చాలీచాలని సంపాదనతో కూడా కన్నవారు ఎంతమంది పిల్లలనైనా పోషిస్తారు.ప్రయోజకులైన సంతానం మాత్రం తల్లిదండ్రుల పోషణకు వంతులు వేసుకోవడం చూస్తున్నాం. ఈ ధోరణిని రచయిత మొదటి మూడు కధలలో మరోమారు ఎత్తిచూపారు. గ్రంధశీర్షికతో వచ్చిన ‘గోరింటపూచింది’ కధ 1970వ దశకంలో వచ్చిన ఉపాధ్యాయ దంపతుల ఇతివృత్తంతో వచ్చిన చిత్రాన్ని గుర్తుచేసింది.పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టే ‘గూడుతెగిన పక్షులు’ కధ ఇప్పుడు 50వ పడిలోని వారిని గత స్మృతులలోనికి తీసుకువెళుతుంది. పురాణగాధ ‘కచదేవయాని’ ఇతివృత్తాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మలచారు. మొత్తం 13 కధల్లో స్నేహం , గుప్తదానం , రాజకీయాలు , ఎన్నికలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి. రెండు కధలకు శీర్షికలు పొసగినట్లు లేదు . విషాదాంత కధకు సానుకూల కోణంలో (గోరింట పూచింది),సుఖాంత కధకు విషాద అర్ధంలో (గూడు చెదిరిన పక్షులు) శీర్షికలు పెట్టారు.
- -అరవపల్లి జగన్నాధస్వామి , ఆంద్రజ్యోతి- ఆదివారం , 28 సెప్టెంబర్ 2014.
“గోరింట పూచింది” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.