మిసిమి మార్చి 2013 సంపాదకీయం
Editorial Misimi March 2013 by Soma Sankar Kolluri
ప్రముఖ సినీనటుడు గొల్లపూడి మారుతీరావు మంచి రచయిత, కవి అని కూడా చాలా మందికి తెలుసు. సినిమాలలో ఆయన నటనను ఎవరూ ఇష్టపడకుండా ఉండలేదు. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ సెప్టెంబరులో ఆయన ‘మారుతీయం – గొల్లపూడి మారుతీరావు కవితా హృదయం‘ అనే పేరుతో ఒక పుస్తకం ముద్రించారు.
ఆయన చెప్పినట్లే…. ఏభై సంవత్సరాల ఊసులవి. ఆయన జీవితంలో పరుచుకున్న అన్ని రుచులూ అంటే తీపి, చేదూ, వగరూ, విగరూ, ప్రేమా, చిరునవ్వూ, బాధా, కోపం, తాపం అన్నీ ఉన్నాయి ఇందులో. కవితలు, పాటలు మొత్తం పది విభాగాలుగా ఉన్నాయి. ప్రేమగీతాలు, ఆసుపత్రి పాటలు, వాసుస్మృతులు, మళ్ళీ మళ్ళీ వసంతం, ఉగాది కవితలు, స్వాతంత్ర్య గీతం, ఏరిన పూలు, హైకూలు, పాటలు పల్లవులు అనే ప్రధాన విభాగాలుగా ఉన్నా, ఒక్కో విభాగంలో మరికొన్ని కవితలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుస్తకం చదివేడప్పుడు పాఠకుడిని మారుతీరావు పూర్తిగా ఆవహించేస్తారు. ఎందుకంటే తెలుగు ప్రజలకు బాగా పరిచితుడు కావడం, ఆయనది ఒక ప్రత్యేక శైలి కావడం, ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో ఆయనకు ఒక శైలి ఉండడంతో, ఈ పుస్తకంలో ఏ కవిత, ఏ వాక్యం చదివినా ఆయన డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే గానీ దాని నుంచి బయటపడలేం. ఇక అన్ని కవితలూ బావున్నాయి. నిత్యసత్యాలు అనే కవితలో నుదుటిన ఎర్రటిమంట అది బొట్టు. నోట్లో వాడిగా మాట అది తిట్టు. గుండెల్లో చిక్కని పొంగు అది ఆవేశం. ఇలా అనేక నిత్యసత్యాలకు నిర్వచనం చెప్పిన దిట్ట. ఆయన కవిత్వంలో వ్యంగ్యం కూడా ఉంది. బడ్జెట్ ప్రతిపాదన కవితలో రాజకీయ బాగోతం గురించి బాగా చెప్పారు. ఒక మంత్రి – బడ్జెట్‌ని ప్రతిపాదించిన మంత్రి ఆ బడ్జెట్‌తోనే దేశంలో సోషలిజం వచ్చేసినట్లు చెబుతాడు. చివరకు ‘సుఖపడే అన్ని అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి కనుక, కలగనే ఒక్క అవకాశాన్నీ తప్పని సరయి మినహాయిస్తున్నాం’ అని ముగింపు వ్యంగ్యంగా చెబుతూ బడ్జెట్ బండారాన్ని బయట పెట్టారు.
ఇలా ఆయన కవితలు, మాటలు, అన్నీ కూడా విలువైనవే. చదువుకోడానికి, పదిమందితో చెప్పుకోవటానికి కూడా ఉపయోగపడేవే.
– ఎన్‌క్యూబ్
వార్త దినపత్రిక, 28 అక్టోబరు 2012
* * *
మారుతీయం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ప్రింట్ బుక్ ఆర్డర్ చేసి తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
మారుతీయం On Kinige
మిసిమి సెప్టెంబర్ 2012 సంపాదకీయం
Misimi September 2012 Editorial
* * *
మిసిమి సెప్టెంబరు 2012 On Kinige