వీరభద్రారెడ్డి (Veerabhadrareddy) Madhubabu latest novel is now online…

డైనమిక్ రైటర్ మధుబాబు లేటెస్ట్ తెలుగు నవల వీరభద్రారెడ్డి ఇప్పుడు కినిగెలో లభిస్తుంది. ఈ లింకు నొక్కి మరిన్ని వివరాలు చూడండి.

నేటి తెలుగు దేశాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా క్రీ.శ.1200వ సంవత్సరం నుంచీ 1325 వరకూ పరిపాలించిన వంశం – కాకతీయ వంశం.

కాకతీయ సామ్రాట్టయిన శ్రీశ్రీశ్రీ గణపతి దేవుడికి పురుష సంతానం లేకపోవడం వల్ల, తన కుమార్తె అయిన రుద్రమదేవిని తన తరువాత కాకతీయ సామ్రాజ్యానికి వారసురాలిగా ప్రకటించాడు.

ఒక ఆడది రాజ్యాన్ని పరిపాలించడం అవమానమని భావించి, తిరుగుబాటు బావుటాని ఎగురవేసారు ఎంతోమంది. కళింగం నుంచి, దేవగిరినుంచి, కొంకణం నుంచి, పాండ్యనాడు నుంచి శత్రువులు ఒకరొకరు గానూ, ఒక్కుమ్మడిగాను సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు.

రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. గ్రామసీమలు శత్రువుల దురంతాలకు, దురాగతాలకు గురికాజొచ్చాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు విచ్చలవిడి అయిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని విపత్కర పరిస్థితి. ఎటుచూసినా అశాంతి, అల్లరి… ముఖ్యంగా నమ్మకద్రోహం.

ఈ సమయంలో భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించే గోనగన్నారెడ్డి, శ్రీకాకుళ ప్రదేశానికి ప్రభువులైన ఐదులూరి అన్నయమంత్రి, కొలను రుద్రదేవుడు –

కాయస్త సేనానాయకుడైన జన్నిగదేవ, అంబదేవ త్రిపురాంతకాలు, ఆ తరువాత ప్రధాన దండనాయకుడైనటువంటి ప్రసాదిత్య నాయకుడు మొదలైన వారందరూ తమ తమ శక్తిమేరకు దేశాన్ని సుభిక్షం చేయడంలో రుద్రమదేవికి తోడ్పడ్డారు. ఇదిగో… ఈ గొడవల మధ్య ప్రారంభం అవుతుంది నా ఈ వీరభద్రారెడ్డి.

వీరభద్రారెడ్డి On Kinige

Related Posts:

ఫ్లయింగ్ హార్స్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు రచించిన థ్రిల్లర్ ఫ్లయింగ్ హార్స్.

ప్రపంచమంతా జయించి ఒకే పతాకం క్రిందికి తీసుకు రావాలనే ఆశయంతో పని చేస్తున్న వరల్డ్ వైడ్ క్రిమినల్ ఆర్గనైజేషన్ కిల్లర్స్ గాంగ్‌కి పోటీగా నిలువదలుచుకున్నాడు డాక్టర్స్ ఎక్స్. అయితే వారిలా నేరాలు చేయించి ధనం కూడ బెట్టటం, పరపతి పెంచుకోవటం అతనికి యిష్టం లేదు. కొట్టేది ఒకే దెబ్బ అయినా,ఆ ఒక్క దెబ్బకే అందరూ దద్దరిల్లి పోవాలని అతని కోరిక. అందుకే ఎవరికీ తెలియకుండా, ఎవరికంటా పడకుండా రహస్య జీవితాన్ని గడుపుతూ, ప్రపంచం మొత్తం మీద జరుగుతూ వుండే సైంటిఫిక్ పరిశోధనలన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు.

శబ్దాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ అపూర్వమయిన అల్ట్రాసోనిక్ సౌండ్ ప్రొజెక్టర్‌ని కనిపెట్టాడు ఒక ఇటాలియన్ సైంటిస్ట్. తన ప్రభుత్వం అంతరిక్షంలోకి పంపుతున్న ఒక ఉపగ్రహానికి దాన్ని బిగించి, అంతరిక్ష పరిశోధనలు చేద్దామని అనుకుంటుండగా, భూమి వాతావరణాన్ని దాటి పైకి పోగానే అనుకోని విధంగా కొన్నివేల రెట్లు వృద్ధి అయింది ఆ సాధనం యొక్క శక్తి. దానిలో నుంచి వెలువడే అల్ట్రాసోనిక్ సౌండ్స్ సూటిగా వచ్చి భూమిని తాకటం మొదలు పెట్టాయి… తాకిన ప్రతి ప్రదేశంలోను కనీ విని ఎరుగని ప్రళయం ఉత్పన్నమయింది. అతికష్టం మీద ఆ సాధనం బిగించి వున్న ఉపగ్రహాన్ని పల్టీ కొట్టింది, భూమి మీదికి వస్తున్న శబ్ధ తరంగాల్ని అంతరిక్షం వైపు పంపగలిగారు ఇతర సైంటిస్టులు… ఆ ప్రయత్నంలో ఉపగ్రహం మీద తమకు ఉన్న కంట్రోల్‌ని పోగొట్టుకున్నారు. కంట్రోల్ తప్పిన ఉపగ్రహం తిరిగి ఎప్పుడు ఇంకో పల్టీ కొడుతుందో ఎవరికీ తెలియదు… అలా జరిగిన మరుక్షణం మరోసారి భూమిని ఎటాక్ చేస్తాయి అల్ట్రాసోనిక్ సౌండ్స్.

ఆ దారుణం జరిగేలోగా ఆ సాధనాన్ని నిరుపయోగం చేయాలనే తపనతో నిద్రాహారాలు మాని శ్రమించాడు ఇటాలియన్ సైంటిస్ట్. సౌండ్ ప్రొజెక్టర్‌లో నుంచి వెలువడే సౌండ్స్‌ని తట్టుకొని ఉపగ్రహంతో సహా ఆ సాధనాన్ని ధ్వంసం చేయగల మాగ్నటిక్ రేడియో సౌండ్స్‌ని సృష్టించటంలో సగం వరకూ కృతకృత్యుడు అయినాడు. ఆ ప్రయత్నం పరిపూర్ణమైతే ప్రమాదం తప్పిపోయినట్లే అని అందరూ సంతోషిస్తున్న సమయంలో – అదను చూసి దెబ్బ తీశాడు డాక్టర్ ఎక్స్. ఇటాలియన్ సైంటిస్ట్‌ని కిడ్నాప్ చేసి తన వద్దకు రప్పించుకున్నాడు. అత్యంత ప్రమాదకరమైన అల్ట్రాసోనిక్ సౌండ్ ప్రొజెక్టర్‌ని ఆ సైంటిస్ట్ సహాయంతో తన చెప్పుచేతల్లోకి తెచ్చుకొని, దాని ద్వారా ప్రపంచాన్నంతా బ్లాక్‌మెయిల్ చేయటమే డాక్టర్ ఎక్స్ ఉద్దేశ్యం.

ఇటాలియన్ ప్రభుత్వ అభ్యర్ధనపై రంగంలోకి వచ్చింది ఇంటర్‌పోల్. సౌండ్ ఇంజనీరింగ్‌లో మంచి ప్రవేశం వున్న మిస్ టోరీ అనే ఇంటర్‌పోల్ ఏజెంట్‌ని, షాడోని సింగపూర్ పంపించింది. కిడ్నాప్ చేయబడిన సైంటిస్ట్‌ని మొదట సింగపూర్‌లో దాచాడు డాక్టర్ ఎక్స్. ఇంటర్‌పోల్ జోక్యం చేసుకోవటంతో అతన్ని సుమత్రా ఐలండ్‌కి తరలించాడు.
ఆ విషయాన్ని గ్రహించి సుమత్రా బయలుదేరాడు షాడో.

