తమిళనాడులోని హోసూరు నగరానికి నాలుగైదు ఆమడల దూరంలో అడవుల మధ్య ఉండే పల్లెటూరు ఇరులదొడ్డి. నాలుగైదు దశాబ్దాల క్రితంనాటి పల్లెల్నీ అమాయక ప్రజల ఆలోచనల్నీ జీవన విధానాన్నీ బతుకు పోరాటాన్నీ ఈ కథల్లో పూసగుచ్చినట్టు చెప్పారు రచయిత నారాయణరెడ్డి. పన్లోపనిగా వివిధ వృత్తుల్నీ పలకరించారు, శ్రామికుల్నీ పరామర్శించారు. ‘నాయకురాలు నాగవ్వ’, ‘కన్నతల్లి లాంటి కస్తూరావు’, ‘బీముని మింగిన రాముడు’ … ఈ కథల్లో మనకు తారసపడే పాత్రలు. పాత్రలంటే మనుషులే కానక్కర్లేదు – పశువులూ చెట్లూ చేమలూ కావచ్చు. ఒకప్పుడు అవిభక్త మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న… హోసూరు ప్రాంతంలోని తెలుగు మాండలిక సౌందర్యం ఈ కథలకు ప్రాణమై నిలిచింది.
-నందన్, ఆదివారం అనుబంధం, 23rd Feb 2014
ఈ ఆర్టికల్ని ఈనాడు పుస్తకం పేజీలో చదవడం కొరకు ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి:
http://archives.eenadu.net/02-23-2014/Magzines/Sundayspecialinner.aspx?qry=pustaka
“ఇరులదొడ్డి బతుకులు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింద లింక్ని అనుసరించండి.
***