ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం

ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్తుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకి పంపి, కిటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.

ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలోఇచ్చేలా ‘దొప్ప’లున్న “కామత్” ప్లేట్లు తయారు చేయించాను. దానితో అంట్లు తొమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.

“నీ జీవితాయశం ఏమిటి?” అని ఒబెరాయ్ నన్ను అడిగారు. “మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాను. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల.

భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‍కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద “కామత్” అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పదిలక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.

14 భాషల్లోకి అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకు నాన్-డిటెయిల్డ్‌గా ఉన్న పుస్తకం

ప్రపంచ ప్రతిష్టాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్’ హోటల్ అధినేత విఠల్ కామత్ ఆత్మకథకి

యండమూరి వీరేంద్రనాథ్ విశిష్ట రూపకల్పన

* * *

“ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం” పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకు పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.
ఇడ్లి-ఆర్కిడ్-ఆకాశం On Kinige

Related Posts: