మిసిమి జులై 2011–సంపాదకీయం

నటరాజ రామకృష్ణ అనే వ్యక్తి పుట్టకపోతే మన నాట్యరీతులు – ముఖ్యంగా ఆలయ నృత్యాలు, లాస్య సంప్రదాయానికి చెందిన నాట్యము, తాండవ సంప్రదాయానికి చెందిన పేరిణి – వీటికి వ్యాకరణము – రూప విన్యాసాలు అక్షరబద్ధమయ్యేవి కావేమో. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి నాట్యాన్నే ఆరాధించి, చివరి శ్వాసవరకూ ఆ కళకే సేవచేసిన కారణ జన్ముడు, సౌమ్యుడు రామకృష్ణ అస్తమయంతో ఒక శకం ముగిసింది. వీరు 47 గ్రంథాలు వ్రాశారంటే నమ్మలేరేమో. వాటినన్నిటినీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.

మిసిమి జులై 2011 On Kinige

 

తయ్యబ్ మెహతా, రజా, సౌజా, సతీష్ గుజ్రాల్ లాంటి దిగ్గజాల సరసన చేరిన హుస్సేన్ ఇంటికి తిరిగి రాలేక ఎక్కడో తనువు చాలించడం భారతీయులకు విచారకరమైన విషయమే. ఆయనకు నివాళిగా కొన్ని చిత్రాలు ముద్రిస్తున్నాం.

‘యానాం చరిత్ర’ ఎంతటి కల్లోలమయిందో – కరువు రక్కసి ఎంతటి దారుణాలు చేస్తుందో తెలుసుకుంటే ద్రవించి పోతాము.

ఎన్నో జానపద కళల్లో ‘దొమ్మరాట’ ఒకటి – దీనిని కేవలం పొట్టకూటికే ఆశ్రయించి – ప్రాణాలకు తెగించి ఇప్పటికీ రహదారుల ప్రక్కన చిన్నారులు – కన్న తల్లులు కూడా ప్రదర్శించటం సమాజ రుగ్మతలలో ఒకటే కాని – ఇది కళా పోషణ కాదు.

ఒక ఊరికి పేరు ఎవరు పెడతారు? అది ఆ విధంగా ఎందుకు ప్రచారం పొందుతుంది? దీని గురించి విశ్వవిద్యాలయాల్లో ‘నామ విజ్ఞానం’ (Onamastics) ఒక శాఖే వున్నది. ఇది ఒక పరిశోధనే.

మిసిమి కి ఎప్పటినుంచో అనేక వ్యాసాలు వ్రాసిన ఉమ్మడిశెట్టి శివలింగం ఇక లేరని తెలియచేయటానికి విచారిస్తున్నాం.

 

To buy eBook visit now @ http://kinige.com/kbook.php?id=228

Related Posts:

మిసిమి–జూన్ 2011

ఏడాది క్రితం మిసిమి సంపాదకులం సంచిక తీరుతెన్నులు పునర్మూల్యాంకనం చేయ సంకల్పించి, అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుని చర్చలు చేశాము.

తరువాత పరిమాణం, పరిమితులు నియమించుకుని నూతనరీతిలో పాఠకుల ముందుకు మిసిమిని తీసుకువచ్చాము. మార్పులు ఆహ్లాదకరంగా వున్నాయని, వ్యాసాలు చదివేందుకు సరళంగా వున్నాయని, విషయసూచికలు సమాజహితం కోరే విధంగా ఉన్నాయని, రూపురేఖలు కనులకింపుగా వున్నాయనీ ఎక్కువ శాతం పాఠకులు తమ ఉత్తరాల ద్వారా తెలియజేశారు. ఇంత మార్పు అవసరమా ? ఇది మేధావుల పత్రిక కదా అన్నవారూ లేకపోలేదు. ఇప్పటికి పన్నెండు సంచికలు క్రొత్త మూసలో వచ్చినా, మేము ప్రతినెలా ఒక పరీక్షగానే చూస్తున్నాము. ఈ ప్రస్థానంలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు మిసిమి కి సహకరించి ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ – వారి సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.

మిసిమి జూన్ 2011 On Kinige

మేము ముఖ్యంగా దృష్టి పెట్టింది – తెలుగు నుడికారం, జాతి చరిత్ర, వ్యక్తుల కథనాలు, ప్రపంచ, జాతీయ సాహిత్యం-ఇవే గాక సంగీత, నాటక, నృత్యరూపకాలపై కూడా వీలయినంత సమాచారం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాము. అయితే సాహిత్యపరంగా ఎటువంటి కొరత రాకపోయినా, మిగతా సారస్వత శాఖలపరమైన రచనలు అంతగా అందుబాటులో లేకపోవటం-ఆ విధంగా పాఠకులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామనే ఇబ్బందికి గురికాక తప్పటంలేదు. నాటకం, శాస్త్రీయ సంగీతం – వివిధ నాట్య రీతుల గురించి వ్రాసేవారిని గుర్తించి వారి సహకారాన్ని పొందటం మాకు సంకటంగానే వుంటోంది.

ఇక భాష విషయంలో ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? ఇప్పటికీ నన్నయ్య, తిక్కనాది ప్రబంధ కవుల కవిత రీతులు – శ్రీనాథ, సోమనాథకవుల ప్రౌఢిమను తెలియజెప్పే విశ్వవిద్యాలయ సెమినార్ పత్రాలే వస్తున్నాయి – లేదా గురజాడ అప్పారావు కన్యాశుల్కం, శ్రీరంగపు శ్రీనివాసరావు మహాప్రస్థానమే ప్రధాన వస్తువులైన ‘ఆధునిక’ వ్యాసకర్తల రచనలూ వస్తున్నాయి. గురు-శిష్య ప్రచార వ్యాసపరంపరలకు అంతగా ఎదురు చూడవలసిన పని వుండటం లేదు.

గత దశాబ్దపు కవితారీతులు – కథా సంకలనాలు, నవలా పోకడల గురించి ముదింపుజేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇప్పటికి వచన కవితల తీరుతెన్నులు మూల్యాంకనం కొంతవరకు ఇవ్వగలిగాము. ఇంకా కథ – నవలల విషయాలలో మా ప్రయత్నం – అభ్యర్థనలతోనే నడుస్తోంది.

ఎంతో ఉత్సాహంగా ‘కవిత’లను ప్రోత్సహించాం. ఉద్విగ్నత, బావసాంద్రత ఏ విధంగా వుంటే పాఠకులను చదివించగలమో తీరూ-తెన్ను చూపే కవితలను అందించాం. లబ్ద ప్రతిష్ఠుల కవితావాహినులే మమ్ములను ముంచెత్తుతున్నాయి గాని, మా ప్రయత్నం అంతగా సఫలం కాలేదనే అంగీకరిస్తున్నాము.

ఈ సంచికలో ప్రముఖమైన ప్రసంగ వ్యాసం కులదీప్ నాయర్‌ది. అఖండ భారతాన్ని చీలికలవడం కళ్ళారా చూసిన పాత్రికేయుడు – మహాత్ముని చివరి క్షణాలను దగ్గరగా చూడగలిగిన ప్రత్యక్ష సాక్షి – నేటి ప్రసార మాధ్యమాల దుస్థితి – దిగజారుడు తనం గురించి ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు. అంతకంటే దారుణం – ఏ దేశ స్వాతంత్ర్యం కోసం – స్వపరిపాలనకోసం అసువులు బాసిస బాపు-ఆశయం ఇప్పటి ప్రజాస్వామ్యపు విపరీత ధోరణులు – వాక్ స్వాతంత్ర్యం పేరుతో మాధ్యమాలు సృష్టిస్తున్న గందరగోళ పరిస్థితులు, అదే దేశాన్ని ఎంత అధోగతికి మళ్లిస్తున్నాయో ఆలోచిస్తే – ‘సత్యాగ్రహం’ కలుగుతుంది. ప్రపంచంలో మరోచోట ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాట్లు జరుగుతున్నాయి – మన దేశంలో ప్రజాస్వామ్యపు దుష్పరిపాలనపై హజారే లాంటి వాళ్లు తిరుగుబాటు చేయాల్సివస్తోంది!

మిసిమి పుటలను విలువైన, కాలాతీతమైన పరిశోధక, చారిత్రక, మానవశాస్త్రపరమైన రచనలతో పరిపుష్టం చేయాలని, ‘చింతనాత్మక సారస్వతం’తో పాఠకులకు మరింత చేరువ కావాలనే ప్రయత్నంతో మరో సంవత్సరంలో ఈ ‘పునర్వికాస సంచిక’ తో అడుగు పెడుతున్నాము.

- సంపాదకులు.

To buy eBook of Misimi June 2011 visit now http://kinige.com/kbook.php?id=198

Related Posts:

మిసిమి మే 2011–సంపాదకీయం

 

ఇప్పుడు మిసిమి మాస పత్రిక ఈ పుస్తకం రూపంలో కినిగెపై లభిస్తుంది. వివరాలు ఇక్కడ http://kinige.com/kbook.php?id=171 

 

 

మిసిమి మే 2011 On Kinige

సంప్రదాయంలో బుద్ధ జయంతి మూడు ప్రత్యేకతలను సంతరించుకుంది. సిద్ధార్థుడు వైశాఖ పూర్ణిమనాడే జన్మించాడు. ముప్పది అయిదేండ్ల తర్వాత ఉరువెల (ఇప్పటి గయ)లో నేరంజనానది ప్రక్కన బోధివృక్ష ఛాయలో సంబోధి ప్రాప్తమయింది. ఎనబదిఏండ్లకు అదే దినాన కుసినార (ఇప్పటి ఉత్తరప్రదేశ్) వనంలో మహాపరినిర్వాణం చెందాడు. థేరవాద బౌద్ధం ప్రకారం – బుద్ధుడు 2555 సంవత్సరాల క్రితం నిర్వాణం చెందాడని విశ్వసిస్తారు. మహాయాన సంప్రదాయ ప్రకారం బుద్ధుని పరినిర్వాణం క్రీ.పూ. 483 నాటికి లెక్కించబడింది. భారతదేశంలో ప్రచారంలో వున్న మూడు కాలమాన లెక్కల పద్ధతుల్లో బౌద్ధశకం పురాతనమైనది. మిగిలిన రెండు శాలివాహన, విక్రమనామ శకాలు.

ఈ నెల మిసిమి బుద్ధ జయంతి ప్రత్యేకం.

బౌద్ధ సంబంధమైన అనేక విషయాలపై వ్యాసాలు అందిస్తున్నాం. ముఖ్యంగా తెలుగువారి జీవనంతో వేయిసంవత్సరాలపైగా పెనవేసుకుని పోయిన విశ్వాసంగా పేరొందినది బౌద్ధధర్మం. దురదృష్టవశాత్తు అనేక కారణాలవలన (అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రామాణికంగా చూపినవి కొన్ని ఈ సంచికలోనే ఉన్నవి.) భారతదేశంలో బౌద్ధం క్షీణించి పొరుగుదేశాలకు వలస పోవలసి వచ్చింది. ఇందుకు దోహదం చేసినది – సాంఘీకంగా ప్రజలను కుల – వర్గాలుగా చీల్చిన శక్తులు మాత్రమే. ఈ ప్రమాణాలే ప్రజలను అస్పృశ్యులుగా, అంటరానివారిగా అణచి అవిద్యకు కారణమైనవి.

ఇప్పటికైనా మనం మేల్కొని ఈ అనైతికమైన మాయాజాలం నుంచి బైటపడి కులవిభజనల కుయుక్తులను అధిగమించి సాంఘీక పునర్వికాసం సాధించవలసి వుంది.

తెలుగునాట బౌద్ధధర్మ ప్రాశస్త్యాన్ని, చరిత్రను వీరనారాయణ రెడ్డి వ్యాసంలో విపులంగా వివరించారు.

ఆచార్య నరేంద్రదేవ్ వ్రాసిన ‘బౌద్ధధర్మ దర్శన్’ బృహద్గరంథాన్ని సవివరంగా సమీక్షించిన సంజీవదేవ్, బౌద్ధధర్మ చరిత్రను సంక్షిప్తంగా మన కళ్ళ ముందుంచారు.

‘త్రిరత్న వందనం’ మన కందించినవారు బొర్రా గోవర్ధన్. వీరి బౌద్ధ సాహిత్యానువాదాలు ఇటీవలనే వెలుగులోకి వస్తున్నాయి. ‘ధర్మచేతన’ కవిత – తియ్యగూర సీతారామి రెడ్డి ఎంతో ఆర్తితో వ్రాశారు.

బుద్ధఘోషుని ‘విపశ్యన – మనోవిశ్లేషణ’ ఫ్రాయిడ్ మనోవిజ్ఞానిక సిద్ధాంతాలకు, బౌద్ధములోని ధ్యాన ప్రక్రియలకు వున్న సంబంధాలను, ఇప్పటికీ అనుసరణీయమైన ప్రాధాన్యతను వివరిస్తోంది.

చంద్రశేఖర్, బుద్ధుని జీవితాన్ని నిశ్శబ్ద విప్లవంగా వర్ణించారు. భదంత ఆనంద కౌసల్యాయన్ – భారతదేశంలోని కులవ్యవస్థలను, సాంఘీక దురాచారాలను సహేతుకంగా గర్హించారు.

ఎన్నో వ్యాసాలు – లబ్ధ ప్రతిష్ఠులు వ్రాసినవే – చోటు లేకపోవటమనే ఒకే కారణంతో ప్రచురించలేక పోతున్నాం. వీలుకల్పించుకొని మునుముందు అందించగలమని మనవి చేస్తూ…

- సంపాదకులు

మిసిమి మే 2011 On Kinige

Related Posts:

మిసిమి ఏప్రిల్ 2011 సంపాదకీయం

మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

గడచిన దశాబ్దంలోని వివిధ సారస్వత ప్రక్రియల పరిశీలన చేయాలని సంకల్పించి రచయిత లెందరినో అడిగాము. మొదటగా కవిత్వధోరణులు గూర్చి తమ అమూల్యమైన పరిశీలనా వ్యాసాలను అందించిన వారు వేగుంట మోహనప్రసాద్. మొదటి భాగం ఈ నెల ప్రచురిస్తున్నాము.

‘నటరత్నాల’ను తెలుగువారికి అందించిన నటరత్నం మిక్కిలినేని అన్ని జానపద కళారూపాల సమాహారం! వారి నిష్క్రమణకు నివాళి.

తెలుగు పాఠకుల, ప్రేక్షకుల మనసుల్లో నవ్వుల జల్లులు కురిపించిన ముళ్ళపూడి వెంకటరమణ ‘కోతి కొమ్మచ్చి’ ఆటలో ఎటో వెళ్ళిపోయారు.

తన అనుభవాలను, ఆలోచనలతో రంగరించి, ఊహలతో రంగులద్ది సార్వజనీనత సాధించిన బషీర్ తన కథలను వినోద సమాసాలుగా పాఠకులకు అందించారు.

ఉగాది వచ్చింది, ఎన్నో సమస్యలతో. సమస్య లేకపోతే పరిష్కారమూ ఉండదు కదా! ఇల్లు వదినిల దగ్గరనుంచి మళ్ళీ ఇంటికి చేరేవరకు కనపడని శత్రువుతో పోరాటం సాగిస్తూ అలసిపోతున్న సగటుమనిషికి పండగ రోజే కాస్త ఊరట!

మే నెల సంచిక ‘బుద్ధ జయంతి’ ప్రత్యేకం. బౌద్ధతత్వాన్ని, సాహిత్యాన్ని ఆకళింపు జేసుకుని తెలుగులో సరళంగా తెలియజేయగలిగిన రచనలు ప్రచురిస్తామని తెలియజేస్తూ ఈ దిశగా రచనలు పంపవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.

– సంపాదకులు మిసిమి – ఏప్రిల్ 2011 On Kinige

 

This wonderful magazine is now available for just 30Rs in Digital format on Kinige. Click on above thumbnail for more details.

Related Posts: