జీవనతంత్రం

పంచతంత్ర కథలు తెలియని వారుండరు. వాటిలో ప్రధాన పాత్రలన్నీ జంతువులే. వాటి మనస్తత్వాలకు అనుగుణంగా పేర్లుంటాయి. స్నేహతత్వం, పరోపకారం, ద్రోహబుద్ధి వంటి లక్షణాలూ వాటి ప్రభావాలూ ఈ కథల ద్వారా అర్థమవుతాయి. ఐదు విభాగాలతో మొత్తం 69 కథలు ఇందులో ఉన్నాయి. తొలుత విష్ణుశర్మ సంస్కృతంలో ఈ కథలను రచించారు. గుణాఢ్యుని ‘బృహత్కథ’ నుంచి మరికొన్ని కథలు ఇందులో చేరాయంటారు. ఒక కాలానికీ, ఒక ప్రాంతానికీ పరిమితం కాకుండా చిరస్థాయిగా నిలిచిపోయాయంటేనే వాటి గొప్పతనం అర్థమవుతుంది. జగన్నాథశర్మ శైలి బాగుంది.

పార్థ, ఈనాడు ఆదివారం అనుబంధం, 14 జూలై 2013

* * *

పంచతంత్రం’ డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
పంచతంత్రం On Kinige

Related Posts:

శ్రీమాన్ మార్జాలం

పుస్తకం ఉన్నది చూశారూ,

దీన్ని చదువుతుంటే, రంగు రంగులతో డిస్నీ సినిమా చుస్తున్నట్టుంది

కథ అయితే మరింత అబ్బురంగా ఉంటుంది.

తెలుగు పిల్లలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఈ శ్రీమాన్ మార్జాలం.

 

 

దీంట్లో రెండు కథలున్నాయి. ఒకటి: శ్రీమాన్ మార్జాలం, రెండు: తొలివేట

ఓ పిల్లి ముసలిదైతే, దాన్ని పోషించలేక అడవిలో వదిలేస్తాడు దాని యజమాని. ఓ నక్క దాన్ని పెళ్ళి చేసుకోడంతో, రెండూ కలిసుంటూంటాయి. నక్క మిత్రులైన తోడేలు, ఎలుగుబంటి, అడవి పంది, కుందేలు పిల్లిని మంచి చేసుకోవాలనుకొని, ఓ బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి పిల్లిని, నక్కని ఆహ్వానిస్తాయి. పిల్లి ఆ విందుకు హాజరైందా? నక్క స్నేహితులకు ఏమవుతుంది? కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఓ కుక్కపిల్ల పెరట్లో కోడిపిల్లల వెంట తిరిగి, తిరిగి విసిగిపోతుంది. పక్షులను, జంతువులను వేటాడాలనుకుంటుంది. కంచె దాటి మైదానంలోకి ప్రవేశిస్తుంది. కుక్కపిల్ల ఏయే జంతువులను పక్షులను వేటాడిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఈ కథలకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దల్ని సైతం ఆకట్టుకుంటాయి.

శ్రీమాన్ మార్జాలం On Kinige

Related Posts: