మెత్తని కత్తులు! – ‘శ్రీ ఛానెల్-2′ పుస్తకంపై సమీక్ష

వ్యుత్పత్తి భాస్కరుడిగా పేరుతెచ్చుకున్న శ్రీరమణ కలంలోంచి జాలువారిన హాస్య, వ్యంగ్య కథనాల సమాహారమే ఈ పుస్తకం. ఆ శైలి భలే మెత్తగా ఉంటుంది, అదే సమయంలో తగలాల్సిన వారికి, తగలాల్సిన చోట, తగలాల్సిన మోతాదులో దెబ్బ తగిలి తీరుతుంది. అటువైపు ఉన్నది ఏ రాజకీయ నాయకుడో అయితే డబుల్‌డోసు! రచయిత ఓ పత్రికలో ధారావాహికగా ప్రచురించిన నలభై వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. ‘జీవన సమరం’లో బల్బు వెలిగించే విధానాన్ని వివరిస్తూనే బతుకును వెలిగించుకునే సూత్రాన్ని అంతర్లీనంగా బోధించారు. ‘పాసింగ్ ద బక్’ ప్రాథమిక సూత్రాల్ని విడమరిచారు. ‘నేను నిదానంగా చేస్తే – అది మందకొడితనం. వాడు నిదానంగా చేస్తే – అది నిశిత పరిశీలనం. నేచెయ్యకపోతే – అది లేజీ. వాడు చెయ్యకపోతే – అది బిజీ’ తరహా సమకాలీన సత్యవాక్యాలూ కనిపిస్తాయి. వాస్తు వెర్రినీ, సన్మానాల ప్రహసనాన్నీ… ఒకటేమిటి పాములా సమాజాన్ని చుట్టేసుకున్న ఏ లోపాన్నీ వదల్లేదు శ్రీరమణ.

- భాగ్యశ్రీ,ఈనాడు-ఆదివారం,25/02/2015.

Srichannel2

శ్రీ ఛానెల్ – 2” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి..

శ్రీ ఛానెల్ – 2 on kinige

SreeChannel2600

 

Related Posts:

సరదా కథల రచయిత “సత్యం మందపాటి” పుస్తకాలపై 20% ప్రత్యేక తగ్గింపు!

satyam mandapati

చమక్కులు, చురుక్కులుతో సరదా సరదాగా కథనాన్ని నడిపే రచయిత ‘సత్యం మందపాటి‘.
దీపావళి సందర్భంగా సత్యం మందపాటి గారి కినిగె ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ పై 20% ప్రత్యేక డిస్కౌంటు లభిస్తుంది.
సత్యం మందపాటి గారి పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కినిగెలో లభ్యమయ్యే సత్యం మందపాటి గారి పుస్తకాలు:

ఎన్నారై కబుర్లు (ఒకటి)
ఎన్నారై కబుర్లు (మరోటి)
అమెరికా వంటింటి పద్యాలు
చీకటిలో చందమామ
అమెరికా బేతాళుడి కథలు
మేడ్ ఇన్ అమెరికా
తెలుగువాడు పైకొస్తున్నాడు – తొక్కేయండి!
చెట్టుక్రింద చినుకులు
ఎన్నారై కథలు

 

 

Related Posts:

వ్యధార్త జీవుల గాథలు! – “జీవన సమరం” పుస్తకంపై సమీక్ష

ఇవి మామూలు వ్యక్తుల కథలు. మరునిమిషం ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత వాతావరణంలో జీవనపోరాటం సాగిస్తున్న సామాన్యుల వ్యథలు. మూడు దశాబ్దాలక్రితం ‘ఈనాడు’లో రావూరి భరద్వాజ నిర్వహించిన ఉదాత్త శీర్షిక – ‘జీవన సమరం’. తెలుగు పత్రికా ప్రపంచంలో పెనుసంచలనం సృష్టించి, దయాపరులెందరినో తట్టిలేపిన వ్యధార్త జీవుల యధార్థగాథల చిత్రణా సంపుటమిది. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, తిత్తులూదే కార్మికుడిగా, పేపరుబాయ్‌గా పనిచేసిన రావూరి భరద్వాజకు సహస్రవృత్తుల సమస్త ప్రవృత్తులు తెలుసు. కనుకే- లోతుల్లోకి వెళ్ళి, గుండెల్ని పిండేసే వాస్తవాలు వెలికితీయగలిగారు. ‘పాకుడురాళ్లు’ నవలకుగాను 2012లో జ్ఞానపీఠ పురస్కారం పొందిన రావూరి భరద్వాజ, ‘జీవన సమరం’కు ఆ అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

- దత్తు, ఆదివారం అనుబంధం, 11th May 2014

ఈ సమీక్షను ఈనాడు పుస్తక సమీక్ష పేజీలో చదవడానికి ఈ క్రింది లింకు క్లిక్ చేయండి..

http://archives.eenadu.net/05-11-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

జీవన సమరం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***

జీవన సమరం on Kinige

Related Posts:

కాలం చెల్లని ‘కాలమ్’కబుర్లు

జంట అవధానులు, జంట కవయిత్రులు తెలుసుగానీ జంట కాలమిస్టుల గురించి విన్నది తక్కువే. రచయిత్రులు ఓల్గా, వసంత కన్నబిరాన్ కలిసి ఓ దినపత్రికలో ఏడాది పాటు నిర్వహించిన ‘కాలమ్’ ఇప్పుడు ‘ఈ కాలమ్‘ పుస్తకంగా వచ్చింది. ‘రెండు కొప్పులొకచోట చేరితే…’ అన్న సామెతను చిత్తు చిత్తు చేస్తూ ‘ప్రతి అంశం గురించీ మాట్లాడుకోవడం, కలిసి రాయడం మాకెంతో సంతృప్తినిచ్చింది’ అని చెప్పుకొచ్చారు వాళ్లు తమ ముందుమాటలో.

వాస్తవంగా ఈ కాలంలో మనం ఏయే అంశాలను సీరియస్‌గా పట్టించుకోవాలి, వేటిని కూడదు అనేది తెలుసుకోవడానికి దిక్సూచిగా నిలబడుతుందీ పుస్తకం. వేలంటైన్స్ డే వేడుకలు, టీవీ కార్యక్రమాలు, మకరజ్యోతి దర్శనాలు, సెల్‌ఫోన్ సంభాషణలు, ఓట్స్ టిఫిన్లు, టమోటా పండగలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు… ఇలాంటి రోజువారీ విషయాల వెనక ఉన్న మార్కెట్ శక్తులను సామాన్యుడి దృష్టికి తేవడానికి ఉపయోగడతాయి ఈ కాలమ్ కబుర్లు. ఒబామా, ఒసామాల గురించి, ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి నిర్వాకం గురించి, పేదలకు అందని వైద్యం గురించి… ఒకటీరెండు కాదు, దాదాపు యాభై అంశాల మీద సున్నితంగానో, హాస్యంగానో చెబుతున్నప్పుడు కూడా వాళ్ల మాటల్లో పదును ఏమాత్రం తగ్గలేదు. ‘ఈ కాలమ్‌లో మేం రాసిన విషయాలన్నీ ముఖ్యమైన రాజకీయ అంశాలే. వాటికి ఇప్పట్లో కాలం చెల్లే అవకాశం కనపడటం లేదు. మళ్లీ మళ్లీ అవే సంఘటనలు, అవే ధోరణులు కొనసాగుతున్నాయి…’ అన్న రచయిత్రుల అవగాహన సరైనదే అనిపిస్తుంది నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలను చూస్తున్నప్పుడు.

అసమానత్వం, ఆధిపత్యం, హింస, అత్యాచారం, అవినీతి, దోపిడి, మూఢత్వం కొనసాగుతున్న రోజుల్లో ఆయా అంశాల గురించి రచయిత్రులు చేసిన వ్యాఖ్యలు, విశ్లేషణలు సామాన్యులకు సైతం ఒక రాజకీయ దృష్టి కోణాన్ని, సమస్యల లోతు గురించిన అవగాహనను కలిగిస్తాయి. అలా కలగాలనే ఉద్దేశంతోనే ‘ఈ కాలమ్‌ను పుస్తకంగా తెస్తున్నాం’ అన్న రచయిత్రులు ఆ పనిలో సఫలీకృతులయ్యారనే చెప్పాలి. తమ ఉద్యోగం, తమ ఇల్లు…. అని గిరిగీసుక్కూచుంటున్న వాళ్లంతా కనీసం బయటేం జరుగుతోందో తెలుసుకోవాలంటే, తాము తమలా ఎందుకున్నారో తెలుసుకోవాలంటే దీన్ని తప్పక చదవాలి.

అరుణ పప్పు
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, 19 మే 2013

* * *

“ఈ కాలమ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
ఈ కాలమ్ On Kinige

Related Posts: