ముస్లింల అస్తిత్వ వేదనలకూ సామాజిక సమస్యలకూ అద్దంపట్టే కథా సంకలనం- బహెన్. రహమతుల్లా రాసిన ఈ పన్నెండు కథల సంపుటి వారి జీవనపార్శ్వాల్ని స్పృశిస్తుంది. వారిలోని ఆత్మగౌరవ చైతన్యాన్నీ పరిస్థితుల్ని దీటుగా ఎదుర్కోడానికి పడుతున్న తపననూ ప్రస్ఫుటం చేస్తుంది. ముస్లిం మహిళల జీవితాల్లోని అనేక కోణాల్ని ‘మా’ కథ వ్యక్తీకరిస్తుంది. రంజాన్ పర్వదిన దృశ్యాల సమాహారంగా ‘చాంద్కి ఈద్’ ప్రకటితమవుతుంది. సహజత్వానికి దూరమై, కృత్రిమత్వానికి దగ్గరైన ఓ వ్యక్తి మానసిక స్థితిని ‘బుచ్చిగాని బాగోతం’ వెల్లడిస్తుంది. గోద్రా సంఘటనల పరిణామాల్ని ‘బోర్డర్స్’ కథ ఆవిష్కరిస్తుంది. ‘బా’ కథ తండ్రిపట్ల ఉండే మమకారాన్ని ధ్వనింపజేస్తుంది. అబ్దుల్లా పాత్ర ఎదుర్కొనే కష్టనిష్ఠురాలను ‘కిరాయి మకాన్’ ప్రతిబింబిస్తుంది. వర్తమాన పరిస్థితుల్ని కథల్లోకి అన్వయించి, వాటిలో జవజీవాల్ని నింపడంలో రహమతుల్లా సఫలీకృతులయ్యారు.
– కావూరి లాస్యశ్రీనిధి , ఈనాడు ఆదివారం , 25-07-2014.
“బహెన్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.