శ్రీనందన నామ సంవత్సర పంచాంగం

అనుశృతంగా వస్తున్న పంచాంగ పరిజ్ఞానం దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి అనేక శాస్త్ర సంప్రదాయాలు ఏర్పడినవి.

అందులో దృక్‌సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ పంచాంగ గణన రచన సాగినది. పంచాంగకర్త బాల్యము నుండి వైఖానస ఆగమ, వాస్తు, జ్యోతిషశాస్త్రాంబుధిలోని అనర్ఘరత్నాలను పాండితీ చిహ్నాలుగా ధారణ చేసికొన్న శశికాంతుడు. స్వతః సిద్ధ అభిలాష, అభినివేశముతో వైఖానస ఆగమ గ్రంధాలను-జ్యోతిష శాస్త్రగ్రంధాలను సమన్వయ దృక్పథంతో ఈ పంచాంగ రచన గావించి యున్నాడు.

జ్యోతిష కళానిధి, తార్కిక గణనవేత్త, అదృష్టతాండవ రచనకర్త అయిన తాండవకృష్ణ చక్రవర్తి అప్రమేయ వైదుష్య విభవముతో ఈ పంచాంగమును కలికితురాయిగా తీర్చిదిద్దినారు.

వైఖానస లోకమునకు ఈ పంచాగం ఒక కరదీపిక వంటిది అని భావించవచ్చు.

- ‘ఆగమ ప్రవర’ వేదాంతం సార్వభౌమ

శ్రీనందన నామ సంవత్సర పంచాంగం On Kinige

Related Posts:

నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

- బాల గంగాధర తిలక్

Now Amrutam kurisina ratri eBook is available from Kinige. Visit http://kinige.com/kbook.php?id=672 for more details.

Related Posts:

స్వీయచరిత్రము–చిలకమర్తి లక్ష్మీనరసింహము

పండిత కుటుంబంలో పుట్టిన చిలకమర్తి సంస్కృతాంధ్రాల్లో ప్రావీణ్యం సంపాదించి, రాజమండ్రి కళాశాలలో ఆంగ్లాన్నీ అభ్యసించాడు. రాజమండ్రిలో చదువుకొంటున్నప్పుడే, వీరేశలింగం భావాలవైపు ఆకర్షింపబడి, ఆయన అనునూయులలో అగ్రగణ్యుడైనాడు. అప్పటికే, రాజమండ్రిలో నెలకొనివున్న
సంస్కరణ వాతావరణం, కళాశాల చదువు, అప్పుడప్పుడే రాజుకొంటున్న జాతీయభావజాలం చిలకమర్తిపై తీవ్రప్రభావాన్ని కల్గించాయి. 21 అధ్యాయాల్లో రాసిన ‘స్వీయ చరిత్రము’లో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది. బాల్యం, నర్సాపురంలో చదువు, రాజమండ్రిలో విద్యాభ్యాసం, ఉద్యోగం,

గ్రంథంరచన, నాటకసమాజం, వివాహం, మండలసభల్లో పాల్గొనడం, రామమోహన పాఠశాల ఏర్పాటు, నిర్వహణ, ఉన్నతపాఠశాల ప్రారంభం, కుటుంబ సమస్యలు, కష్టాలు, టంగుటూరి ప్రకాశం ఇంగ్లండ్‌ యాత్ర, హితకారిణి సమాజస్థాపన, అచ్చు యంత్రాన్ని నెలకొల్పడం, భారత జాతీయ కాంగ్రెస్ సభకు హాజరవడం, పత్రికాసంపాదకత్వం, నిర్వహణ – యివన్నీ సవివరంగా రాశాడు. చిలకమర్తి ఏకసంతగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి, స్వీయచరిత్రలో, తన జీవితకాలంలో జరిగిన ఘటనలను, సూక్ష్మాంశాలతో సహా చిత్రించాడు. చారిత్రక ఘటనలను సమతూకంతోనూ, వ్యక్తుల గూర్చి రాస్తున్నప్పుడు రాగద్వేషాల కతీతంగా, స్పష్టంగా, క్లుప్తంగా రాశాడు. నిత్యనైమిత్తకాల గూర్చి రాస్తున్నా, వాటినొక అంతర్‌దృష్టితో పరికించాడు.

- వకుళాభరణం రామకృష్ణ

స్వీయచరిత్రము On Kinige

Related Posts: