ప్రతినాయకుల పక్షాన నిలిచినా…కథానాయకుడికి ఉండితీరాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి కర్ణుడికి. ఆ శౌర్యం, ఆ ధైర్యం, ఆ దానగుణం… మహాభారతంలోని ఏ పాత్రలోనూ కనిపించవు. అంతిమంగా పాండవుల విజయాన్ని ఆకాంక్షించే సామాన్య పాఠకుడు కూడా… మనసులో ఏ మూలనో కర్ణుడి పట్ల అభిమానాన్ని కనబరుస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆ యోధుడు ప్రాణాలు కోల్పోకుండా ఉంటే బావుండని ఆశిస్తాడు. కర్ణుడి జీవితం నిండా అవమానాలూ మోసాలే. నీటిపాలు చేసిన కన్నతల్లి కుంతి నుంచి… బాధ్యత మరచిన సారథి శల్యుడి దాకా… ఎన్నో అనుభవాల గాయాలు. కురుపాండవుల అస్త్ర ప్రదర్శన సమయంలో నేనున్నానంటూ రంగప్రవేశం చేయడం మొదలు… అర్జునుడి చేతిలో నేలకొరిగే దాకా… ప్రతి మలుపునూ కళ్లకు కట్టినట్టు వివరించారు. కర్ణుడు కేంద్ర బిందువుగా శ్రీశార్వరి చేసిన విశిష్ట రచన ఇది..
- వైష్ణవి, ఈనాడు ఆదివారం అనుబంధం, 14 సెప్టెంబర్ 2014
“కర్ణ మహాభారతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.