వాల్మీకి (డాక్టర్ భీమ్‌రావ్ గస్తి–ఆత్మ కథకు తెలుగు అనువాదం )–శాఖమూరు రామగోపాల్

 

జీవితంలో అణచివేత, వివక్ష, పేదరికం వంటి అనేక అడ్డుగోడల్ని బద్దలుకొట్టుకొని ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తులు సమాజంలో అరుదుగానైనా దర్శనమిస్తారు. అయితే ఆ ఎదగడం తను, తన కుటుంబం వరకే ఉపయోగించుకొనే వాళ్ల సంఖ్య అధికం. కోటి కొక్కరు మాత్రమే తన వ్యక్తిగత సౌఖ్యావకాశాలను తృణప్రాయంగా పక్కనపెట్టి సమాజంలో తనకు ఎదురైన అడ్డుగోడల్ని ఇతరులకు అడ్డుగోడలు కాకుండా ఉండడానికి జీవితాన్ని అంకితం చేసేవారు. పీడితతాడిత జనానికి అండగా నిలిచేవారు. అటువంటి కోటికొక్క వ్యక్తుల్లో భీమ్‌రావు గస్తీ ఒక్కరు. అందుకే ఆయన ఆరుకోట్ల కన్నడిగుల్లో శ్రేష్ఠకన్నడిగ పురష్కారం పొందారు. తన జీవితాన్ని కోట్లాది భారతీయులకు ఆదర్శంగా మలచుకున్నారు. భారతదేశానికి ఈనాడు ఎటువంటి సామాజిక నాయకత్వం కావాలో నిరూపించారు.

భీమ్‌రావు గస్తీ ఆదర్శ స్వీయ జీవితగాథను శ్రీ శాఖమూరు రామగోపాల్ చక్కని తెలుగులోకి అనువదించారు. ఒక విశ్వజనీన వ్యక్తిత్వాన్ని తెలుగు పాఠకుల ముంగిళ్లలోకి తెచ్చారు.

వాల్మీకి On Kinige

Related Posts: