భవతీ భిక్షాందేహి

ఇల్లిందల సరస్వతీదేవి రచించిన సాంఘిక నవల – భవతీ భిక్షాందేహి. అండలేని ప్రతి వ్యక్తి బ్రతకటానికి యాచించనవసరంలేదనీ, కష్టపడి ఆత్మ గౌరవాన్ని పాదించుకుని ఉన్నత స్థాయికి చేరవచ్చనీ ఈ నవలలో చెప్పారు రచయిత్రి.

వాసుదేవరావు ధనికుడు, చదువుకున్నవాడు. ఒక మిల్లులో మేనేజరుగా పనిచేస్తూంటాడు. అతడు కార్మికుల సేవకై తన జీవితాన్ని పణంగా పెట్టినవాడు. కుటుంబ జీవితం తన ఆదర్శానికి అడ్డు వస్తుందని దృఢంగా నమ్మినవాడు. తల్లీదండ్రి బలవంతాన ఒప్పించి వివాహం చేస్తే, భార్య సులోచన గర్భవతి అయిన తరువాత కట్టడి చేసి పుట్టింటికి పంపుతాడు. ఆమె ఒక పిల్లవాడిని కని, పోషణకై ఉద్యోగం చేస్తూ క్షయవ్యాధికి లోనై, చనిపోతుంది. అంతకు ముందే సులోచన ఆ ఆరేళ్ళ పిల్లవాడిని ఒక సంఘ సేవికకు ఒప్ప చెప్పుతుంది.

ఈ సంఘ సేవిక వాసుదేవరావు షరతులకు ఒప్పుకుని అతనిని వివాహం చేసుకున్న అనురాధ. పిల్లవాడు కృష్ణ ఆమె దగ్గర నుంచి తప్పించుకుని విధి ఎటు తీసుకుని వెళ్ళితే అటు వెళ్ళుతాడు.

అనేక కష్టాలు పది చివరకు భిక్షం కూడా ఎత్తుకుని స్వతహాగా తెలివి, పట్టుదల ఉన్న కృష్ణ సామాజిక స్పృహ ఉన్న దక్షిణామూర్తి శాస్త్రి, సూర్యం వంటి వాళ్ల సహాయంతో ఎం. ఎస్సీ వరకు చదువుకుంటాడు.

పది సంవత్సరాల తర్వత వాసుదేవరావు ఆలోచనా ధోరణి మారుతుంది. కొడుకు ఉన్నాడని తెలిసి, వాడిని దగ్గరకి తీసుకోవాలని పరితపిస్తుంటాడు. కృష్ణ పట్టుదలగా తనను చిన్నతనంలో వద్దనుకున్న తండ్రి ఇప్పుడు తనకి అక్కర్లేదనుకుంటాడు.

చివరికి కృష్ణ మనసు మార్చుకుని తండ్రితో సయోధ్య చేసుకోడంతో కథ ముగుస్తుంది.

* * *

ఈ నవల తొలుత జయశ్రీ మాస పత్రికలో సీరియల్‌గా ప్రచురితమై పాఠకులని ఆకట్టుకుంది. 1976లో ప్రధమ ముద్రణ పొందింది. ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తోంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

భవతీ భిక్షాందేహి On Kinige

Related Posts: