మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు పుస్తకం పై ది. 29 జనవరి 2012నాటి ఆంధ్రభూమి దినపత్రిక -అక్షర పేజీలో ” ‘బ్లాగ్’ వనంలో విరబూసిన జాజి పరిమళాలు” అనే శీర్షికతో ఓ సమీక్ష ప్రచురితమైంది.
అందమైన గతానికీ, ప్రస్తుత అయోమయానికీ మధ్య ఒక వారధి కట్టిన కథలేవైనా పాఠకులని సులువుగా ఆకట్టుకుంటాయని సమీక్షకులు సాయి పద్మ మూర్తి అభిప్రాయపడ్డారు. మల్లీశ్వరిగారి ‘‘జాజిమల్లి’’ బ్లాగ్ కథలు అలాంటివేనని అంటూ, ‘‘పెరస్పెక్టివ్’’ ప్రచురణల ద్వారా ప్రచురితమైన ఈ బ్లాగ్ కథలు మనల్ని హడావిడి పెట్టవని, నిశ్శబ్దంగా మన హృదయాల్ని కొల్లగొడతాయని అన్నారు సమీక్షకులు .
ఈ బ్లాగ్ కథలను చదువుతుంటే చెఖోవ్ కథలు గుర్తొస్తాయని, ఒక ఫ్లాష్ లాంటి కొసమెరుపు, చమక్కు ఉండటం వీటి ప్రత్యేకత అని అన్నారు సమీక్షకులు .
మనందరి ఉరుకుల పరుగుల జీవితాల్లో, పెద్ద పెద్ద కథలు చదవటం కష్టం అయిపోతోంది.. బరువైన పుస్తకాల వైపు ఆశగా చూస్తూ.. పుస్తకం సైజు చూసి చదవలేకపోతున్నాం అనే వాళ్ళకి.. గడిచిపోతున్న జీవితాన్ని, మోడువారిపోతున్న ఆశల తోటలకీ, తామే తోటమాలులు ఎలా కావాలో సూటిగా, సరళంగా చెప్తుందీ పుస్తకం అని సమీక్షకులు పేర్కొన్నారు.
పూర్తి సమీక్షని ఈ లింక్లో చదవగలరు.
జాజిమల్లి బ్లాగ్ కథలు పుస్తకం డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్ని అనుసరించండి.
జాజిమల్లి బ్లాగ్ కథలు On Kinige