అక్షరానికో అందమైన కథ – అక్షరమాల(కథలు)

అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఇలా ఒక్కో తెలుగక్షరానికి ఒక్కో కథ చొప్పున రాయబడిన చక్కని కథల సమాహారమే…అక్షరమాల(కథలు). తల్లాప్రగడ రవికుమార్  రచించిన ఈ కథలు చాలాకాలం క్రితం ఆంధ్రప్రభ దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. పిల్లల్ని అమితంగా ఆకట్టుకునే శైలిలో ఈ కథా రచన సాగింది. పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు ఆశ్శీఃపూర్వకంగా అన్న ఈ క్రింది వాక్యం ఈ కథల గొప్పతనాన్ని సూచిస్తుంది.

నీతి చంద్రిక చదివితే ఎటువంటి ప్రయోజనం సిధ్ధిస్తుందో అదే ప్రయోజనం ఈ కథల వల్ల కూడా సిద్ధిస్తుంది.

ఒకటి రెండు పేజీలు మించకుండా అందమైన బొమ్మలతో తీర్చిదిద్దిన ప్రతీ కథ ఆహ్లాదాన్ని కలిగించేదే! ఇలాంటి సృజనాత్మక ప్రయోగాలు  పిల్లల్లో పఠనాశక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.

వెలగా వెంకటప్పయ్య గారు ఈ పుస్తకం ముందు మాటలో ప్రస్తావించిన ఈ క్రింది మాటలు ఈ కథా సంపుటికి యోగ్యతా పత్రంగా భావించవచ్చు.

“ఈ చిరు గ్రంథం ఒక కొత్త ప్రయోగం. తెలుగు వర్ణ సమాన్మయంలోని అక్షరాలను తీసుకొని – ఆ అక్షరం ఇచ్చిన స్ఫూర్తితో కథలను అల్లారు. ‘అమ్మ’ అనే తొలికథలో ఇతర ప్రాణుల యెడల దయ చూపాలని తెలియజేస్తారు. సత్యప్రవర్తన ప్రాధాన్యాన్ని రెండవ కథ ‘ఆవు’లో వివరిస్తారు. ‘ఉడుత’ కథలో సాటివారికి సాయం చేసే తీరు ప్రబోధిస్తారు. ‘ఎలుక’ అనే కథలో స్నేహసంపద ఔన్నత్యాన్ని వివరిస్తారు. కలసి ఉంటే కలదు సుఖం అనే జీవిత సత్యాన్ని ‘ఐకమత్యం’ అనే కథ ద్వారా తెలుపుతారు. ఇలా ప్రతీ కథ ఒక సందేశాన్ని తెలియజేస్తూ, ఒక సదుద్దేశ్యంతో జనహితంగా కథారచన సాగింది. భాష సరళంగా, చదివే అలవాటును పెంచేదిగా ఉంది. బాలసాహిత్య నందనవనంలో ఈ గ్రంథం ఒక పారిజాత కుసుమం కాగలదనడంలో సందేహం లేదు.”

అక్షరమాల కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

***
అక్షరమాల కథలు on Kinige

Related Posts:

విధిని ఎదిరించిన వీధి బాలలు, పేద పిల్లలు ఈ-బుక్ ఆవిష్కరణ

అభినందన – అప్నాఘర్ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ది 10 డిసెంబరు 2011 నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో శ్రీమతి గురజాడ శోభ పేరిందేవి రచించిన “విధిని ఎదిరించిన వీధి బాలలు, పేద పిల్లలు” అనే ఈ-బుక్ ఆవిష్కరించబడింది. కినిగె.కాం రూపొందించిన ఈ ఈ-బుక్‌ని సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఎం.వి. రమణమూర్తి ఆవిష్కరించారు.

 

అనిల్ అట్లూరి కినిగె గురించి, ఈ-బుక్స్ గురించి వివరించారు

 

రచయిత్రి శోభ పుస్తకం గురించి మాట్లాడారు.

 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా దినపత్రికలలోని వార్తలు ఇక్కడ చూడండి.