డాక్టర్ ఎక్స్‌నీ, అతని అనుచరగణాన్ని ఎలా ఎదుర్కున్నాడు? షాడోని డాక్టర్ ఎక్స్‌కి పట్టించిన పక్షులు ఏవి? వళ్ళంతా విషపూరితమైన పాయిజన్ పాషాని షాడో ఎలా నిలువరించాడు? ఇంతకీ ఇటాలియన్ సైంటిస్ట్‌ని కాపాడగలిగాడా లేదా?

ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు “ప్లయింగ్ హార్స్” నవలలో దొరుకుతాయి. చివరిదాక ఆసక్తిగా చదివించే ఈ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

ఫ్లయింగ్ హార్స్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

బాంబింగ్ స్క్వాడ్

ప్రముఖ డిటెక్టివ్ రచయిత మధుబాబు రచించిన మరో థ్రిల్లర్ “బాంబింగ్ స్క్వాడ్“.

ఓ అసైన్‌మెంట్ నిమిత్తం శ్రీకర్ జపాన్ బయల్దేరడంతో కథ ప్రారంభం అవుతుంది. విమానంలో పరిచయమైన ఓ మహిళ ఓ కవర్ శ్రీకర్ చేతికిచ్చి దాచమంటుంది. ఆ తర్వాత ఆమె హత్య చేయబడుతుంది. ఆ కవర్ కోసం తన వెంటబడిన గ్యాంగ్ నుంచి శ్రీకర్ తప్పించుకునే ప్రయత్నంలో షాడో, బిందులను కలుసుకుంటాడు. నిజానికి, వీళ్ళు ముగ్గురూ ఒకే అసైన్‌మెంట్ కోసం జపాన్ వచ్చారు. అయితే శ్రీకర్ కొద్దిగా ముందుగా వచ్చి ఆ ప్రమాదంలో ఇరుక్కున్నాడు.

ఆ కవర్‍ని ఇంటర్‌పోల్ అధికారులకు అందజేస్తారు. జపనీస్ ఇంటర్‌పోల్ అధికారి ఆ కవర్ విప్పి అందులో ఏముందో షాడో, బిందు, శ్రీకర్ లకు చూపుతాడు. జపాన్ ప్రజలని భయభ్రాంతులని చేస్తున్న ఫ్లైయింగ్ సాసర్ల ఫిల్మ్‌లవి.

వాటి వెనుక కిల్లర్స్ గ్యాంగ్ ఉందని అనుమానిస్తూ, ఆ మిస్టరీని పరిష్కరించాల్సిందిగా జపనీస్ అధికారులు కోరుతారు. జపనీస్ ఏజెంట్లు సేకరించిన సమాచారం ప్రకారం – ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయని, వాటిని పూర్తిగా నాశనం చేయమని కోరుతారు. క్రితం రోజు శ్రీకర్‌పై దాడి చేయించిన వ్యక్తి – మన్‌టాయ్ – కిల్లర్ గ్యాంగ్‌కి స్థానికంగా వత్తాసు పలుకుతున్నాడని, అతనితో జాగ్రత్తగా వ్యవహరించవలసింగా సూచిస్తారు.

షాడో తనకి పాత పరిచయస్తుడైన ఫాక్స్ సాయం తీసుకుని మన్‌టాయ్ జాడలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. మన్‌టాయ్ స్థావరం తెలుసుకుని రహస్యంగా లోపలికి ప్రవేశించి పట్టుబడిబోతాడు షాడో. అతన్ని అనుసరించి వచ్చిన బిందు, శ్రీకర్‌లు షాడోని విడిపించి ఆ స్థావరం పై బాంబులు వేస్తారు. ఈ అలజడిలో మన్‌టాయ్ అక్కడినుంచి పారిపోతాడు.

తర్వాత ఏమైంది? మన్‌టాయ్ దొరికాడా? ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వెనుక రహస్యం ఏమిటి? అవి ఎక్కడ నుంచి వస్తున్నాయనేది షాడో ఎలా తెలుసుకున్నాడు? ఈ అసైన్‌మెంట్‌లో షాడోకి సహకరించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడెవరు? వీరంతా ప్రవేశించిన సొరంగం ఎక్కడికి తీసుకుపోయింది? మన్‌టాయ్ అపహరించిన బిందుని షాడో ఎలా విడిపించాడు? ఈ అసైన్‌మెంట్‌ని విజయవంతంగా ఎలా ముగించారు?

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఆసక్తికరమైన ఈ నవలలో లభిస్తాయి.

“బాంబింగ్ స్క్వాడ్” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

బాంబింగ్ స్క్వాడ్ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

బంజాయ్

మధుబాబు కలం నుంచి జాలువారిన మరో థ్రిల్లర్ “బంజాయ్“.

షాడో ఇంకా సిఐబిలో చేరని కాలనికి చెందిన కథ. కులకర్ణిగారినుంచి తప్పించుకోడానికి జపాన్ వచ్చి అక్కడ కుంగ్‌ఫూ వంటి యుద్ధవిద్యలు నేర్చుకుంటున్నకాలానికి చెందినది.

షాడో, గంగారాంలు చింగ్‌లీ విద్యాపీఠంలో చేరుతారు. షాడోకి తెలియకుండా విద్యాపీఠం బయటకు వెళ్ళిన గంగారాం ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. అదే సమయంలో నిప్పుల గుండంలో దూకే విద్యని నేర్పిస్తున్న ప్యూజీశాన్ షాడోని అడుగడుగునా అవమానిస్తూంటాడు. గంగారం ప్రమాదకరమైన టోంగా వస్తాదుల చేతిలో చిక్కుకుపోయాడన్న కబురు అందగానే, విద్యాపీఠం నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి కోరుతాడు షాడో. అయితే, ప్యూజీశాన్ నిరాకరిస్తాడు. షాడో అతన్ని ఎదిరించి అక్కడ్నించి బయటపడతాడు.

అదే సమయంలో, గంగారాం కూడా తనని బంధించి ఉన్న వస్తాదులకు టోకరా ఇచ్చి పరుగుదీస్తాడు. దారిలో షాడో, గంగారం కలుసుకుంటారు. టోంగా వస్తాదుల నుంచి తప్పించుకునే క్రమంలో, గంగారాంని కలిసిన ఒక వ్యక్తి ఒక చిన్న మెటల్ మెటల్ ట్యూబ్ అతనికి ఇచ్చి, దాన్ని భద్రంగా లిన్‌ఫాంగ్ అనే వ్యక్తి అందించమని చెబుతాడు.

షాడో, గంగారం సకాయ్ సిటీకి బయల్దేరుతారు. వారు కలుసుకోవాలనుకున్న లిన్‌ఫాంగ్ వారికి స్టేషన్‌లోనే ఎదురుపడతాడు. ఆ మెటల్ ట్యూబ్‌లో ఉన్న రహస్యాన్ని వివరిస్తాడు. ఇంతలో అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోతాడు లిన్‌ఫాంగ్. మెటల్ ట్యూబ్ మాయమవుతుంది. షాడో, గంగారాంలపై హత్యానేరం మోపబడుతుంది. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో షాడో, గంగారాంలు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటారు. అత్యంత ప్రమాదకరమైన బందిపోట్లను ఎదుర్కుంటారు. తర్వాత ఏం జరిగింది? షాడో ఎందుకు బంజాయ్‌గా మారాడు? బందిపోట్ల పీచమెలా అణిచాడు?

అడుగడుగునా ఉత్కంఠ కలిగించే ఈ నవల పాఠకులకు అమిత ఆసక్తిని కలిగిస్తుంది.

బంజాయ్ నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

బంజాయ్ On Kinige

Related Posts:

స్వర్ణఖడ్గం

On the day of Madhubaabu birthday Kinige presents you one of his finest creations – Swarna Khadgam.

———————
“ఏమయింది స్వామీ? మా చిరంజీవి జన్మించిన వేళ సరయినది కాదా?” ఆశ్చర్యం, ఆందోళన కలగలిసిన కంఠంతో వెంటనే అడిగాడు చక్రవర్తి.

“నీ చిరంజీవి జన్మించిన వేళ సరయినదే…. అతులిత శక్తి సంపన్నుడై. సర్వంసహా చక్రవర్తిగా పేరు తెచ్చుకుంటాడు. నిండు నూరేళ్లు నిరభ్యంతరంగా జీవిస్తాడు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. కాని, పదిరెండు సంవత్సరాల ప్రాయం వచ్చేవరకూ దారుణమైన కష్టనష్టాలను అనుభవిస్తాడు…. జన్మకాలంలోని కొన్ని గ్రహాల కలయిక, ఇతని తల్లిదండ్రులకు చెప్పరాని కీడును కలిగించబోతోంది. చిరంజీవి స్థానభ్రష్టుడై పరాయివారి పెంపకంలో అవమానాలను, అపనిందలను అనుభవిస్తాడు….. ఈ కష్టదశ పదిరెండు సంవత్సరాలు మాత్రమే. తర్వాత అన్నీ శుభాలే….” అరమూసిన కనులతో చెప్పాడు ముచికుందుడు.

చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. తమ తలల మీద పిడుగులు పడినట్టు అదిరిపడ్డారు అక్కడివారు.

ముంచుకువస్తున్న దుఃఖాన్ని అతి ప్రయత్నంమీద అదుముకుంటూ, “స్వామీ! మంత్ర తంత్ర శాస్త్రాల్లో తమరిని మించినవారు ఎవరూ లేరు…. తమరు మా చిరంజీవికి రానున్న కష్టనష్టాలను సరిచేయలేరా?” గద్గద కంఠంతో అర్థించింది మహారాణి వాసంతికాదేవి.

“మంత్రాలు, తంత్రాలు మన నుదుటిరాతను మార్చలేవు తల్లీ…. అయినాసరే ప్రయత్నం చేస్తాను….” అంటూ ధ్యానంలో నిమగ్నమైనాడు ముచికుందుడు…. ఉన్నట్టుండి కనులు తెరిచి, చేతుల్ని ముందుకు జాచాడు.

To read the eBook or to purchase print book click http://kinige.com/kbook.php?id=979

Related Posts:

డైనమైట్ డోరా

సుప్రసిద్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలువరిన మరో షాడో థ్రిల్లర్ “డైనమైట్ డోరా“. ఈ నవలలో మిసెస్ షాడో (బిందు) ప్రధాన ఆకర్షణ. షాడోతో కలసి ఆమె చేసిన సాహసాలు ఈ రోమాంచక నవలలో చదవచ్చు.

భారతదేశానికి పరమశత్రువైన కిరస్థాన్ బ్లాక్ డిసెంబర్ అనే అంతర్జాతీయ నేరగాళ్ళ ముఠాని పెంచిపోషిస్తుంది. ఆ గ్యాంగ్ వాళ్ళు ఆయుధాలు సమకూర్చుకోడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారు ఖనిజాన్ని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. దేశదేశాల్లోని ప్రముఖ బంగారు వ్యాపారుల కొట్లన్నీ వారి సొంతం ఆయిపోయాయి. వాళ్ళు భారతదేశం మీద దాడి చేయబోతున్నట్లు సమాచారం అందుకున్న సి.ఐ.బి షాడోని రంగంలోకి దించుతుంది. షాడోతో పాటు బిందు కూడా ఈ ఎస్సైన్‌మెంట్‌లో పాలుపంచుకుంటుంది.

షాడో బిందులిద్దరూ, బ్లాక్ డిసెంబర్ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నట్లుగా అనుమానిస్తున్న ఊరు “టెహ్రాన్” చేరుతారు. అక్కడ వేషాలు మార్చి మిసెస్ డోరా, మిస్టర్ డిక్ అనే మారుపేర్లతో చలామణీ అవుతారు. ఆ సంస్థ రహస్యాలు తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. జైలుకి కూడా వెడతారు.

షాడో కూడా చేయలేని పని, బిందు పూర్తి చేసి, కులకర్ణిగారి ప్రశంసలు పొందింది. ఏంటా పని? బిందుకి డైనమైట్ డోరా అని పేరెందుకు వచ్చింది? ఆమె చేసిన సాహసకృత్యాలు ఏంటి? బ్లాక్ డిసెంబర్ పూర్తిగా మూతపడినట్టేనా? బ్లాక్ విడోస్ ఎవరు?

ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు ఈ ఉత్కంఠభరితమైన నవలలో లభిస్తాయి.

డైనమైట్ డోరా డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ చూడండి.

డైనమేట్ డోరా On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఆపరేషన్ కౌంటర్ స్పై

ప్రముఖ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో థ్రిల్లర్ “ఆపరేషన్ కౌంటర్ స్పై“.

ఎప్పుడో బిందు సి.ఐ.బి.లో చేరకముందు జరిగిన కథ యిది. షాడోని ఎవరో బంధించి తీసుకుపోతుండడం, వారిని బిందు అనుసరించడంతో కథ ప్రారంభం అవుతుంది.
వారిని వెంటాడి వెంటాడి వారి స్థావరానికి చేరుకోగానే, వారు స్పెషల్ బ్రాంచ్ ఏజంట్లని, షాడో పై దేశ ద్రోహం ఆరోపించబడిందని తెలుసుకుంటుంది బిందు.
తనను బంధించి ఉంచిన స్థావరంలో షాడో కులకర్ణిగారితో మాట్లాడుతాడు. ఇదంతా కుట్ర అని అని అంటాడు.
షాడో కిరస్థాన్ ఏజెంట్లతో కలిసి విందారగిస్తున్నట్లు, కాక్ టెయిల్ పార్టీలలో పాల్గొన్నట్లు ఫోటోలు వున్నాయి. అంతకన్నా దారుణమైనవి వారి స్త్రీలతో హోటల్ గదులలో గడిపినట్లు బ్లూఫిలిమ్ నాలుగు రీళ్ళు ఎదురుగా పెట్టబడి వున్నాయి.
అవి కల్పితాలని, కావాలని సృష్టించబడినవని షాడో వాదిస్తాడు.
“మరి నువ్వు చేయకపోతే ఈ ఫోటోలు ఎలా వచ్చాయి? నీ గుట్టు బయటపడిందని లీవు నెపంతో పారిపోతావా? కలకత్తా పోయి అక్కడినుంచి సముద్రమార్గంలో దేశం వదిలి పోవటానికి ప్రయత్నిస్తావా?” అంటూ సీనాదేశపు రేవుల సమీపంలోకి పోయే ఒక ఓడ టిక్కెట్టు డూప్లికేటు కాపీని చూపిస్తారు కులకర్ణి.
“సార్! మీరు ప్రశాంతంగా ఆలోచించండి. గజదొంగగా జీవితం గడిపినప్పుడు చెయ్యని ద్రోహం, బాధ్యత కలిగిన ఉద్యోగంలో వుండి, పరువుగా బ్రతుకుతూ ఇప్పుడు చేస్తానా? మీరు ఒప్పుకున్న తరువాతే గదా నేను కలకత్తా పోయింది. రెండునెలల నుంచీ కలకత్తాలోనే వున్నాను. అందుకు సాక్ష్యం బిందూ. ఆమె నడగండి తెలుస్తుంది.” అంటాడు షాడో.
“అయామ్ సారీ షాడో, నువ్వు ఎంతో తెలివైనవాడివి, విశ్వాసపాత్ర్రుడివి అనుకున్నాను. యీ విధంగా మారతావని అనుకోలేదు. నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ ఋజువైనాయి. డిఫెన్సు కోర్టులో నీ మీద విచారణ జరిగి దోషివని నిర్ణయింపబడింది. రేపు వుదయం పదిగంటలకు కర్గోజా మిలటరీ జైలులో డిఫెన్సు ఆఫీసర్ల ముందు, హోమ్ మినిష్టరు, డిఫెన్సు మినిష్టర్ల కళ్ళఎదుట… నిన్ను వురి తీస్తారు…” అని డిక్లేర్ చేసారు కులకర్ణి.
షాడో, బిందులు నిర్ఘాంతపోతారు.
బిందు గంగారాం సహాయంతో షాడోని తప్పించాలని చూస్తుంది.
ఆ తర్వాత ఏం జరిగింది? తన పై జరిగిన కుట్రని షాడో చేధించాడా? షాడోని ఉరి తీయించాలని ప్రయత్నించింది ఎవరు? ఈ మొత్తం వ్యవహారంలో కులకర్ణిగారి పాత్ర ఏమిటి?
ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఆసక్తికరంగా సాగిపోయే ఈ నవలలో లభిస్తాయి.
ఆపరేషన్ కౌంటర్ స్పై డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.

ఆపరేషన్ కౌంటర్ స్పై On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

ఎస్సైన్‌మెంట్ కరాచీ

సుప్రసిద్ధ డిటెక్టివ్ రచయిత మధుబాబు కలం నుంచి జాలువారిన మరో షాడో ఎడ్వంచర్ “ఎస్సైన్‌మెంట్ కరాచీ“.

బాంబే నగరంలో పదిహేను రోజుల క్రితం సముద్రతీరంలో షికార్లు కొట్టటానికి పోయిన పాతికమంది యువకులు వున్నట్లుండి మాయం అయ్యారు. ఎక్కడికి పోయారో, ఎలా పోయారో ఎవరికీ అంతుబట్టని మిస్టరీ అయింది. మాయం అయిన యువకుల్ని వెతకటానికి బాంబే పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నఫలితంగానే బాంబేకు వందమైళ్ళ దూరంలో సముద్రంలో తేలుతూ కనిపించింది మాయమైన యువకుల్లో ఒకతని శరీరం. అతని తలపై పెద్ద గాయం ఉంది, మెదడు మాత్రం లేదు. ఆపరేషన్ చేసి మెదడుని తీసేసినట్లు పోస్ట్ మార్టమ్ నివేదికలో తెలుస్తుంది.

అదే సమయంలో… ఆసియాఖండం మొత్తంమీద బ్రెయిన్ సర్జరీలో అత్యంత నిష్ణాతులైన ముగ్గురు కాన్పూర్ మిలటరీ డాక్టర్లు కూడా మాయం అయిపోయారు. ఎక్కడికి పోయారో ఏమయిపోయారో ఎవరికీ తెలియదు. యువకులు మాయం అయిన సంఘటనకు, ఈ బ్రెయిన్ సర్జన్లు మాయం అయిన సంఘటనకు సంబంధం వుందని సిఐబి తెలుసుకుంటుంది. డాక్టర్లు మాయమయ్యే కొన్ని గంటల ముందు కరాచీ నుంచి తమ కార్యకలపాలు కొనసాగించే ఇద్దరు పేరు మోసిన విదేశీ నేరస్తులు బాంబేలో తచ్చాడినట్లు తెలుస్తుంది. వెంటనే కరాచీ వెళ్ళి వాళ్ళ చర్యల్ని కనిపెట్టి … ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మన డాక్టర్లనీ, మాయం అయిపోయిన ఆ అమాయక యువకుల్ని రక్షించి మనదేశం తీసుకురావల్సిన బాధ్యత షాడోపై మోపుతారు.

ఇక ఎస్సైన్‌మెంట్ కరాచీ మొదలవుతుంది. షాడో పాకిస్తాన్ ఎలా చేరాడు? కరాచీలోని నేరస్తులను ఎలా ఎదుర్కున్నాడు? ఈ క్రమంలో ఎన్ని ప్రమాదాలను తట్టుకున్నాడు? మాంటీరియోలా ఎందుకు నటించాడు? దావూద్‌ని ఎలా బోల్తా కొట్టించాడు? షాడోకి ఉడుం ఏ విధంగా సాయం చేసింది? డా. ముస్తఫా రచించిన కుట్రని షాడో ఎలా చేధించాడు?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ రోమాంచక నవలలో లభిస్తాయి. “ఎస్సైన్‌మెంట్ కరాచీ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

ఎస్సైన్‌మెంట్ కరాచీ On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts:

రుద్రాణి

రుద్రాణి

 

 

 

రచన:

మధుబాబు


 

© Author

© Madhu Baabu

This digital book is published by -

కినిగె డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.

సర్వ హక్కులూ రక్షించబడ్డాయి.


All rights reserved.


No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.


 

రుద్రాణి

గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు గంగారాం. మందపాటి కంబళిని పాదాల దగ్గిర్నించి తలదాకా ముసుగుపెట్టి, బెడ్ రూమ్ తలుపులన్నిటినీ గట్టిగా బంధించి, ఎట్టి పరిస్థితిలోనూ తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని స్ర్టిక్టెస్ట్ ఇన్‌స్ర్టక్షన్స్ ఇచ్చి మరీ గురకలు తీస్తున్నాడు.

అతని రోజువారీ వ్యవహారాలను ఆర్గనైజ్ చేయటానికి సెక్రటరీలు పాతికమందిపైనే వున్నారు. అలవాటు ప్రకారం వారందరూ తమ తమ మందీ మార్బలంతో బెడ్ రూమ్ కి ఎదురుగా వున్న విశాలమైన హాల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు.

కంచుతో పోతపోసిన విగ్రహాల మాదిరి కండలు తిరిగిన శరీరాలతో బెడ్ రూమ్ ద్వారానికి అటూ ఇటూ నిలుచుని వున్నారు ఇద్దరు బాడీ గార్డులు.

రాజస్థాన్ రాష్ట్రంలో వున్న మోరీ కొండల్లో పశువుల్ని మేపుకుంటూ వుండేవాళ్ళు వారిద్దరూ….. వట్టి చేతులతోనే నలభైకిలోల బరువుండే కొండరాళ్ళను పిండిపిండిగా కొట్టిపారేయగల బలవంతులు.

రెండు వందల యాభై ఆవుల్ని, నలభై రెండు మేలుజాతి ఒంటెల్ని వారి తల్లిదండ్రులకు బహుమతిగా ఇచ్చి, వారిద్దరినీ తనకు బాడీగార్డులుగా వుండటానికి వప్పించాడు గంగారాం….. తనవెంట అస్సాం తీసుకు వచ్చాడు.

