“శ్రీ గజానన్ తామన్ గారికి,
నమస్కారం.
మీరు ఆప్యాయంగా పంపిన “మానస సరోవరం” అందింది.
మాత్రాచ్ఛందో భరితంగా గేయం రచించినా, వచన కవిత రాసినా మీ సృజనాత్మకత ప్రతి కవితలో అగుపిస్తున్నది.
మీ గేయరచనా పటిమకు”నేటి నా గీతం” అనే కవిత ప్రబల సాక్ష్యం. మీ కవితల్లో వస్తు వైవిధ్యం ఉంది. అభివ్యక్తి గాఢత్వం ఉంది. చాలా సంతోషం.
అక్కడక్కడ కొన్ని వచనకవితలున్నా, మీ రచన వివిధ గేయగతుల్లో సాగింది. వైదికాంశాలను, పౌరాణికాంశాలను భూమికలుగా తీసుకొని మీరు చక్కని కవితలు రచించారు. కొన్ని కొన్ని కవితల్లో భావుకతతోపాటు, సామాజిక చేతన కూడా వుండడం ప్రశంసనీయం.
మీ
సి.నారాయణరెడ్డి
* * *
గజానన్ తామన్ రచించిన “మానస సరోవరం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. వివరాలకు ఈ క్రింది లింక్‌ను అనుసరించండి.