కినిగె పాఠక మిత్రులకు శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
శ్రీ జయనామ సంవత్సర ఉగాది సందర్భంగా కినిగె పాఠకులకు ఉచితంగా అందిస్తోంది “శ్రీ విఖసన ఆర్షధర్మ పీఠం వారి దృక్సిద్ధాంత పంచాంగం 2014-15″.
తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ మొదలైన వివరాలను అందిస్తూ, వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి, విజయదశమి వంటి పండుగలను ఎలా నిర్ణయించాలో ఈ పంచాంగంలో సవివరంగా తెలియజేసారు పంచాగకర్తలు శ్రీయుతులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ మరియు నారాయణం తాండవకృష్ణ చక్రవర్తి.
వివిధ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం వివరాలు చెబుతూ శ్రీ జయనామ సంవత్సరంలో ఆయా రాశులలో జన్మించిన వ్యక్తుల రాశి ఫలితాలను వెల్లడించారు.
వివిధ శుభకార్యాలకు కావల్సిన ముహూర్త నిర్ణయాలు, వివిధ పీడా/బాధా నివారణలకు పాటించవలసిన చర్యలు ఈ పంచాంగం సూచిస్తుంది.
శ్రీ జయనామ సంవత్సర పంచాంగం on kinige