అతని మాటను తప్ప మరెవ్వరి మాటనూ వినిపించుకోరు వారిద్దరూ….. బెడ్ రూమ్ ద్వారం దగ్గిర తాము కాపలా నిలబడిన తర్వాత….. సాక్షాత్తూ దేవుడు దిగివచ్చినాసరే లోపలికి పోనీయరు. తాము నిలబడిన ప్రదేశంలోనుంచి ఒక్క అడుగు కూడా అవతలికి వేయరు.

ధనియా అంటారు వారిలో పెద్దవాడిని. మునియా అంటారు అతని సోదరుడిని.

పదిగంటల వరకూ ఓపికగా వెయిట్ చేసి చేసి, సహసం నశించిపోవటంతో మెల్లిగా మునియా దగ్గిరికి వెళ్ళాడు గంగారాం సెక్రటరీలలో ఒకతను.

తనంతట తను లేచేవరకూ సాబ్ తనను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. ముందు మీ పనులు చూసుకుని తీరికగా రండి….. ఇప్పుడు మాట్లాడటం కుదరదు…  .నిష్కర్షగా సమాధానం ఇచ్చి, అవతలికి వెళ్ళిపొమ్మన్నట్లు చేయి వూపాడు మునియా.

అతను అలా చేయి ఊపిన తర్వాత వెనక్కి జరగకపోతే ఏం జరుగుతుందో ఆ సెక్రటరీకి బాగా తెలుసు.

అయినా సరే కాస్తంత ధైర్యం చేసి అలాగే నిలబడ్డాడు.

ప్లీజ్ మునియా…. అర్జంట్‌గా మాట్లాడాల్సిన పని ఒకటి పడింది. జపాన్‌లో మన బిజినెస్ సెంటర్ మీద దాడి జరిగింది…  . వెంటనే మనం ఏదో ఒకటి చేయాలి. ఆలస్యం చేస్తే మనం అలుసయిపోతాం. ప్రిస్టేజ్ దెబ్బ తింటుంది. జపాన్‌లో బిజినెస్‌లన్నీ మూసేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది…  చిన్న కంఠంతో తనను ఇబ్బంది వెడుతున్న సమస్యను గురించి అతనికి తేలిక మాటలతో వివరించాడు.

గంగారాం సాబ్ దగ్గిర పనిలో చేరకముందు అతను పశువుల్ని కాచుకుంటూ వుండేవాడని ప్రగాఢంగా విశ్వసించటంవల్ల వచ్చిన తంటా అది.

అన్నతో కలిసి మోరీ కొండగుట్టల్లో పశువుల్ని కాచేవాడు మునియా అని అనటంలో అసత్యం ఏమీ లేదు. కాని ఆ పని చేస్తూనే, అతను తమ గ్రామంలో వున్న రిటైర్డ్ మిలటరీ అధికారి ఒకతని దగ్గిర నాలుగు భాషల్ని, కంప్యూటర్స్ గురించి కొన్ని ప్రాధమిక విషయాల్ని నేర్చుకున్నాడనే సంగతి ఆ సెక్రటరీకి తెలియదు.

ఉన్నట్లుండి ఇప్పుడు ఆ విషయం బయటపడేసరికి నోరు వెళ్ళబెట్టవలసిన పరిస్థితి అతనికి ఎదురయింది.

అది ఎలా ఎదురయిందంటే -

సెక్రటరీ మాటల్ని వినగానే తెల్లటి పల్వరుస బయటికి కనిపించేలా నోరంతా తెరిచి ఒక నవ్వు నవ్వాడు మునియా.

ఇటీజ్ యువర్ హెడేక్…  . మై బిజినెస్ ఈజ్ టు గార్డ్ దిస్ డోర్…  . యూ డూ యువర్ డ్యూటీ అండ్ లెట్ మీ డూ మైన్…  చక్కటి ఉచ్ఛరణతో, ఖచ్చితమైన మాటలతో అవతలికి వెళ్ళిపోమ్మని మరోసారి సూచించాడతను.

అచ్చమైన ఇంగ్లీషులో చెప్పిన తర్వాత కూడా అక్కడే నిలబడితే పరువులు దక్కవనే సంగతి చటుక్కున బోధపడేసరికి, తనకు తెలియకుండానే వెనక్కి తిరిగి, మిగిలినవారి దగ్గిరికి వచ్చేశాడు ఆ సెక్రటరీ.

ఈ రాజస్థాన్ బద్మాష్‌లకు గర్వం చాలా అధికం అయిపోయింది. మనం ఏదో ఒకటి చేయకపోతే, ఎందుకూ పనికిరాని వాళ్ళమని అనిపించుకుంటాం…  .లోగొంతుకతో తన అభిప్రాయాన్ని అక్కడి వారందరికీ తెలియచేశాడు ఒక సీనియర్.

వాళ్ళదేం వుంది? గంగారాం సాబ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు…  . మనం చేయవలసింది, చేస్తున్నది అదేకదా!నిర్లిప్తంగా అన్నాడు మరొకతను.

మనం చేసేదానికి, వాళ్ళు చేస్తున్నదానికి తేడా లేదా? గది గుమ్మం దగ్గిర బొమ్మల మాదిరి నిలబడటానికి, జపాన్, కొరియా, ధాయ్‌లాండ్‌లలో వున్న బిజినెస్ సెంటర్లన్నిటినీ మేనేజ్ చేయటానికి సంబంధం అసలు వున్నదా? పడుకునేముందు తనంతట తాను నిద్రలేచేదాకా ఎవర్నీ లోపలికి రానీయవద్దన్న గంగారం సాబ్ – నిద్రలేచిన తర్వాత జరిగిందేమిటో తనకు వెంటనే ఎందుకు చెప్పలేదని నా మీద కారాలు మిరియాలు నూరడా? నన్ను తల్లక్రిందులుగా వేలాడదీయమని ఆ మునియాగాడికే ఆర్డర్స్ ఇవ్వడా…  .? ఉక్రోషం అణుచుకోవటం అసాధ్యమై, జీరపడిన కంఠంతో కాస్తంత పెద్దగానే అరిచాడు బెడ్ రూమ్ దగ్గిరికి వెళ్ళి, వెనక్కి వచ్చిన సెక్రటరీ.

ఆ మాటలు మునియా చెవులకు చేరితే, అతని రియాక్షన్స్ ఎలా వుంటాయోనని వెంటనే అటుకేసి చూశారు మిగిలిన వారందరూ.

చేరితే ఏమిటి? చేరనే చేరాయి ఆ మాటలు. మునియాతోపాటు అతని సోదరుడు ధనియాకు కూడా చక్కగా అర్థం అయ్యాయి.

గంగారాం సాబ్‌ని గురించి మాకంటె మీకే బాగా తెలుసు. సందర్భాన్ని బట్టి అంతకుముందు తను చెప్పిన మాటల్ని తనే మర్చిపోయాడాయన. నోటికి వచ్చినట్లు తిట్టిపోస్తాడు. అయినా సరే ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. ఎందుకు చేస్తున్నారు? మీకు రోషం పాశం లేవా?” ఉన్నట్లుండి కనులు చిట్లించి చూస్తూ సూటిగా ప్రశ్నించాడు ధనియా.

రోషాల ప్రసక్తి వచ్చేసరికి ఎర్రగా జేవురించింది సీనియర్ సెక్రటరీ వదనం.

