దృఢచిత్తం ముందు వైకల్యమైనా వంగి సలాము చేయాల్సిందే. కోసూరి ఉమాభారతి ‘ఎగిరే పావురమా‘ నవల అంతర్లీన సందేశమూ ఇదే. గాయత్రి అనే పాత్ర ద్వారా తన భావాల్ని బలంగా వినిపించారు రచయిత్రి. ఎవరో వదిలి వెళ్లిన ఆ వికలాంగురాల్ని అపురూపంగా పెంచుకుంటాడో వృద్ధుడు. అపార్థాలూ అనుమానాలూ అనుబంధాల్ని ఎలా కలుషితం చేస్తాయో తాత-మనవరాలి పాత్రలద్వారా చెప్పించారు. ఆడపిల్లను కనడం ఓ శాపమని భావించే మూర్ఖులకు చెంపదెబ్బ ఈ రచన.
-శ్రీనివాస్,ఈనాడు-ఆదివారం,16-11-2014.
“ఎగిరే పావురమా” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగె లో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి..
ఎగిరే పావురమా on kinige