ఆంధ్రజ్యోతి దిన పత్రిక

 

ఆంధ్రప్రభ దినపత్రిక

 

ఆంధ్రభూమి దినపత్రిక

 

ఈ పుస్తకం అమ్మకం ద్వారా వచ్చే ప్రతీ రూపాయి, వీధి బాలల, పేద పిల్లల సంక్షేమానికి ఉపయోగిస్తారు. నేడే మీ కాపీని సొంతం చేసుకోండి.

విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

శ్రీమాన్ మార్జాలం

పుస్తకం ఉన్నది చూశారూ,

దీన్ని చదువుతుంటే, రంగు రంగులతో డిస్నీ సినిమా చుస్తున్నట్టుంది

కథ అయితే మరింత అబ్బురంగా ఉంటుంది.

తెలుగు పిల్లలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఈ శ్రీమాన్ మార్జాలం.

 

 

దీంట్లో రెండు కథలున్నాయి. ఒకటి: శ్రీమాన్ మార్జాలం, రెండు: తొలివేట

ఓ పిల్లి ముసలిదైతే, దాన్ని పోషించలేక అడవిలో వదిలేస్తాడు దాని యజమాని. ఓ నక్క దాన్ని పెళ్ళి చేసుకోడంతో, రెండూ కలిసుంటూంటాయి. నక్క మిత్రులైన తోడేలు, ఎలుగుబంటి, అడవి పంది, కుందేలు పిల్లిని మంచి చేసుకోవాలనుకొని, ఓ బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి పిల్లిని, నక్కని ఆహ్వానిస్తాయి. పిల్లి ఆ విందుకు హాజరైందా? నక్క స్నేహితులకు ఏమవుతుంది? కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

ఓ కుక్కపిల్ల పెరట్లో కోడిపిల్లల వెంట తిరిగి, తిరిగి విసిగిపోతుంది. పక్షులను, జంతువులను వేటాడాలనుకుంటుంది. కంచె దాటి మైదానంలోకి ప్రవేశిస్తుంది. కుక్కపిల్ల ఏయే జంతువులను పక్షులను వేటాడిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఈ కథలకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దల్ని సైతం ఆకట్టుకుంటాయి.

శ్రీమాన్ మార్జాలం On Kinige

Related Posts:

తెలుగు బాల ఆట పాటల పుస్తకాలు–75/- తక్కువకు

ఈ పుస్తకాలు రచయిత డాక్టర్ యం హరికిషన్ గారు అకుంఠిత దీక్షా పట్టుదల, పరిశోధనలతో వెలువరించినవి. తెలుగు బాలబాలికలు ఇవి చదివితే బాల సాహిత్యం పరిచయం, భాషా వృద్ది, విజ్ఞానం, వినోదం, ఆనందం పొందుతారు. నేటి తరం తెలుగు జాతికి తప్పక కావాల్సిన పుస్తకాలు ఇవి. నేడే స్వంతం చేసుకోండి, మీ పిల్లలకు పరిచయం చేయండి – ఈ సృజనశీల సాహితీ సముదాయాన్ని. 

Visit Kinige and buy these 15 books now and save 75/- Rupee!

తెలుగు బాల ఆట పాటల పుస్తకాలు On Kinige

Related Posts:

మంచి పుస్తకం వారి – ‘కోటయ్య కట్టిన ఇల్లు’ పుస్తక పరిచయం

కోటయ్య కట్టిన ఇల్లు On Kinige

ఈ రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం 0 – 6 సంవత్సరాల వయసు పిల్లలకోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించినది. దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. చిన్నారి పొన్నారి పాపాయిలు తెలుగు ఆనందించటానికి ఈ పుస్తకం బహుదా దోహదం చేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం కినిగే పై డిజిటల్ రూపంలో కేవలం ౩౦ రూపాయలకే అందుబాటులో వుంది.

ఉచిత ప్రివ్యు కొరకు ఇక్కడ నొక్కండి.

ఆంగ్ల భాష పై మోజుతో తెలుగు మరిచిపోతున్న ఈరోజుల్లో మీ పిల్లలకు మన మాత్రు భాష ఐన తెలుగు ను నేర్పించాలనుకుంటే వెంటనే ప్రవేశించండి.

తెలుగు పిల్లలు టపటపలాడించే ప్రతి కంప్యూటర్లోనూ తప్పనిసరిగా ఉండవలసిన పుస్తకం!

Related Posts: