త జీవుల యధార్థగాథల చిత్రణా సంపుటమిది. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, తిత్తులూదే కార్మికుడిగా, పేపరుబాయ్గా పనిచేసిన రావూరి భరద్వాజకు సహస్రవృత్తుల సమస్త ప్రవృత్తులు తెలుసు. కనుకే- లోతుల్లోకి వెళ్ళి, గుండెల్ని పిండేసే వాస్తవాలు వెలికితీయగలిగారు. ‘పాకుడురాళ్లు’ నవలకుగాను 2012లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన రావూరి భరద్వాజ, ‘జీవన సమరం’కు ఆ అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
- దత్తు, ఆదివారం అనుబంధం, 11th May 2014
ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి..
http://archives.eenadu.net/05-11-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka
“జీవన సమరం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
***