కర్ణుడి కోణంలో… “కర్ణ మహాభారతం” పుస్తకం పై సమీక్ష

ప్రతినాయకుల పక్షాన నిలిచినా…కథానాయకుడికి ఉండితీరాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కర్ణుడికి. ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ దానగుణం… మహాభారతంలోని ఏ పాత్రలోనూ కనిపించవు. అంతిమంగా పాండవుల విజయాన్ని ఆకాంక్షించే సామాన్య పాఠకుడు కూడా… మనసులో ఏ మూలనో కర్ణుడి పట్ల అభిమానాన్ని కనబరుస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యోధుడు ప్రాణాలు కోల్పోకుండా ఉంటే బావుండని ఆశిస్తాడు. కర్ణుడి జీవితం నిండా అవమానాలూ మోసాలే. నీటిపాలు చేసిన కన్నతల్లి కుంతి నుంచి… బాధ్యత మరచిన సారథి శల్యుడి దాకా… ఎన్నో అనుభవాల గాయాలు. కురుపాండవుల అస్త్ర ప్రదర్శన సమయంలో నేనున్నానంటూ రంగప్రవేశం చేయడం మొదలు… అర్జునుడి చేతిలో నేలకొరిగే దాకా… ప్రతి మలుపునూ కళ్లకు కట్టినట్టు వివరించారు. కర్ణుడు కేంద్ర బిందువుగా శ్రీశార్వరి చేసిన విశిష్ట రచన ఇది..

- వైష్ణవి, ఈనాడు ఆదివారం అనుబంధం, 14 సెప్టెంబర్ 2014

KarnaMahaBaratam_14Sep14

“కర్ణ మహాభారతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

కర్ణ మహాభారతం on kinige

 

KarnaMahabharatam600

Related Posts:

లేలేత భావాలు! – ‘నీటిరంగుల చిత్రం’ పుస్తకం పై సమీక్ష

సూక్ష్మచిత్రకారుడు ఏ ఆవగింజమీదో అప్సరసను చిత్రించినట్టు… అతి సున్నితమైన భావాల్ని అంతకంటే సున్నితమైన భాషలో చెప్పగలగడం చిన వీరభద్రుడికే చెల్లింది. ‘అమ్మానాన్నల్లాంటి భూమ్యాకాశాలు, ఏ రహస్య/ఏకాంతంలోనో తమ కోసం నన్ను సృష్టించుకున్నాయి/నాతోపాటే కలిసి పెరుగుతూ, రోజువారీ మాటల్లోంచి/కొంత తేనె చేర్చి నాకొక భాష ఉగ్గుపోసాయి’ అనాలంటే భూమి మీద ఎంత ప్రేమ ఉండాలి, ఆకాశాన్నెంత గౌరవించాలి, అనంతసృష్టిమీదెంత అవ్యాజమైన మమకారం ఉండాలి! పుస్తకంలోని రెండొందల నీటిరంగుల చిత్రాల్ని దర్శించడానికి కళ్లొక్కటే సరిపోవు, కవిత్వాన్ని ఆస్వాదించే మనసూ ఉండాలి.

- తాత్విక్, ఈనాడు ఆదివారం అనుబంధం, 7th Sep 2014

neetiRangulaChitram

“నీటిరంగుల చిత్రం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

నీటిరంగుల చిత్రం on kinige

 

NeetirangulaChitram600

Related Posts:

అమ్మాయి–అమ్మ–అమ్మమ్మ పుస్తకం ఇప్పుడు కినిగె లో లభిస్తుంది.

అమ్మాయి – అమ్మ – అమ్మమ్మ (ఆరోగ్యకోశం) On Kinige

 

పుస్తకం గురించి

"ఆరోగ్యం బజారుకి వెళ్ళి కొనుక్కొగలిగే వస్తువు కాదు, ఎంత డబ్బు వెచ్చించినా దొరికేది కాదు. పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కూడా ఆరోగ్యాన్నివ్వలేవు. అనారోగ్యాన్ని మందులతో తగ్గిస్తాయే తప్ప. జీవితంలోని ప్రతి దశలోనూ ఆరోగ్యం కోసం అందరూ శ్రద్ధ తీసుకోవాలి. ఆడపిల్ల జన్మించి అమ్మాయిగా ఎదిగి, అమ్మగా మారి, అమ్మమ్మ అయ్యే వరకూ వివిధ దశలలో అవసరమయ్యే పోషణ, ఆరోగ్య రక్షణ, అనారోగ్యాల పరిష్కారానికి అవకాశమున్న మార్గాలు. సూచనలతో అన్ని దశల ఆడవారికీ అన్ని వేళలా ఆప్తమిత్రురాలిలా ఉండే పుస్తకం.”

 

రచయత్రి గురించి

  • ఆయుర్వేద వైద్యంలో రెండు దశాబ్దాల అనుభవం.
  • - పత్రికలు, రేడియో, టి.వి. మాధ్యమాల ద్వారా అందరికీ ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం.
  • - తండ్రి శ్రీ ఉషశ్రీ అసంపూర్ణ గ్రంథం "రామాయణంలో హనుమంతుడు" సంపూర్తి.
  • - ‘ప్రకృతి వరాలు’ పుస్తక రచన.
  • - ఆయుర్వేద విద్యార్థుల కోసం "Padartha Vijnana Made Easy", "Prasuti Tantra Made Easy", "Stree Roga Made Easy" పాఠ్య గ్రంథ రచన.
  • - "Why of Herbs", "An Institute of Ayurveda", "పుట్టబోయే బుజ్జాయి కోసం" రచనలకి జాతీయ బహుమతులు.
  • - ఇండియాటుడే, ఆంధ్రప్రభ, స్వాతి, రచన పత్రికలలో కథల ప్రచురణ బహుమతులు.
  • - ఆకాశవాణి వివిధ కేంద్రాల ద్వారా నాటికల (రచన) ప్రసారం.
  • - భరతముని ఆర్ట్స్ అకాడమీ వారి – "ఆదర్శ వనితా పురస్కారం" – 2007
  • - చిత్రలేఖనం దినచర్యలో భాగం

 

http://kinige.com/kbook.php?id=65 ఈ లంకె ఫాలో అయ్యి ఈ పుస్తకాన్ని మీరు అద్దెకు తీసుకోవచ్చు, లేదా కొనుక్కోవచ్చు.

Related Posts: