ఇది తనికెళ్ల భరణి రాసిన మూడు నాటికల సంకలనం. ఇందులో జంబూ ద్వీపం, కొక్కొరొక్కో, ఛల్! ఛల్‍! గుర్రం అనే నాటికలు ఉన్నాయి. తనికెళ్ళ భరణి సినిమాలలో బిజీ కాకముందు రచించి ప్రదర్శించిన నాటికలివి. వివిధ పరిషత్తులలో ప్రదర్శించబడి, అనేక బహుమతులు గెలుచుకున్న నాటికలివి. నిడివి తక్కువగా ఉండి సులువుగా ప్రదర్శించగల నాటికలు ఇవి. పదునైన సంభాషణలతో నటులను, వీక్షకులను, చదువరులను ఉద్వేగానికి గురిచేసే నాటికలివి. అస్తవ్యస్త సమాజంపై భరణి సంధించిన వ్యంగ్యాస్త్రాలివి.
తనికెళ్ళ భరణి నాటికలు 123 On Kinige

జంబూ ద్వీపం ఓ పొలిటికల్ సెటైర్. ఇది ఓ ప్రయోగాత్మకమైన నాటిక. అన్ని పాత్రలూ కడుపుబ్బనవ్వించీ చివరకు కన్నీరు పెట్టిస్తాయి. బహుశా ‘జంబూద్వీపం’ సినిమాగా కూడా రావొచ్చు.

కేవలం రెండే రెండు పాత్రలతో రూపుదిద్దుకున్న తొలి నాటిక ఇదేనేమో. “ఈ నాటిక ఆడి ఆ రోజుల్లోనే – రెండు నెలల్లో దాదాపు ముప్ఫై అయిదువేల రూపాయలు సంపాదించాం. ఈ ప్రదర్శన కోసం బళ్ళుకట్టుకొచ్చీ – సుందరం దగ్గరా నా దగ్గరా ఆటోగ్రాఫులు తీసుకునేవారు ప్రేక్షకులు. కొక్కొరోకో – ఓ మధురానుభూతి.” అని అంటారు భరణి ‘కొక్కొరొక్కో’ గురించి.

“సరదాగ ‘మందు’ మీద ఏదైన హాస్య నాటిక రాయమంటే ‘గుర్రమెక్కడం’ అనే సామెతని మనస్సులో పెట్టుకుని రాసిందే ఛల్! ఛల్! గుర్రం’. చాలా సరదా నాటకం… చాలా తేలిగ్గా ప్రదర్శించొచ్చుగూడ. శ్రీమతి సూర్యకాంతంగారికి సన్మానం చేసి ఆ సందర్భంగా ఈ నాటిక ప్రదర్శిస్తే ఆవిడెంతో ముచ్చటపడి పోయింది!” అని అంటారు భరణి ‘ఛల్! ఛల్! గుర్రం’ గురించి.

ఈ నాటికలు చదవడం గొప్ప అనుభవం.
Click here to read these natikalu of Tanikella Bharani

తనికెళ్ళ భరణి నాటికలు 123 On Kinige

Related Posts: