బాబా సాహెబ్ దార్శనికుడు. ఆయన సిద్ధాంతాల పునాదుల మీద సమసమాజాన్ని స్థాపించుకోవచ్చు. బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ప్రచురించిన ఈ పుస్తకం… ఆయన సిద్ధాంతాల్లోని భిన్న పార్శ్వాలను పరిచయం చేస్తుంది. రాజశేఖరయ్య ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక తత్వాన్ని’ వివరిస్తే…అఖిలేశ్వరి ఆయన్లోని స్త్రీవాదిని విశ్లేషించారు. ఆయన స్వప్నించిన గ్రామీణ భారతాన్ని సతీష్‌చందర్, ప్రపంచీకరణలో దళితుల స్థితిగతుల్ని నరసింహారెడ్డి కళ్లకుకట్టారు. పాతిక వ్యాసాలూ ఆ మేధావిని పాతిక కోణాల్లో పరిచయం చేస్తాయి.
శ్రీనివాస్, ఆదివారం అనుబంధం, 25th May 2014
“అద్వితీయుడు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
***