మా రోషాల గురించి నిన్నగాక మొన్న వచ్చిన మీకు ఏం తెలుసు బే? గంగారాం సాబ్ దగ్గిర కొలువులో చేరకముందు పన్నెండుమందిని నిలబెట్టి నరికిన చేతులివి. బులంద్ జైలు గోడలు దూకి నలభై రెండు కిలోమీటర్ల అడవుల్లో పరుగులు తీసిన పాదాలు ఇవి….. మా గురించి మాట్లాడే హక్కు మీకున్నదా…  .?” కరకరమంటున్న కంఠంతో గట్టిగా అడిగాడు.

కంగుతిని ముఖాన్ని పక్కకు తిప్పుకుంటాడనుకున్నారు మిగిలిన వారందరూ. ఆ కంఠాన్ని విన్న ధనియా పొరపాటున కూడా అటువంటి పని చేయలేదు సరికదా, తమ్ముడి మాదిరిగానే తెల్లటి పల్వరుస బయటికి కనిపించేలా నవ్వాడతను.

అటువంటి మొనగాడివైన నువ్వు, రోజుకు నాలుగుసార్లు నోటికి వచ్చిన తిట్లన్నిటినీ గంగారాం సాబ్ తిడుతుంటే ఎందుకు తల వంచుకుని భరిస్తున్నావ్?” అని అడిగాడతను.

పోలీసులు నన్ను పట్టుకుని లాటీలతో విరగబాదుతుంటే, అడ్డుపడి కాపాడాడు గంగారాం సాబ్…   ఆకలితో అలమటించిపోతున్న నా కుటుంబాన్ని నేను జైలునుంచి తిరిగి వచ్చేటంత వరకూ ఆదుకున్నాడు. జైలునుంచి రాగానే నాకు ఈ ఉద్యోగం ఇచ్చి, గౌరవంగా బతికే ఏర్పాట్లు చేశాడు…  తనెందుకు గంగారాం సాబ్ తిట్టే తిట్లను భరిస్తున్నాడో వివరంగా చెప్పాడు ఆ సెక్రటరీ.

మా కథ కూడా అటువంటిదే. సరిహద్దు ప్రదేశాల్లో దొంగతనాలు చేస్తూ, అడ్డువచ్చిన వారిని కౄరంగా హతమార్చే బందిపోటు గుంపులు రెండు మా గ్రామం మీద పడితే, వంటిచేత్తో ఆ గుంపుల్ని పారద్రోలాడు గంగారాం సాబ్. ఆ గలాటలో గాయపడి ప్రాణాలు కోల్పోవాల్సిన మా తల్లిదండ్రులకు వైద్యం చేయించి, మాకు ఎనలేని ఉపకారం చేశాడు…  . మరి మేము ఆ ఋణాన్ని తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్నందర్నీ ఆయన గదిలోకి తోలి నోరు తెరుచుకు చూస్తూ నిలబడాలా?”

సూటిగా వినవచ్చిన ఆ విచిత్రమైన ప్రశ్నను ఆలకించేసరికి, అక్కడ వున్న వారందరి పెదవుల మీదికి పరుగుతీస్తూ వచ్చేశాయి పెద్ద పెద్ద చిరునవ్వులు.

మనం అందరమూ గంగారాంసాబ్‌కి ఋణపడి వున్న వాళ్ళమే…   ఆ ఋణం తీర్చుకోవటానికి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామేగాని, ఉద్యోగాల వల్ల వచ్చే డబ్బు కోసం కాదు…   గంగారాం సాబ్ మనసెరిగి నడుచుకోవటమే మన కర్తవ్యం. నోళ్ళు మూసుకుని ఎక్కడివాళ్ళక్కడ నిలబడండి. సాబ్ నిద్రలేచేవరకూ కదలను కూడా కదలవద్దు.ఉన్నట్లుండి ఒక ఆర్డర్ వంటి మాటను అందరికీ వినిపించాడు పాతిక సంవత్సరాల వయస్సుండే చిన్న సెక్రటరీ ఒకతను.

అంతకు ముందు అరనిమిషం వరకూ తమ మనస్సులను వేధించిన మాటలన్నిటినీ ఒక్కసారిగా మర్చిపోయారు అందరూ…   సభామందిరం లాగా, సువిశాలంగా వున్న హాల్లో గోడలను ఆనించివున్న మెత్తటి సోఫాలలో కూర్చుని వెయిటింగ్ మొదలు పెట్టారు మరోసారి.

పది గంటలు దాటింది. గంగారాంసాబ్ నిద్ర లేవలేదు. పదకొండు గంటలు అయింది. నిద్ర మేల్కొన్న అలికిడి కూడా బయటికి వినిపించలేదు.

పదకొండుగంటల రెండు నిముషాలకు గఁయ్ మని మ్రోతలు చేసింది సీనియర్ సెక్రటరీ దగ్గిర వున్న సెల్ ఫోన్. ఉలిక్కిపడి దాని వంక చూశాడతను. చూసిన వెంటనే మునియా, ధనియాల మాదిరి పల్వరుస బయటికి కనిపించేలా పెద్దగా నవ్వాడు.

ఏమిటది? ఎక్కడినుంచి ఆ కాల్?” సస్పెన్స్‌ని భరించలేక ఆత్రుతగా అడిగాడు అతని సహచరుడు ఒకతను.

గంగారాం సాబ్ ఎటువంటి ఇన్పర్మేషన్ ఇచ్చినా నిర్మొహమాటంగా విభేదించగల కాల్ ఇది…  తిరుగులేనిది…  క్షణంసేపు కూడా వెయిట్ చేయటానికి వీలుకానిదిఅంటూ ఆన్ బటన్‌ని ప్రెస్ చేసి చెవికి ఆనించుకుంటూ “యస్ సార్…  అన్నాడు.

బాబాయ్…  బాబాయ్…  అంటూ వినవచ్చింది ఒక పసిబిడ్డడి కంఠం.

ఒక్కక్షణం బాబూ…   ఒక్కక్షణం ఆగితే బాబాయ్ సాబ్ మాట్లాడతారు…   ఒకే ఒక్కక్షణం….అంటూ సోఫాలోంచి చెంగున లేచి బెడ్‌రూమ్ ద్వారం దగ్గిరికి పరిగెత్తాడు ఆ సెక్రటరీ.

అంతకుముందు జరిగిన సంభాషణలన్నిటినీ మరిచిపోయినట్లు అతను అలా దూసుకు రావటాన్ని చూశారు మునియా, ధనియా.

మీ మాటలే తప్ప ఎదుటివారి మాటలు మీకు అర్థంకావు…  .అని అంటూ ఉక్కుముక్కలవంటి బాహువుల్ని ముందుకు జాచాడు మునియా.

గంగారాం సాబ్ దగ్గిరికిపోయి అర్జంటుగా చెప్పు…  . ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. చిన్న గురువుగారు లైన్‌లో వున్నారు…   ఆలస్యం చేస్తే నీ పని, నా పని, ఈ చుట్టుపట్ల కనిపించేవారందరి పనీ అవుట్ అయి పోతుంది. కమాన్…  . మూవ్…  .ఖంగుమంటున్న కంఠంతో చెప్పాడు సెక్రటరీ. వట్టిగా చెప్పటంకాదు, సెల్‌ఫోన్‌ని ముందుకు జాచాడు.

కొత్తగా అక్కడికి రావడంవల్ల ఆ మాటలు మునియాకి అర్థం కాలేదు. చిన్న గురువుగారు అంటే ఎవరో అతనికి కొంచెంగా కూడా బోధపడలేదు. నొసలు విరుస్తూ అతను తన అన్నకేసి చూస్తుండగానే మరోసారి ఫోన్‌లో నుంచి వినవచ్చింది బుడతడి కంఠం.

బాబాయ్…. బాబాయ్…  .

మునియా, ధనియాలకు తెలిసి గంగారాం సాబ్‌ని అలా పిలిచే వారెవరూ లేరు…  . అటువంటి పిలుపుల్ని వినటంకోసం ఆయన బెడ్ మీదినించి లేస్తాడని కూడా వారికి తెలియదు.

అయిపోతారు నాయనలారా…   ఎందుకు చెపుతున్నానో అర్థం చేసుకోండి…   మీకు ధైర్యం లేకపోతే నన్నయినా లోపలికి పోనీయండి….. త్వరగా…  అంటూ వారిద్దరినీ మరింతగా అదరగొట్టాడు ఆ సెక్రటరీ.

అప్పటికప్పుడు అన్నిటికీ తెగించి, బెడ్ రూమ్ తలుపుల్ని తెరిచాడు మునియా…  లోపలికి వెళ్ళమని కనులతోనే సైగ చేశాడు.

రెండు అంగల్లో వెళ్ళి బెడ్ దగ్గిర నిలబడ్డాడు సెక్రటరీ. పుష్పక విమానం మాదిరి విశాలంగా వున్న ఆ బెడ్ మీద అడ్డదిడ్డంగా పడుకుని వున్న గంగారాం సాబ్ భుజాన్ని పట్టుకుని గట్టిగా కుదిపాడు.

చటుక్కున కళ్ళు తెరిచాడు గంగారాం సాబ్…  తన దగ్గిర నిలబడి వున్నది ఎవరో గమనించిన వెంటనే విపరీతమైన కోపంతో ఎర్రగా మారి పోయాయి కనులు. పిడికిలి బిగించి బలంగా అతని ముఖంకేసి గురి పెట్ట బోతున్న సమయంలో__

బాబాయ్…  బాబాయ్…  అంటూ వినవచ్చింది సెక్రటరీ చేతిలోని సెల్ ఫోన్‌లో నుంచి.

మంత్రం వేసినట్లు మటుమాయం అయిపోయింది గంగారాం సాబ్ వదనంలో ప్రత్యక్షం అయిన కోపం.

ఇక్కడే వున్నానమ్మా…   ఏం కావాలి? బాగున్నావా? ఆమ్ తిన్నావా?” ఆ ఫోన్‌ని తీసుకుంటూ ఆనందంగా అడిగాడు.

బాబాయ్…   బాబాయ్…  అంటూ వత్తి వత్తి పలికాడు ఫోన్ చేసిన బుడతడు.

చెప్పమ్మా? బాబాయ్‌నే మాట్లాడుతున్నాను…  అమ్మ వున్నదా అక్కడ?” మరింత ప్రేమగా అడిగాడు గంగారాం సాబ్.

End of Preview.
Rest of the book can be read @
http://kinige.com/kbook.php?id=789
* * *
Read other books of Mr. Madhubabu @
http://kinige.com/kbrowse.php?via=author&id=20

Related Posts:

రుద్రాణి

సుప్రసిధ్ధ రచయిత మధుబాబు కలం నుంచి జాలు వారిన అద్భుత సోషియో-ఫాంటసీ నవల రుద్రాణి.

షాడో కొడుకు మాస్టర్ షాడో గంగారాంని చూడాలనుకోవడం, ఢిల్లీ నుంచి అస్సాం రావడంతో కథ మొదలవుతుంది. పిల్లాడితో కలసి దేవీ ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్ళిన బిందూ, గంగారాం సమక్షంలోనే షాడో కొడుకుని ఎవరో అపహరిస్తారు. గంగారాం ఎంత ప్రయత్నించినా బాబు ఆచూకీ తెలియదు. మొత్తం సి.ఐ.బి ఉద్యోగులందరూ అస్సాం, చుట్టుపక్కల ప్రాంతాలలో వెతుకులాటకి సిద్ధమవుతుంటారు. టోక్యో నుంచి ఇండియాకి చేరిన షాడో కులకర్ణిగారితో కలసి బిడ్డ తప్పిపోయిన ప్రాంతాలలో వెతకడం మొదలుపెడతాడు. చివరికి ఓ కొండ గుహలో తన కొడుకుని బంధించడం గమనించి, అక్కడి దుండగులని ఎదిరించి బిడ్డని సురక్షితంగా బయటకు తీసుకొస్తాడు. బిడ్డకి రంగు రాయి ఒకటి ఆకర్షణగా చూపి తనతో తీసుకువెళ్ళిన ఆ మనిషి కనబడడు, ఆ రాయి కనబడదు.

ఇంతలో ఇంటర్ పోల్ నుంచి షాడోకి అత్యవసరమైన సందేశం ఒకటి అందుతుంది. కొన్ని దేశాలలో పాత కాలం వజ్రాలు, విలువైన జాతి రత్నాలు దొంగిలించబడుతున్నాయట నార్వేదేశంలో అత్యంత ప్రాచీనమైన రెండు వజ్రాలున్న కంటైనర్ ఒకటి ఆఫ్రికా ఎడారులలో మిస్సయిందట. దాన్ని ట్రేస్ చేసి అప్పగించాలి. ఇంటర్‌పోల్ డైరక్టర్ గ్రిఫోర్డ్ విన్నపంతో ఆ ఎస్సైన్‌మెంట్ ఒప్పుకుంటాడు షాడో. ఇప్పటివరకు గుండాలు, రౌడీలు, దొంగలు వంటి మాములు సాంఘిక నవలలా సాగిన కథ క్రమంగా జానపద సరళిలోకి మారుతుంది. షాడోని, అతని వెంట వచ్చిన వ్యక్తిని కొందరు ఆటవిక జాతుల వాళ్ళు పట్టుకుని మరో నాగరిక నేరస్తుల గుంపుకి అప్పగిస్తారు. వీళ్ళతో జరిగే పోరాటాలు, యుద్ధాల నేపధ్యంలో కథ జానపదం వైపు మళ్ళడానికి బీజం పడుతుంది. రకరకాల వజ్ర్రాలను సేకరించి మిట్టమధ్యాహ్నం సూర్యకిరణాలు వాటి మీద పడే సమయంలో పసిపిల్లల రక్తంతో వజ్రాలను తడిపితే ఓ అద్బుతమైన, సుసంపన్నమైన లోకంలోకి ప్రవేశించగలుగుతారనే నమ్మకంతో ఈ దురాగతాలకి ఒడిగడుతోందో ముఠా.

అనుకున్నట్లుగానే ఆ విలువైన రంగురాళ్ళ మీద సూర్యకాంతి పడగానే ఓ ప్రకాశవంతమైన మెరుపుతో కూడిన ఆవరణ కనబడుతుంది. మాయమైన వజ్రాల కంటైనర్ కంటబడడంతో, దాన్ని మీదకి దూకే క్రమంలో షాడో ఆ కాంతి వలయంలో పడి కొత్త లోకంలోకి అడుగుపెడతాడు. ఇక ఇక్కడి నుంచి కథంతా జానపద రీతిలో సాగుతుంది. నగరంలోని సంపన్నులు బీదల్ని ఊరికి దూరంగా ఉంచడం, హేళన చేయడం గమనిస్తాడు షాడో. తనకి ఆశ్రయం ఇచ్చిన కుటుంబనికి మేలు చేసి, ఓ వర్తకుడి పటాలంలో చేరి వలీదా నగరంలో అడుగుపెడతాడు. వర్తకుడిని, వర్తకుడి కూతురిని ఆ నగరపు ఖైదు చేయించడంతో, రాజు ముందుకు వెళ్లక తప్పదు షాడోకి.

షాడో లాంటి వీరుల కోసమే తానింత కాలం ఎదురుచూస్తున్నట్లు చెబుతాడా రాజు. షాడోని ఓ సాయం చేయమని అడుగుతాడు. అది ఎంత ప్రమాదకరమో, ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుందో ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరిస్తాడు షాడో. బదులుగా, వర్తకుడిని అతని కూతురిని విడుదల చేయమంటాడు. రాజు షాడోని ఓ గదిలోకి తీసుకువెడతాడు. రాజుగారి కొడుకు అక్కడ అపస్మారక స్థితిలో ఉంటాడు. ఏదో విషజంతువు గాయపరచడం వల్ల అతను ప్రమాదంలో చిక్కుకున్నాడు. విషం ప్రాణాలు తీయకుండా చేయగలిగిన వైద్యులు అతనికి స్పృహ తెప్పించడంలో మాత్రం విఫలమయ్యారు. “ఇక్కడికి పదిరోజుల ప్రయాణంలో సులోమీ పర్వతాలున్నాయి. ఆ పర్వతాల్లో వున్న పిశాచాలకు చిక్కి ప్రాణాలు పోగొట్టుకోకుండా అవతలి ప్రక్కకు చేరుకోగలిగితే సువిశాలమైన సులోమీ మైదానప్రాంతం అగుపిస్తుందిట…. రకరకాల రాజ్యాలు, వివిధ రకాల నగరాలు కలిగివుండే ఆ మైదాన ప్రదేశంలో ఎక్కడో దట్టమయిన అటవీప్రాంతం ఒకటి వున్నదిట….. ఆ అడవిలో రుద్రాణి అనే పువ్వు దొరుకుతుందిట_ ఆ రుద్రాణి పుష్పంతో తయారుచేయబడిన లేపనాన్ని ఉపయోగిస్తే నా కుమారుడు ఆరోగ్యవంతుడవుతాడని వైద్యులు చేపుతున్నారు. నువ్వు ఆ పుష్పాన్ని తెచ్చిపెట్టాలి” అన్నాడు రాజు.

కథ క్రమంగా అంతిమ ఘట్టానికి చేరుకుంటోంది. రుద్రాణి పుష్పం కోసం ఆ పర్వతాలలో అడుగుపెడటాడు షాడో. ఎన్నో ప్రమాదాలను ఎదుర్కుంటాడు. ఓ ముసలామె షాడోకి ఆతిథ్యం ఇచ్చినట్లే ఇచ్చి, అతని గుర్రాన్ని చంపి ఆ మాంసంతో విందు చేసుకోవాలనుకుంటుంది. తోటి ముసలాళ్లందరిని పిలుస్తుంది. వారు షాడో మీద పడగా, వారితో పోరాటం పూర్తయ్యేసరిక్ తెల్లారిపోతుంది. కాలినడకన ఇంకో పర్వతం వద్దకు చేరుతాడు. అక్కడో రెండు ఆటవిక జాతులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోగా, ఒక ఆటవికలు గుంపు మరో గుంపుని పూర్తిగా తుడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న షాడో వారందరిక్ సామూహిక దహన సంస్కారాలు చేస్తాడు. వాళ్ల పిల్లలతో కలసి, శత్రుస్థావరం వైపు వెడతాడు. ఉపాయంతో వారిని అణచివేసి, పిల్లల తల్లిదండ్రులను విడిపిస్తాడు.

అక్కడి నుంచి బయల్దేరి మూడో పర్వతం వద్దకి చేరగానే పురాణాలలోని గండభేరుండ పక్షి లాంటి అతి పెద్ద రాక్షస పక్షి షాడో మీద పడుతుంది. అది తన పిల్లలకి ఆహారంగా షాడోని ఎత్తుకెళ్ళి ఓ చీకటి గుహలో పడేస్తుంది. అక్కడ్నించి తప్పించుకోవాలంటే అది ఇంకో ఆహారాన్ని తెచ్చినప్పుడు దాని కాళ్ళు పట్టుకుని దాంతో పాటు గాల్లోకి ఎగరడం తప్ప మరో మార్గం కనపడదు. ఆ ప్రయత్నంలో పక్షి గాయపడి తప్పించుకోడంతో లోయలోకి దిగి నడక సాగిస్తాడు షాడో. ఓ వాగు వద్ద కొంతమంది మనుషులు ఎదురయితే వారితో పాటు అడవిలో కట్టెలు కొట్టి వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడి గ్రామపెద్దను రుద్రాణి పువ్వు గురించి అడుగుతాడు.

ఇంతలో గండభేరుండ పక్షుల గురించి దండోరా వినబడుతుంది. ఆ ప్రాంతపు రాణి ఆ దండోరా వేయిస్తోంది. గండభేరుండ పక్షుల గ్రామలపై దాడి చేస్తున్నయాని, సురక్షితంగా ఉండండి అంటూ రాణి చేసిన ప్రకటన అది. అక్కడ జరిగిన ఓ సంఘటన వలన షాడోని రాణి గారి ముందు ప్రవేశబెడతారు. ఇక్కడ నుంచి నవలలోని చివరి అంకానికి తెరలేస్తుంది. రాణి గారి శత్రువుని నిర్మూలించే క్రమంలో షాడో దట్టమైన ఓ లోయలోకి జారిపోతాడు. ఎందరెందరో చేరాలని ప్రయత్నించిన ఆ అద్భుతమైన, సుసంపన్నమైన లోకమే అది. ఎక్కడ చూసినా, బంగారం… వజ్రాలు… జాతి రత్నాలు ఉన్నాయక్కడ. అంతే కాదు వజ్రాల కంటైనర్‌ని దొంగిలించిన అగంతకుడు కూడా కనపడ్డాడు. పోరాటాలూ, సాహసాలు ముగిసాక, షాడో ఆ వజ్రాల కంటైనర్‌ని చేజిక్కించుకుంటాడు. వలీదా రాజుకి రుద్రాణి పుష్పం అందిస్తాడు. తను వచ్చిన పని ముగిసింది కాబట్టి తిరిగి మామూలు ప్రపంచంలోకి అడుగుపెట్టాలని అనుకుంటూ వజ్రాలపై సూర్యకాంతి పడేలా చేసుకుని విజయం సాధిస్తాడు. ఆ క్రమంలో వెలువడిన పొగ ఉక్కిరిబిక్కిరి చేయడంతో స్పృహ కోల్పోతాడు. తెలివి వచ్చేసరికి ఇంటర్ పోల్ ఏజంట్లు, తన మిత్రుడు సమీర్ కనబడతారు. ఎప్పటిలాగే ఎస్సైన్‌మెంట్‌ని విజయవంతంగా ముగించినందుకు ఇంటర్‌పోల్ షాడోని అభినందిస్తుంది.

వీధి గుండాల పోరాటాలతో సాంఘిక గాధగా మొదలై, ఆటవికుల, జంతువులు మధ్యగా సాగి రాజులు, రాణులు, సైనికులు, కుట్రలు కుతంత్రాలతో జానపద కథగా మారి మళ్లీ డిటెక్టివ్‌లు, సీక్రెట్ ఏజెంట్ల రాకతో థ్రిల్లర్‌గా మారిన ఈ నవల చివరిదాక ఆసక్తికరంగా సాగి పాఠకులకి అమితాసక్తిని కలిగిస్తుంది.

రుద్రాణి నవల డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

రుద్రాణి On Kinige

కొల్లూరి సోమ శంకర్

Related Posts: